-
IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్‌బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ వచ్చేశాడు.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్‌లోనూ -
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా ఫ్లవర్
బెంగళూరు: ఐపీఎల్లో ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. జట్టు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెపె్టన్, కోచింగ్‌లో అపార అనుభవం ఉన్న ఆండీ ఫ్లవర్‌ను ఎంపిక చేసింది. దాంతో ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌తో పాటు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ హోదాలో టీమ్‌ను పూర్తి స్థాయిలో నడిపించిన మైక్ హెసన్‌పై వేటు పడినట్లయింది. నాలుగు సీజన్ల పాటు హెసన్ డైరెక్టర్‌గా పని చేయగా... మూడుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు 2023 సీజన్లో ఆరో స్థానంతో ముగించింది. అయితే ఈ ప్రదర్శన ఆర్సీబీ యాజమాన్యానికి సంతృప్తినివ్వలేదు. -
IPL 2024: సన్‌రైజర్స్‌లో కీలక పరిణామం.. హెడ్ కోచ్‌కు ఉద్వాసన..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌ను మార్చి తమ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని సంకేతాలు పంపగా.. తాజాగా ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే పనిలో పడ్డాయి. ఫ్లవర్‌ను తప్పించి లాంగర్‌ను ఎంచుకున్న లక్నో.. లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి, ఆ స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌కు కట్టబెట్టింది. ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్‌కు చేరింది. బ్రియాన్ లారాకు ఉద్వాసన.. కొత్త కోచ్ వేటలో సన్‌రైజర్స్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ గత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. ఫ్లవర్‌కు భలే గిరాకి.. లక్నో సూపర్ జెయింట్స్ వదిలించుకున్న జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌కు ఐపీఎల్లో భలే గిరాకి ఉంది. కోచ్‌గా అతని ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. లక్నో ఫ్రాంచైజీ ఫ్లవర్‌ను వదిలించుకున్న తర్వాత అతని కోసం రెండు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అతనిపై కన్నేసినట్లు సమాచారం. ఫ్లవర్‌తో రాయల్స్ బేరసారాలు అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లవర్ ఎంపికకు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్సీబీలో కీలక మార్పులు.. 2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది. -
IPL: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కోచ్.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ప్రస్తుత కోచ్ ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తో ముగియడంతో, అతని స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యం ఇవాళ (జులై 14) అధికారికంగా ప్రకటించింది. ఎల్ఎస్జీకి ఆండీ ఫ్లవర్ చేసిన సేవలను అభినందిస్తూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన మేనేజ్మెంట్.. కొత్త కోచ్ పేరును ప్రకటించింది. ఫ్లవర్ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు సముఖత చూపని లక్నో మేనేజ్మెంట్.. మెంటార్‌గా గౌతమ్ గంభీర్ సేవలను మాత్రం ఎక్స్టెండ్ చేసింది. గంభీర్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను, ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ను, అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దాహియాను కొనసాగించింది. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓ పక్క తమతో పాటు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓ సీజన్లో విజేతగా, మరో సీజన్లో రన్నరప్‌గా నిలువడంతో ఎల్ఎస్జీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హెడ్ కోచ్‌ను మార్చింది. మున్ముందు ఈ జట్టులో భారీ మార్పులు ఉంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను కూడా తప్పించవచ్చని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్-2024కు మరో ఏడాది సమయం ఉంది కాబట్టి, కెప్టెన్ మార్పు విషయంలో ఎల్ఎస్జీ యాజమాన్యం ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకపోవచ్చు. లక్నో కొత్త కోచ్ విషయానికొస్తే.. 52 ఏళ్ల లాంగర్ ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన లాంగర్‌ను ఎల్ఎస్జీ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. 1993-2007 మధ్యకాలంలో ఆసీస్ తరఫున 105 టెస్ట్‌లు 8 వన్డేలు ఆడిన లాంగర్.. సక్సెస్ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించని లాంగర్ టెస్ట్‌ల్లో సత్తా చాటాడు. 182 ఇన్నింగ్స్‌ల్లో 23 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 45.3 సగటున 7696 పరుగులు చేశాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఓపెనర్..?
వచ్చే ఐపీఎల్ సీజన్ (2024) కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు.. తమ హెడ్ కోచ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తోనే ముగియడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. ఈ పదవి కోసం ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఆసీస్ మాజీ హెడ్ కోచ్, ఆ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై లాంగర్ కాని, ఎల్ఎస్జీ యాజమాన్యం కాని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇరు వర్గాల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే సీజన్ నుంచి ఎల్ఎస్జీ హెడ్ కోచ్‌గా లాంగర్ వ్యవహరించే అవకాశం ఉంది. 52 ఏళ్ల జస్టిన్ లాంగర్.. ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకా కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా, విజయ్ దాహియా అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల్లో పరిశీలకుడి తనిఖీ
ఇంటి ‘ఓటు’ పడింది !
వివాహిత అనుమానాస్పద మృతి?
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
కీలక ప్రదేశాల్లో కేంద్ర బలగాల పహారా
సై.. అంటే సై!
ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలి
ఓటరు సహకార కేంద్రం ఏర్పాటు
ఆదివారం రాహుల్ గాంధీ..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement