-
ఆ పాత్రను ఎన్టీఆర్ తప్ప ఇండియాలో మరొకరు చేయలేరు: కోన వెంకట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అదుర్స్ ఒకటి. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. చారి పాత్రలో ఎన్టీఆర్ పండించిన కామెడీ అంత ఇంతకాదు. ఇంతవరకు ఎప్పుడు ఎన్టీఆర్‌ని ఆ తరహా పాత్రలో చూడలేదు. బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చారి పాత్రను మరిచిపోరు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు ఎన్టీఆర్. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. తాజాగా ఆ చిత్ర రచయిత కోన వెంకట్ కూడా స్వీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా మంచి పాయింట్‌తో అదుర్స్ 2 తెరకెక్కిస్తామని, ఆ సినిమాకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడని కోన వెంకట్ అన్నారు. బుధవారం జరిగిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కోనవెంకట్ అదుర్స్ 2 అప్డేట్ ఇచ్చాడు. ‘అదుర్స్ 2 చేయాలని పక్కాగా అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. అవసరం అయితే నేనే తారక్ ఇంటిముందు ధర్నా చేసి మరీ సినిమాకు ఒప్పిస్తా. చారి పాత్రను ఎన్టీఆర్ తప్ప దేశంలో మరెవరూ చేయలేరు.ఎన్టీఆర్ కెరీర్లోనే అది బెస్ట్ మూవీ. ఆ క్యారెక్టర్, ఆ ఆహార్యం, ఆ మాడ్యులేషన్.. ఆ క్యారెక్టర్‌ను ఎన్టీఆర్‌లాగా చేసే వారు ఇండియాలోనే లేరు’ అని కోన వెంకట్ అన్నారు. -
ఈ అదృష్టం అందరికీ రాదు
కమెడియన్ రఘు విశాఖపట్నం ( పెదగంట్యాడ) : నటనకు అందం, శిక్షణ, ఇవేమీ లేకుండా కూడా కేవలం నటించాలనే తాపత్రయంతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘు. మామూలుగా రఘు అంటే ఎవరూ గుర్తు పట్టరు. అదుర్స్ సినిమాలో ఒక సీన్లో ‘కొవ్వు ఎక్కువయ్యి నీకు తెలీట్లేదు గానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపయ్యింది...ఎంత సెలైంట్‌గా ఎసేశావన్నా...’ ఈ డైలాగ్స్ వింటే ఆ కమెడియన్ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. యారాడ బీచ్‌లో సునీల్ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన రఘుని సాక్షి పలకరించింది. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. ఇదీ నేపథ్యం... మా నాన్న ఆర్మీలో జాబ్ చేసేవారు. చిన్నప్పుడు కొన్ని రోజులు విశాఖలో ఉన్నాను. అమ్మ హౌస్‌వైఫ్. నాకొక తమ్ముడు ఉన్నాడు. తను ఇంజినీర్, తనకొక సొంత కంపెనీ ఉంది. నేను మాత్రమే సినీ ఫీల్డ్‌లో కంటిన్యూ అవుతున్నాను. సాఫ్ట్వేర్ వదిలి సినిమాల్లోకి... నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసేవాడిని. చేతుల్లో సంపాదన, వసతులు అన్ని సక్రమంగా జరిగేవి. మా ఇంటి దగ్గర్లో వి.వి. వినాయక్, సురేందర్‌రెడ్డి ఉండేవాళ్లు అప్పటికి వారు దర్శకులు కాలేదు. అసిస్టెంట్ డైరక్టర్లుగా పని చేసేవారు. మామూలుగా పరిచయం, ఫ్రెండ్షిప్ వల్ల నా బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాసలో మాటతీరు సినిమాల్లో చాలా బావుంటుందని ఒక వేళ డైరక్టర్‌గా చాన్స్ వస్తే ఫస్ట్ సినిమాలో అవకాశం ఇస్తామని ఇద్దరూ అనేవారు. నేను కూడా అంత సీరియస్‌గా తీసుకోలేదు. 2001లో వినాయక్ నాకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్లాను. ఆఫీస్‌కు వెళ్లాక సినిమాలో నీకు చాన్స్ ఇస్తాను చేస్తావా అని అడిగారు. ‘నాకు ఎవరు చాన్స్ ఇస్తారన్నా.. యాక్టింగ్ కూడా నాకు రాదు’ అని అన్నాను. అయినా వినకుండా సెట్‌కు తీసుకెళ్లారు, కానీ సెట్‌కు వెళ్లేసరికి వినాయక్ డెరైక్టర్‌గా ఉన్నాడు. నేను అప్పటికే షాక్‌లో ఉన్నాను. అదే నా ఫస్ట్ సినిమా ‘ఆది’. అందులో సింహాద్రి క్యారెక్టర్. అప్పుడే వినాయక్ చెప్పారు నాలుగేళ్ల క్రితం నీకు సినిమాలో క్యారెక్టర్ ఇస్తానని చెప్పాను కదా అదే ఇది అన్నారు. తెలియకుండానే నటించా... స్టిల్ కెమెరాలో ఫొటోలు తీసుకోవడం తప్ప వీడియో కెమెరాలో రీల్ ఉంటుందని, అది రోల్ అవుతుందని, నేను చేసేది దానిలో రికార్డ్ అవుతుందని కూడా తెలీకుండా యాక్టర్‌ను అయ్యాను. డెరైక్టర్ చెప్పింది ఫాలో అవ్వడం తప్ప నాకు మరో ఛాన్స్ లేదు. అలాగే చేశాను...అందరికీ నచ్చి చప్పట్లు కొట్టేవారు. ఆశ్చర్యంగా చూడడం నావంతయ్యేది. ఇప్పుడు కెమెరా గురించి తెలుసు యాక్టింగ్ గురించి తెలుసు...అయినా బ్లాంక్‌గా సెట్‌కు వెళ్తాను.. డెరైక్టర్ చెప్పింది చేస్తాను. నచ్చకుంటే మళ్లీ మళ్లీ చేస్తాను...అంత కంటే ఎక్కువ ఆలోచించను. ‘అదుర్స్’ ఇంటిపేరైంది... నేను ఇప్పటి వరకూ 150 సినిమాలు చేశాను. అన్ని సినిమాలకు ఒకేలా కష్టపడి పని చేస్తాను. అదుర్స్ సినిమా వరకూ నేను 40 సినిమాల్లో యాక్ట్ చేశాను. అదుర్స్ సినిమా 2010లో వచ్చింది. దాని తర్వాత నేను 110 సినిమాలు చేశాను. ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్‌లో అదుర్స్ రఘుని ఆహ్వానిస్తున్నాం.. అని పిలవగానే వినాయక్ గారి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. ఆయన సినిమాల్లో క్యారెక్టర్ చేసి ఇంత పేరు వచ్చింది. దానినే ఇంటి పేరులా మార్చుకోవడం ఆయనకు నచ్చింది. అదుర్స్ తర్వాత వెంటనే ఆఫర్స్ వెల్లువలా వస్తాయని అనుకున్నాను. కానీ ఏడాదిన్నర కాలం ఖాళీగానే ఉన్నాను. తర్వాత తర్వాత ప్రతి సినిమాలో నా కోసం క్యారెక్టర్ రాయడం ప్రారంభించారు. ఇలా నవ్వించడమే లక్ష్యం సాఫ్ట్వేర్ రఘు అంటే కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ యాక్టర్ రఘు అంటే అందరికీ తెలుస్తుంది. కష్టాలెన్ని ఉన్నప్పటికీ సినిమాల్లో డబ్బు, గుర్తింపు ఉంటుంది. ఈ అదృష్టం అందరికీ రాదు. వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వితే చాలు అనుకుంటా.. అదే నాకు ఆక్సిజన్‌లాగా పని చేస్తుంది. ప్రేక్షకుల అభిమానం వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. అందుకే వాళ్లను నవ్వించడం నాకు ధ్యేయం... ఆనందం.. లక్ష్యం.. అన్నీను. వైజాగ్ ఎప్పుడూ స్పెషలే... నేను వైజాగ్‌లో చిన్నప్పుడు కొన్నాళ్లు ఉన్నాను. అక్కయ్యపాలెం దగ్గర్లో ఉండేవాళ్లం...దొండపర్తి రోడ్లో విజ్ఞాన నికేతన్ స్కూల్ ఉండేది అక్కడే చదువుకునేవాడిని. ఎప్పుడు వైజాగ్ వచ్చినా రైల్వే గ్రౌండ్స్ గుర్తుకు వస్తాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడడానికి వెళ్లేవాడిని, ఆర్కే బీచ్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా వైజాగ్ నాకు ఎప్పుడూ స్పెషలే. 1994లో వైజాగ్‌లో కొన్నాళ్లు ఉన్నాను. కోస్టల్ బీజియంను చూసుకునేవాడిని, గీతం యూనివర్సిటీ, ఐటీ కంపెనీలు, ఎన్ఎస్టీఎల్, షిప్‌యార్డ్, జింక్ వీళ్లందరికీ సిస్టమ్ ఇన్స్టాల్ చెయ్యడానికి వస్తూండేవాడిని. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్లాలనిపిస్తే వైజాగ్ వచ్చేస్తాను.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement