-
వన్డేల్లోనూ అదే గతి!
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ జట్టు దేశవాళీ వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయింది. రంజీల్లో గ్రూప్ ‘సి’కే పరిమితమైన అక్షత్ రెడ్డి బృందం వన్డేల్లో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. సౌత్ జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ రెండు పరాజయాలు చవి చూసింది. తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బుధవారం గోవాతో తలపడనుంది. అందరూ అందరే... టోర్నీ తొలి మ్యాచ్‌లో కేరళపై చక్కటి విజయంతో హైదరాబాద్ శుభారంభం చేసింది. ఆ తర్వాత తీవ్ర ఒత్తిడి మధ్య పటిష్టమైన కర్ణాటకతో ‘టై’ చేసుకోవడంతో జట్టు ప్రదర్శనపై ఆశలు రేకెత్తాయి. అయితే ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి హైదరాబాద్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆల్‌రౌండర్ ఆశిష్ రెడ్డి ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నా నిలకడగా ఆడలేకపోయాడు. నాలుగు మ్యాచుల్లో బ్యాట్స్‌మెన్ కేవలం మూడు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశారంటే బ్యాటింగ్ ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన సుమన్, విహారి, రవితేజలాంటి ప్రధాన ఆటగాళ్లు కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయారు. యువ ఆటగాడు రాహుల్ సింగ్ తనకు దక్కిన అవకాశాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ప్రజ్ఞాన్ ఓజా 8 వికెట్లతో రాణించినా.. బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో అతని ప్రదర్శన పెద్దగా ఉపయోగ పడలేకపోయింది. తమిళనాడు పటిష్టమైన జట్టు అనుకున్నా...బలహీనమైన ఆంధ్ర చేతిలో కూడా ఓడటం హైదరాబాద్ పరిస్థితిని సూచిస్తోంది. టి20ల్లో రాణిస్తారా... రంజీ ట్రోఫీ, వన్డేల్లో హైదరాబాద్ ప్రదర్శన పూర్తిగా తీసికట్టుగా ఉంది. అద్భుతమైన మైదానాలు, చక్కటి సౌకర్యాలు ఉన్నా...ఆటలో మాత్రం జట్టు తిరోగమిస్తూనే ఉంది. చిన్న జట్లతో కూడా పోరాటం కనబర్చలేక చేతులెత్తేస్తోంది. ఈ నేపథ్యంలో టోర్నీలో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనైనా గెలిస్తే పరువు దక్కుతుంది. మరో వైపు దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ఈ నెల 28నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1న జరిగే తొలి మ్యాచ్‌లో కేరళతో హైదరాబాద్ తలపడుతుంది. కనీసం ఆ టోర్నీలోనైనా సౌత్ జోన్‌నుంచి నాకౌట్‌కు అర్హత సాధిస్తే జట్టుకు తగిన గుర్తింపు దక్కుతుంది. -
అక్షత్ రెడ్డి 99 అవుట్
పోర్వోరిమ్: రంజీ ట్రోఫీలో ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ తొలి రోజు ఫర్వాలేదనిపిం చింది. భారీ స్కోరు చేయకపోయినా ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా జాగ్రత్తగా ఆడింది. గోవాతో ఇక్కడ శనివారం ప్రారంభమైన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (191 బంతుల్లో 99; 14 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా... రవితేజ (102 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆట నిలిచే సమయానికి విహారి (44 బ్యాటింగ్), సందీప్ (23 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకైక విజయంతో 12 పాయింట్లతో ఉన్న హైదరాబాద్...ఈ గ్రూప్‌లో అవకాశాలు మెరుగు పర్చుకోవాలంటే ఈ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో విజయం సాధించాలి. మార్పుల్లేని జట్టు టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. త్రిపురతో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే హైదరాబాద్ బరిలోకి దిగింది. అయితే ఆరంభంలోనే తిరుమలశెట్టి సుమన్ (13)ను అవుట్ చేసి మంగళ్‌దాస్ దెబ్బ తీశాడు. అయితే అక్షత్, రవితేజ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన అక్షత్ చక్కటి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ కెరీర్లో రవితేజ 16వ, అక్షత్ 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించిన అనంతరం రవితేజ వెనుదిరిగాడు. మంగళ్‌దాస్ బౌలింగ్‌లోనే కామత్‌కు రవి క్యాచ్ ఇచ్చాడు. విహారి అండతో శతకం దిశగా దూసుకుపోయిన అక్షత్‌కు అదృష్టం కలిసి రాలేదు. గడేకర్ బౌలింగ్‌లో ఫ్లిక్ చేసి సింగిల్ తీయబోయాడు. అయితే ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వాజ్ చేతుల్లో వాలింది. ఈ దశలో విహారి, సందీప్ మరో వికెట్ పడకుండా 25.4 ఓవర్ల పాటు నెమ్మదిగా ఆడి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 47 పరుగులు జత చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రజనీకాంత్ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్.. క్రికెట్ థీమ్‌తో.. (ఫోటోలు)
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
కేన్స్ రెడ్ కార్పెట్‌పై సంప్రదాయ చీరకట్టులో తళుక్కుమన్న నటి!
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!
గ్రాండ్‌గా జరిగిన 'డర్టీ ఫెలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ
సెల్‌ఫోన్స్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్‌కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
Advertisement