-
ఆమెతో కలిసి నటించడం అదృష్టం
అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి సోనాలీ బింద్రే త్వరలో బుల్లితెరపై ఓ సీరియల్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెండితెర నుంచి నిష్ర్కమించిన తరువాత అప్పుడప్పుడూ టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా కనిపించినప్పటికీ డెయిలీ సీరియల్లో నటించడం ఇదే మొదటిసారి. ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్లో సోనాలీ అపూర్వ అగ్నిహోత్రితో కలిసి జంటగా నటిస్తున్నారు. సోనాలీకి తాను పెద్ద అభిమానినని అపూర్వ అంటున్నాడు. ఆమె అద్భుతమైన నటి అని, నటనలో ఎంతో అనుభవమున్నప్పటికీ సెట్స్‌లో ఆమె చిన్న పిల్లలాగానే వ్యవహరిస్తుందని అన్నాడు. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పాడు. లైఫ్ ఓకే చానెల్లో త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్ ఇద్దరు అపరిచితుల మధ్య కథ అని అపూర్వ చెప్పాడు. అదృష్టం కొద్దీ కలిసిన వీరిద్దరు ఆ తరువాత ఒక్కటవుతారని అన్నాడు. ఇదివరకు జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్ నటించిన అపూర్వ అగ్నిహోత్రి ఈ సీరియల్లో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నాడు. ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. తొలుత వెండితెరపై కనిపించిన అపూర్వ అక్కడ తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చాడు. సినిమాల్లోకి మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు నటునిగానైతే రానని, దర్శకునిగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒకరకంగా బిగ్‌బాస్ షో అపూర్వ జీవితాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. ఆ షోలో అపూర్వ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని అపూర్వ చెప్పాడు. ఆ అవకాశం తొమ్మిదేళ్ల పాటు నిర్మితమైన ప్రతిష్టను 90 రోజుల్లో దిగజార్చవచ్చని అన్నాడు. తాను, తన భార్య మంచి పేరుతో ఆ షో నుంచి బయటపడటం తమ అదృష్టమని అపూర్వ పేర్కొన్నాడు. -
డెయిలీ సీరియల్లో సోనాలీ బింద్రే
న్యూఢిల్లీ: అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి సోనాలీ బింద్రే త్వరలో బుల్లితెరపై ఓ సీరియల్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెండితెర నుంచి నిష్ర్కమించిన తరువాత అప్పుడప్పుడూ టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా కనిపించినప్పటికీ డెయిలీ సీరియల్లో నటించడం ఇదే మొదటిసారి. ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్లో సోనాలీ అపూర్వ అగ్నిహోత్రితో కలిసి జంటగా నటిస్తున్నారు. సోనాలీకి తాను పెద్ద అభిమానినని అపూర్వ అంటున్నాడు. ఆమె అద్భుతమైన నటి అని, నటనలో ఎంతో అనుభవమున్నప్పటికీ సెట్స్‌లో ఆమె చిన్న పిల్లలాగానే వ్యవహరిస్తుందని అన్నాడు. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పాడు. లైఫ్ ఓకే చానెల్లో త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్ ఇద్దరు అపరిచితుల మధ్య కథ అని అపూర్వ చెప్పాడు. అదృష్టం కొద్దీ కలిసిన వీరిద్దరు ఆ తరువాత ఒక్కటవుతారని అన్నాడు. ఇదివరకు జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్ లో నటించిన అపూర్వ అగ్నిహోత్రి ఈ సీరియల్లో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నాడు. ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. తొలుత వెండితెరపై కనిపించిన అపూర్వ అక్కడ తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చాడు. సినిమాల్లోకి మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు నటునిగానైతే రానని, దర్శకునిగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒకరకంగా బిగ్‌బాస్ షో అపూర్వ జీవితాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. ఆ షోలో అపూర్వ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని అపూర్వ చెప్పాడు. ఆ అవకాశం తొమ్మిదేళ్ల పాటు నిర్మితమైన ప్రతిష్టను 90 రోజుల్లో దిగజార్చవచ్చని అన్నాడు. తాను, తన భార్య మంచి పేరుతో ఆ షో నుంచి బయటపడటం తమ అదృష్టమని అపూర్వ పేర్కొన్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement