-
నేనే డబ్బింగ్ చెప్పుకుంటా!
తమిళసినిమా: బాలీవుడ్ నటి అమిరా దస్తూర్ గుర్తుందా? ఆ మధ్య ధనుష్‌కు జంటగా అనేగన్ చిత్రంతో నాయకిగా నటించిది. దక్షిణాది చిత్రంలో నటిస్తున్నప్పుడు నన్ను చాలా కష్టపెట్టారంటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది కూడా. ఇప్పుడు గుర్తుకొచ్చే ఉంటుంది. అందాలారబోతకుసై అంటున్నా, అవకాశాలు అంతంత మాత్రంగానే రాబట్టుకుంటోందీ బ్యూటీ. అలా హిందీ, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్న ఈ అమ్మడు చాలా కాలం తరువాత ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. నటుడు సంతానం సరసస ఓడి ఓడి ఒళైక్కనుమ్ చిత్రంతో పాటు డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతోనూ ఒక చిత్రంలో రొమాన్స్ చేసే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. అంతే కాదు తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయాలని కోరుకుంటున్నానంటోందట ఈ అమ్మడు. దీని గురించి అమిరా దస్తూరి తెలుపుతూ సంతానంకు జంటగా నటిస్తున్న ఓడి ఓడి ఒళైక్కనుమ్ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని చెప్పింది. ప్రస్తుతం ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రభుదేవాతో కలిసి నటిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఇది యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో తనది చాలా బలమైన పాత్ర అని తెలిపింది. ఆ పాత్రకు తానే డబ్బింగ్ చెబితే జీవం ఉంటుందని అనిపించిందంది. అందుకే తానే డబ్బింగ్ చెప్పాలని భావించానని చెప్పింది. అందుకే తమిళ భాషను నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నానని, ఈ చిత్రమే కాకుండా ఇకపై నటించే అన్ని చిత్రాలకు తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని చెప్పింది. అంతా బాగానే ఉంది గానీ సడన్‌గా ఆ డబ్బింగ్ చెప్పుకోవాలన్న కోరిక ఎందుకొచ్చిందమ్మడూ అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ వర్గాలు. అసలే అవకాశాలు అరకొరగానే వస్తున్నాయి. దీంతో అవకాశాలను పెంచుకునేందుకే ఈ డబ్బింగ్ అంశాన్ని ముందుకు తీసుకొస్తోందా? అయినా ఈ జాణ డబ్బింగ్ చెబుతానన్నా, దర్శక నిర్మాతలు సరే అనాలిగా! చూద్దాం అమిరా దస్తూర్ డబ్బింగ్ ట్రిక్స్ ఏ మాత్రం పనిచేస్తుందో! -
స్మాల్ స్టెప్ తీసుకున్నా
తమిళ పాఠాలు నేర్చుకుంటున్నారు హీరోయిన్ అమైరా దస్తూర్. హిందీలో ‘మెంటల్ హై క్యా’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ‘మేడిన్ చైనా, ప్రస్థానం’ (తెలుగు ‘ప్రస్థానం’ హిందీ రీమేక్) సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళం నేర్చుకోవడానికి కారణం ఉంది. అధిక్ రవిచందర్ దర్శకత్వంలో ప్రభుదేవా నటించనున్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారట అమైరా. ఈ సినిమాలో సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. అందుకే తమిళం నేర్చుకుంటున్నారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లో సొంత డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల వెండితెరపై ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ పర్ఫెక్ట్గా రిప్లెక్ట్ అవుతాయి. అలాగే మన పెర్ఫార్మెన్స్లోనూ తేడా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్ టైమ్‌లోనూ నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఎవరైనా తమిళంలో ఏదైనా చెప్పినప్పుడు పక్కవారిని ట్రాన్స్‌లేట్ చేయమనే బాధ కూడా పోతుంది. నటిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఇదొక స్మాల్ స్టెప్‌గా భావిస్తున్నాను’’ అని అమైరా చెప్పుకొచ్చారు. ఇంతకుముందు తమిళంలో ‘అనేగన్’ చిత్రంలో ధనుష్ సరసన నటించారామె. -
సూపర్‌స్టార్ తరువాత జీవీనే..
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత కోలీవుడ్‌లో ఆ స్థాయికి చేరుకున్న నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌నే. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? అయితే రండి చూద్దాం. అప్పుడెప్పుడో నటుడు పార్థిబన్ ప్రధాన పాత్రలో అంబలి అనే 3డి చిత్రం రూపొందింది. రజనీకాంత్ ఈ మధ్య కోచ్చడయాన్ అనే 3డీ యానిమేషన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అదే విధంగా తాజాగా ఆయన నటిస్తున్న 2.ఓ చిత్రం 3డీ ఫార్మెట్‌లోనే రూపొందుతోంది. రజనీకాంత్ మినహా కోలీవుడ్ మరే హీరో 3డీ చిత్రంలో నటించలేదు. అయితే తాజాగా యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ 3డీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈయన హీరోగా ఇంతకు ముందు త్రిష ఇల్లన్నా నయనతార చిత్రాన్ని తెరకెక్కించిన ఆధిక్ రవిచంద్రన్ ఆ తరువాత శింబు హీరోగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఫ్లాప్ అవడంతో ఆధిక్ రవిచంద్రన్ తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో జీవీ ఆయనకు అవకాశం కల్పించారు. వీరి కాంబినేషన్లో 3డీ చిత్రం తెరకెక్కుతోందన్నది తాజా సమాచారం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో కథానాయకిగా నటి అమిరదస్తూర్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో నటి సంజితాశెట్టి, సోనియా అగర్వాల్ వచ్చి చేరారు. 2.ఓ చిత్రానికి పనిచేసిన కొందరు సాంకేతిక నిపుణులు జీవీ చిత్రానికి పనిచేస్తున్నారట. తాజా షూటింగ్ చెన్నై, కారైక్కుడి ప్రాంతాల్లో నిర్వహించడానికి చిత్ర వర్గాలు రెడీ అవుతున్నారని సమాచారం. -
జాకీ మార్క్ యాక్షన్‌తో...
హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘కుంగ్ ఫూ యోగ’. సోనూసూద్, దిశా పటాని, అమైరా దస్తూర్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టాన్ లీ టాంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ– ‘‘ప్రపంచవ్యాప్తంగా జాకీచాన్ సినిమాలను అందరూ ఇష్టపడతారు. గతంలో తెలుగులో వచ్చిన జాకీచాన్ చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. స్టాన్లీ టాంగ్, జాకీచాన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘రంబుల్ ఇన్ ది బ్రాంక్స్’, ‘ది మిత్’, ‘చైనీస్ జోడియాక్’ వంటి చిత్రాలు కలెక్షన్ లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించాయి. మరోసారి వీరి కలయికలో వస్తోన్న ‘కుంగ్ ఫూ యోగ’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జాకీచాన్ మార్క్ యాక్షన్ కామెడీతో పాటు ఫ్రెష్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రంలోని పలు రకాల జంతువులు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తాం’’ అన్నారు. -
ధనుష్ అభిమానులకు డబుల్ ధమాకా!
నటుడు ధనుష్ 2014 చివర్లో వేల ఇల్లాద పట్టదారి(రఘువరన్ బిటెక్) చిత్రంతో పెద్ద విజయాన్ని ఇచ్చి అభిమానుల్ని సంతోషపరిచారు. 2015 ప్రథమార్థంలోనే డబుల్ ధమాకాతో అభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒకటి అనేగన్ చిత్రం, రెండోది షమితాబ్ చిత్రం. ఈ రెండు చిత్రాలు వారం గ్యాప్‌లో వరుసగా విడుదలకు సిద్ధం కానున్నాయి. ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ అమిరా దస్తూర్ జత కట్టిన అనేగన్ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు. హరిష్ జయరాజ్ సంగీత బాణీలను అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించింది. ఇందులో ధనుష్ పలు గెటప్‌లలో తన అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న తెర మీదకు రానుంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ తొలిసారి హీరోయిన్గా పరిచయమవుతూ, ధనుష్‌తో జతకడుతున్న హిందీ చిత్రం షమితాబ్. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. హిందీలో అమితాబ్‌బచ్చన్‌తో ఁపారూ., సినీకాం వంటి వైవిధ్య భరిత సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన బాలీవుడ్ దర్శకుడు బాల్కీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ధనుష్ హీరోగా హిందీలో పరిచయమైన రాంజన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో షమితాబ్ కూడా ధనుష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు ధనుష్ అభిమానులకు నిజంగా డబుల్ ధమాకానే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement