-
ఆ వైద్యుడు ప్రసంగం ప్రారంభంకాగానే... లేచి వెళ్లిపోయిన విద్యార్థులు.. ఎందుకంటే...
అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయం మెడికల్ స్కూల్లో వైట్‌కోట్ వేడుక జరుగుతోంది. ఈ సందర్భంగా వేదికపై డాక్టర్ క్రిస్టిన్ కొలియర్ అనే ప్రముఖ వైద్యుడు ప్రసంగం ప్రారంభించారు. ఆయన ప్రసంగం ఇలా ప్రారంభం కాగానే ఒక్కసారిగా విద్యార్థులంతా లేచి బయటకు వచ్చేశారు. దీంతో ఆ వేడుకకు వచ్చిన ప్రముఖులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిజానికి వైట్ కోట్ అనేది అధికారిక కార్యక్రమం. ఇది విద్యార్థులంతా వైద్య రంగంలోకి ప్రవేశించినందుకు గుర్తుగా వారందరికీ వైట్‌కోట్‌లు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ వైద్యుడిని ప్రధాన అతిధిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ...దాదాపు 340 మంది విద్యార్థులు యూనివర్సిటీ డీన్‌కి ఒక పిటిషన్ అందజేశారు కూడా. వాస్తవానికి వైద్యుడు కొలియర్ సోషల్ మీడియాలోనూ, పలు ఇంటర్వ్యూల్లోనూ అబార్షన్‌కి వ్యతిరేకంగా పలు ఉపన్యాసాలు ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆయన పట్ల వ్యతిరేక భావం ఏర్పడింది. దీంతో కొత్తగా వైద్యారంగంలోకి వచ్చిన విద్యార్థులు, పూర్వపు విద్యార్థులతో సహా సుమారు 72 మంది కమ్యూనిటీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ పై సంతకాలు చేశారు. అంతేగాదు అబార్షన్‌కి వ్యతిరేకంగా ప్రసంగిస్తూ ....విశ్వవిద్యాలయాల స్థితిని దిగజార్చారు, పైగా వైద్య విధానంలో ఒక వ్యక్తి ప్రాణ రక్షణ నిమిత్తం అబార్షన్ చేయడం లేదా చేయించుకోవడం అనేది ఒక భాగం అంటూ.... ఆయన ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పిటిషన్లో విద్యార్థులు పేర్కొన్నారు. Incoming medical students walk out at University of Michigan’s white coat ceremony as the keynote speaker is openly anti-abortion pic.twitter.com/Is7KmVV811 — Scorpiio (@PEScorpiio) July 24, 2022 (చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం... ఇద్దరు మృతి) -
యూఎస్‌లో 'ప్రాణం' గెలుస్తోంది!
వాషింగ్టన్: అమెరికాలో అబార్షన్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం విజయవంతంమౌతోందని, దీనికి రిపబ్లికన్ ప్రభుత్వం తోడ్పడుతుందని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన 'మార్చ్ ఫర్ లైఫ్' కార్యక్రమంలో మైక్ పాల్గొన్నారు. అబార్షన్లకు వ్యతిరేకంగా వాషింగ్టన్లో ప్రతి సంవత్సరం నిర్వహించే మార్చ్ ఫర్ లైఫ్‌లో పాల్గొన్న తొలి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ కావడం విశేషం. 'రైట్ టు లైఫ్'ను సపోర్ట్ చేసే వ్యక్తి ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారని.. మార్ఛ్ ఫర్ లైఫ్‌లో పాల్గొనాలని స్వయంగా ట్రంప్ తనను కోరారని ఈ సందర్భంగా మైక్ చెప్పుకొచ్చారు. అబార్షన్లకు వ్యతిరేకంగా ఇటీవల రిపబ్లికన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన ర్యాలీలో వివరించారు. అమెరికాలో ప్రాణం విజయం సాధిస్తోందన్న పెన్స్.. సంస్కృతిని పునరుద్ధరించేవరకు మనకు విశ్రాంతి లేదన్నారు. ర్యాలీ అనంతరం ప్రో లైఫ్ మార్చ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ ట్వీట్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement