-
ఆధార్ అనుసంధానం లేకుంటే రేషన్ కట్
ఎల్.ఎన్.పేట: రేషన్ కార్డులకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలని, లేకుం టే రేషన్ నిలుపుదల జరుగుతుందని డీఎస్వో సీహెచ్ ఆనందకుమార్ అన్నారు. తహశీల్దార్ కార్యాలయం లో బుధవారం డీలర్లతో సమావేశం నిర్వహించారు. సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు జిల్లాలో 92.47శాతం కార్డులకు ఆధార్ అనుసంధానం చేశామన్నారు. ఇంకా మిగిలి పోయిన వారికోసం రెండో విడతగా అవకాశం కావాలని ప్రభుత్వానికి రాయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే రెండో విడతలో ఆధార్ అనుసంధానం పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో తహశీల్దార్ పి.రోజ్, సీఎస్డిటీ బి.శ్రీదేవి, ఉప తహశీల్దార్ నానిబాబు, ఆర్ఐ బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జాబ్‌కార్డుకు ‘ఆధార్’ తప్పనిసరి పలాస రూరల్: జిల్లాలో ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉన్న వేతనదారులు ఆధార్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని వాటర్షెడ్పథకం జిల్లా అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ టి.సత్యన్నారాయణ కోరారు. పలాస మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 8,19,624 జాబ్‌కార్డుదారులు ఉండగా 6,77, 378 మంది ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకున్నారన్నారు. మిగి లిన వారు కూడా జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధా నం చేస్తేనే వేతనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరగా జాబ్‌కార్డులకు ఆధార్ అనుసంధానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్‌షెడ్ పథకం అమలులో ఉన్న గ్రామాల్లో 2.80 లక్షలు టేకు మొక్కలు పంపిణీ చేయ డం జరిగిందన్నారు. జిల్లాలో 4,536 కొబ్బరి మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. జలసంరక్షణ పథకంలో జిల్లాలో 1398 చెక్‌డ్యాంలు పాక్షికంగా దెబ్బతినగా, 2213 చెక్‌డ్యాంలు ఎక్కువగా మరమ్మతులకు గురయ్యాయని, 291 చెక్‌వాల్స్ పాక్షికంగా, 477 తీవ్ర స్థాయిలో మరమ్మతులకు గురయ్యాయని చెప్పారు. జిల్లాలో 161 ఇంకు డు గుంటలు మరమ్మతులకు గురి కాగా 251 ఇంకుడు గుంతలు బాగా పాడయ్యాయన్నారు. ఈ సమావేశంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో బి.ప్రమీల, ఈసీ సురేష్‌వర్మ, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
చిన్న వయసులోనే పెద్దలక్ష్యాన్ని సాధించారు: ప్రధాని
తెలుగు తేజాలకు ప్రధాని అభినందన సాక్షి, న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను శుక్రవారం ప్రధాని మోడీ అభినందించారు. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించారని వారిని ప్రశంసించారు. ప్రధాని నివాసమైన రేస్‌కోర్సులో శుక్రవారం పూర్ణ, ఆనంద్‌లు నరేంద్రమోడీని కలశారు. శుభాకాంక్షలు తెలిపిన మోడీ.. భారత ఖ్యాతిని ఇనుమడింపజేశారంటూ వారిని అభినందనలతో ముంచెత్తారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వీరికి ఎవరెస్టు ఎక్కేందుకు సహకరించిన వారి వివరాలను పూర్ణ, ఆనంద్‌ల నుంచి తెలుసుకున్న ప్రధాని ముగ్ధుడైనట్లు కోచ్ శేఖర్‌బాబు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మోడీ వారిద్దరినీ ఆశీర్వదించారని ప్రధానమంత్రి కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement