-
పెద్దనాన్నలా ట్యూన్లు కట్టలేను కావాలంటే...
ఇసైజ్ఞానిలా ట్యూన్లు కట్టలేను కావాలంటే ఆయనలా డ్రస్ ధరించగలను అని చెప్పానని నటుడు, సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ పేర్కొన్నారు. ట్రిపుల్ వి.రాకార్డ్స పతాకంపై ఇంతకు ముందు ఎన్నమో నడక్కుదు వంటి విజ యవంతమైన చిత్రాన్ని అందించిన వీవీ.వినోద్‌కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం అచ్చమిండ్రి. విజయ్‌వసంత్,సృష్టిడాంగే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, రాధారవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతదర్శకుడు ప్రేమ్‌జీ మాట్లాడుతూ విజయ్‌వసంత్ హీరోగా వినోద్‌కుమార్ చిత్రం నిర్మించనున్నారని చెప్పగానే దానికి తానే సంగీతదర్శకుడినని అన్నానన్నారు.అందుకు వారూ అంగీకరించారని తెలిపారు.అంతే కాదు ఇకపై వారు రూపొందించే చిత్రాలు తానే సంగీతదర్శకుడినని, ఇది మాటలతో కుదుర్చుకున్న ఒప్పందం అని చెప్పారు. ఇకపోతే తాను తన పెద్దనాన్న(ఇళయరాజా) పాటల ట్యూన్సను కాపీ కొడుతున్నానని చాలా మంది అంటున్నారన్నారు. నిజమే తాను తన పెద్దనాన్న ట్యూన్సనే మార్చి రూపొందిస్తున్నానని ఒప్పుకుంటున్నానన్నారు. ఇసైజ్ఞాని సంగీతాన్ని అందరూ కాపీ కొడుతున్నారని, అలాంటిది తమ సొత్తు అరుున ఆయన సంగీతాన్ని తాను కాపీ కొట్టకూడదా?అంటూ ప్రశ్నించారు. తన దర్శక నిర్మాతలు ఇళయరాజా ట్యూన్సలా హారుుగా ఉండే పాటలను రూపొందించమని అడుగుతున్నారని, ఆయనలా సంగీతాన్ని అందించడం తన వల్లకాదు. కావలంటే ఆయనలా డ్రస్ ధరించగలనని చెప్పేవాడినని అన్నారు. అన్నట్టుగానే ఒక రోజు పెద్దనాన్నలా జుబ్బా, పంచె కట్టి, మెడలో రుద్రాక్షమాల ధరించి, హార్మోనియం చేతపట్టి ఫొటోలకు ఫోజులిచ్చానని తెలిపారు. వాటిని పోస్టర్‌గా ముద్రించి వాడవాడలా అంటించారని తెలిపారు.అలా పెద్దనాన్న ఇంటి గోడలకు అంటించడంతో అవి చూసిన ఆయన తనను పిలిచి ఏరా తనలా ఫోజులిచ్చి ఎగతాళి చేస్తున్నావా? అని అడిగారన్నారు. అందుకు తాను అదికాదు పెద్దనాన్నా మీ ట్యూన్సలా తనను కట్టమన్నారని, అలా తన వల్లకాదు కావాలంటే మీలా దుస్తులు ధరించి ఫొటో ఫోజులివ్వగలనని చెప్పానని తెలిపారు. వసంత్‌కుమార్, సంగీతదర్శకుడు యువన్రాజా, వెంకట్‌ప్రభు, చిత్ర హీరో విజయ్‌వసంత్, సృష్టిడాంగే, చిత్రనిర్మాత వినోద్‌కుమార్, దర్శకుడు రాజపాండే, ఆర్కే.సెల్వమణి, పొన్వన్నన్, రోహిణి పాల్గొన్నారు. -
అచ్చమిండ్రిగా మారిన శిఖండి
శిఖండి పేరుతో తెరకెక్కనున్న కొత్త చిత్రం పేరు అచ్చమిండ్రిగా మార్చారు. చెన్నై 28 చిత్రం ద్వారా పరిచయమైన నటుడు విజయ్ వసంత్ ఆ చిత్రం తర్వాత సోలో హీరోగా నటించిన కొన్ని చిత్రాలు ఆయనకు ఏ సక్సెస్‌ను ఇవ్వలేదు. దీంతో సోదరుడు వినోద్‌కుమార్ నిర్మాతగా, తాను హీరోగా నటించిన ఎన్నమోనడకుదు చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు రాజ పాండితో మళ్లీ చిత్రం చేయడానికి విజయ్ వసంత్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి మొదట శిఖండి అన్న పేరును అనుకున్నారు. తాజాగా అచ్చమిండ్రి పేరును నిర్ణయించారు. మేఘా, డార్లింగ్, ఎనకుల్ ఒరువన్చిత్రాల నటి సృష్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారు. హాస్య నటుడు ప్రేమ్‌జీ అమరన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగింది. వసంత్ అండ్ కో అధినేత వసంతకుమార్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు రాజ పాండి తెలుపుతూ, విద్యా విధానంలో జరుగుతున్న అనేక అవకతవకలను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో జరిగే హత్యలు, అవినీతి లాంటి విషయాలను వెలికి తీసి కథాంశంతో అచ్చమిండ్రి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. తొలి షెడ్యూల్‌ను 20 రోజుల పాటుగా చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించి, పాటలను విదేశాల్లో చిత్రీకరించినట్టు తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
అచ్చ తెలుగులో అన్నమయ్య కీర్తనలు
‘దివ్య’మైన భవిత
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
కలెక్టరేట్లో మోడల్ కౌంటింగ్ కేంద్రం
డీవైఈఓ పరీక్షకు పటిష్ట భద్రత
ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు
మీ సేవలు చాలిక!
వైభవం.. నృసింహుని రథోత్సవం
హుజూరాబాద్‌లో ప్రైవేట్ క్లినిక్‌ల తనిఖీ
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement