-
శ్రీమతి శ్రియ
శ్రీమతిగా శ్రియ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం రష్యన్ బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కోశ్చివ్‌ను ఉదయపూర్‌లో ఆమె వివాహం చేసుకోనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. సోమవారం ఉదయపూర్‌లో ఆండ్రీ, శ్రియ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటైపోయారు. అయితే ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అంతేకాదు శ్రియ వెడ్డింగ్ వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ‘‘ఎవరైతే నిన్ను నిన్నుగా ప్రేమిస్తారో, వారి ప్రేమ నీలో కొంత మంచి మార్పును కోరుకుంటుంది. ఈ మార్పు ప్రేమ కాకపోవచ్చు. రాజీపడటం. శ్రియ ప్రేమ ప్రతిరోజూ నన్ను కొత్తగా, బెటర్‌గా ఉంచుతుందన్న నమ్మకం ఉంది’’ అని ఆండ్రీ కోశ్చివ్ అన్నట్లుగా ఈ వీడియాలో ఉంది. భర్త మాట్లాడుతున్న సమయంలో శ్రియ ప్రేమగా అతన్ని ముద్దాడటం హైలైట్. ఇదిలా ఉంటే ఈ జంట ఈ నెల 12న ముంబైలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారని టాక్. ఆ ముందు రోజు పార్టీని కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నారట. ఇక.. ఆండ్రీ విషయానికొస్తే... అతను నేషనల్ లెవల్ టెన్నిస్ ప్లేయర్. అంతేకాదు మాస్కోలో ఉన్న కొన్ని రెస్టారెంట్స్‌కు యజమాని. ప్రస్తుతం శ్రియ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘వీరభోగ వసంత రాయలు’లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన‘నరగాసురన్’ (తెలుగులో నరకాసురుడు) రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఆ హత్యను తీవ్రంగా ఖండించిన భారత్
న్యూఢిల్లీ: టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్ హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కర్లోవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని.. ఇలాంటి హింసాయుత, ఉగ్రవాద చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎమ్ఈఏ ప్రకటనలో పేర్కొంది. టర్కీలోని అంకారాలో ఓ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్పై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు సోమవారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆండ్రీ అక్కడిక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తి ‘అలెప్పో’, ‘రివేంజ్(ప్రతీకారం)’ అని అరిచిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ ఘటనపై రష్యా తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్‌కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
Advertisement