-
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ మొదటిలో పర్వాలేదన్పించిన గిల్.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు. స్లో వికెట్‌పై ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడానికి గిల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఆడిన గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్.. విజయ్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ ఔట్ కాగానే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియన్ క్రికెట్ ప్రిన్స్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 32.22 సగటుతో 322 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్‌బై జాబితాలో గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. pic.twitter.com/tjQXP5LDRS— Rajgeeta Yadav (@rajgeetacricket) May 4, 2024 -
ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
టీ20 ప్రపంచకప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తమ తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.అదే విధంగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తాము జట్టును ఎంపిక చేయలేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా జూన్ 1న వరల్డ్‌కప్ మొదలుకానుండగా.. టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత జట్టు తరఫున కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో చోటు దక్కదని భావిస్తున్నారు.అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయిఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ..‘‘ప్రస్తుతం మాకు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఓపెనింగ్ జోడీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.వెస్టిండీస్‌కు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితుల ఆధారంగా మా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకుంటాం. నిజానికి చాలా మంది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు.కానీ మేము ఎప్పటి నుంచో ఈ ఫార్మాట్లో జట్టు కూర్పు గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. చాలా కాలం క్రితమే 15 మంది సభ్యుల జట్టు గురించి తుది నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా మేము మా ప్రణాళికలు మార్చుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ప్రదర్శన ఇలాకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్‌లలో కలిపి 315 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లి ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ 10 మ్యాచ్‌లలో కలిపి 500 పరుగులు రాబట్టాడు. ఇక యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతూ 9 మ్యాచ్‌లలో కలిపి కేవలం 249 పరుగులే చేశాడు.అయితే, ఓపెనింగ్ స్థానం కోసం జరిగిన పోటీలో జైస్వాల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కానీ.. ఐపీఎల్-2024లో ప్రస్తుతం 509 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం
టీ20 ప్రపంచకప్-2024 జట్టు ప్రకటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయాలపై మాజీ కెప్టెన్ క్రిష్టమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. తమకు ఇష్టమైన ఆటగాళ్ల ప్రదర్శన బాగా లేకపోయినా వారికి వరుస అవకాశాలు ఇస్తోందంటూ మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.తమకు నచ్చిన వాళ్లను ఎంపిక చేసేందుకు.. అర్హత కలిగిన ఆటగాళ్లను పక్కనపెట్టడం ద్వంద్వనీతికి నిదర్శనం అంటూ బీసీసీఐ విధానాలను విమర్శించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది.ఐర్లాండ్‌తో జూన్ 5 నాటి మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.శుబ్‌మన్ గిల్ అసలు ఫామ్‌లోనే లేడుఇందులో ఓపెనర్ల కోటాలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చోటు దక్కించుకోగా.. శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘‘శుబ్‌మన్ గిల్ అసలు ఫామ్‌లోనే లేడు.అయినా అతడికి జట్టులో స్థానం కల్పించారు. నిజానికి రుతురాజ్ గైక్వాడ్‌కు టీమ్‌లో ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. 17 ఇన్నింగ్స్‌లో 500 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టు మీద సెంచరీ చేశాడు.కానీ సెలక్టర్లకు శుబ్‌మన్ గిల్ మాత్రమే కనిపిస్తాడు. వరుసగా విఫలమైనా అతడికే ఛాన్సులు ఇస్తారు. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్లోనైనా వరుస వైఫల్యాలు జట్టులో అతడి స్థానాన్ని ప్రశ్నార్థకం చేయలేవు.తమకు నచ్చిన ఆటగాళ్లకేసెలక్షన్ విషయంలో ఫేవరిటిజం ఉంది. తమకు నచ్చిన ఆటగాళ్లకే సెలక్టర్లు అవకాశం ఇచ్చారు’’ అంటూ తూర్పారబట్టాడు. తన యూట్యూబ్ చానెల్ చీకి చిక్కా వేదికగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లో కలిపి 509 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు.. శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా, ఆటగాడిగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 320 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో చిక్కా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: వరల్డ్‌కప్‌కు సెలక్టయ్యాడు.. వెంటనే డకౌటయ్యాడు! వీడియో “Gill playing ahead of Rutu baffles me. Be is out of form and Rutu has had a better t20i career than gill. Gill will keep failing and he ll keep getting chances, he has favouritism of the selectors, this is just too much of favouritism” Krishnamachari Srikanth in his YT vid pic.twitter.com/PJmeiihxVx— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 (@SergioCSKK) May 1, 2024 -
గ్రీన్ సూపర్ క్యాచ్.. గిల్‌ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
T20 WC: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటివ్వకపోతే..: శుబ్‌మన్ గిల్
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియాలో తన స్థానం గురించి యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ మీదనే ఉందని.. గుజరాత్ టైటాన్స్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పాడు.ఒకవేళ ఐసీసీ టోర్నీ ఆడే భారత జట్టులో తనకు చోటు దక్కకున్నా.. సహచర ఆటగాళ్లను చీర్ చేస్తూ వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తానని గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే.. టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా జట్టును వీడాడు.టైటాన్స్ కెప్టెన్‌గా కొత్త బాధ్యతలుముంబై ఇండియన్స్ గూటికి చేరి కెప్టెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం శుబ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అతడి సారథ్యంలో టైటాన్స్ ఇప్పటి వరకు ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక వ్యక్తిగతంగానూ శుబ్‌మన్ గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. గత సీజన్లో 17 ఇన్నింగ్స్ ఆడి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఈసారి 9 ఇన్నింగ్స్‌లో కలిపి 304 పరుగులు చేశాడు.రోహిత్‌కు జోడీగా విరాట్ కోహ్లిఇదిలా ఉంటే.. మే 26న ఐపీఎల్-2024కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మే 1 నాటికి జట్లను ఖరారు చేయాలని ఐసీసీ ఈ ఈవెంట్లో పాల్గొనే 20 దేశాల బోర్డులను ఆదేశించింది.ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడుతూ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.గత సీజన్లో దాదాపు 900 రన్స్ చేసినా.. చోటివ్వకపోతే‘‘టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక అవుతానా లేదా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఐపీఎల్లో నా ఫ్రాంఛైజీ నన్ను నమ్మి కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు నా మొదటి ప్రాధాన్యం గుజరాత్ టైటాన్స్.. ఈ జట్టుతో ముడిపడిన ఆటగాళ్లు మాత్రమే. అదే విధంగా నా జట్టు కోసం ఓ బ్యాటర్‌గా వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని భావిస్తున్నా. ఇక ఆటగాడిగా నేను సొంతగడ్డపై టీమిండియా ఆడిన వన్డే వరల్డ్‌కప్ నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం ఎంతటి అదృష్టమో తెలుసుకోగలిగాను.ఫామ్‌లో ఉన్న కోహ్లిఅయితే, గత ఐపీఎల్ సీజన్లో దాదాపుగా 900 పరుగులు చేసిన నాకు జట్టులో చోటు దక్కకపోతే నేనేమీ చేయలేను. సహచర ఆటగాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తప్ప’’ అని శుబ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు. కాగా విరాట్ కోహ్లి ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.చదవండి: Virat Kohli: చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్! వీడియో వైరల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement