-
విలేజ్ లవ్‌స్టోరీ
అనురాగ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉమాపతి’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు ఊర్ల మధ్య గొడవలు హీరో హీరోయిన్ల ప్రేమకు ఎలా అడ్డంకిగా మారాయి? ఫైనల్‌గా వీరి లవ్‌స్టోరీ ఎలా ముగుస్తుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందన్నట్లుగా విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్, నేపథ్య సంగీతం: జీవన్ బాబు. -
బిగ్‌బాస్ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్ అవుతానంటున్న కంటెస్టెంట్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్. బాలీవుడ్లో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ షోను తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం హిందీలో సీజన్-17 నడుస్తోంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అనురాగ్ ధోబాల్.. హోస్ట్‌గా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని హోస్లో ఉన్న మరో కంటెస్టెంట్ సనా రయీస్ ఖాన్‌తో చెప్పారు. హోస్ట్‌గా ఉండాల్సిన మీరే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సల్మాన్‌ను ఉద్దేశించి అనురాగ్ ధోబాల్ ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బిగ్‌బాస్.. కంటెస్టెంట్ అనురాగ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించాడు. అయితే బిగ్ బాస్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న అనురాగ్ ఈ షో నుంచి మధ్యలోనే తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. బిగ్‌బాస్ వార్నింగ్ ఇవ్వడాన్ని తనకు అగౌరవంగా భావిస్తున్నట్లు హౌస్‌మేట్స్‌తో చెప్పడం కనిపించింది. బిగ్ బాస్ తనను తిట్టిన తరువాత స్వచ్ఛందంగా షో నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు హోస్‌మేట్స్‌తో చెప్పారు. ఇకపై ఈ షో గురించి పట్టించుకోనని అనురాగ్ అన్నారు. ఈ షో కంటే నాకు అభిమానులు, కుటుంబం చాలా ముఖ్యమని తెలిపారు. బిగ్ బాస్ షో నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు రూ.2 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని హోస్‌మేట్స్‌తో అనురాగ్ ధోబాల్ అన్నారు. Bhai ne Maa Ka Sapna Pura Kiya Ab Bhai ka Sapna Pura Karte hain ❤️🤌🏻 pic.twitter.com/0hsRKarUNq — Anurag Dobhal (@uk07rider) November 25, 2023 -
హీరోయిన్గా బిగ్‌బాస్ ఫేమ్.. టీజర్ రిలీజ్!
బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ...' చిత్రబృంద సభ్యులు పగలు, రేయి బాగా కష్టపడ్డారు. అనురాగ్, భానుశ్రీ, సోనాక్షి వర్మ, రోషిణిలు అద్భుతంగా నటించారు. మా అందరినీ వెనుక ఉండి నడిపించిన స్వామి, మేడమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘కలశ’ అనే టైటిల్ ఈ సినిమాలోని క్యారెక్టర్. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగింది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.' అని అన్నారు. దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ... 'టీజర్ చాలా బాగుంది. మంచి ఎమోషన్, యాక్షన్ ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అందరికీ అల్ ది బెస్ట్' అని అన్నారు. నిర్మాత చంద్రజ మాట్లాడుతూ...' రాంబాబు చాలా హార్డ్ వర్కర్. ఈ కథకు కావాల్సిన కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. ఎక్కడా అశ్లీలత లేకుండా చూశాం. సెన్సార్ వారు కూడా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నా. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి విజయ్ కురాకుల సంగీతమందించారు. -
పంద్రాగస్టు వేడుకకి వెళ్లమంటే.. ప్రాణం తీసుకున్నాడు
ఆదిలాబాద్: పాఠశాలకు వెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చావని తండ్రి మందలించడంతో కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీంపూర్ మండలంలోని రాజుల్కోరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిడాం అనురాగ్(13) అందర్‌బంద్ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 4న ఉపాధ్యాయులకు తెలియకుండా ఇంటికి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వెళ్లాలని తండ్రి సీతారాం చెప్పినా వెళ్లలేదు. పంద్రాగస్టు వేడుకలు ఉన్నందున వెళ్లాలని శనివారం మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అనురాగ్ ఇంటి వద్ద పురుగుల మందు తాగి కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై లాల్‌సింగ్‌నాయక్ మృతదేహన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఐటీడీఏ ఏపీవో భాస్కర్, ఏటీడీవో నిహారిక రాజుల్కోరిలో కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హెచ్ఎం రాజశేఖర్‌ను ఆదేశించారు. -
చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ తాజా చిత్రం.. క్రేజీ అప్డేట్!
యంగ్ హీరో అనురాగ్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఉమాపతి’. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని ‘నాకొకటి నీకొకటి’ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాయగా.. ఆయన చేతుల మీదుగానే విడుదల చేశారు. ఫిదా మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇది చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్) చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. నీకొకటి నాకొకటి అనే పాటను రిలీజ్ చేశాం. ఈ సినిమాలో ప్రత్యేక గీతం రాసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది. పాట ఎంత బాగుంటుందో లిరికల్ వీడియో కూడా అంతే బాగుంటుంది.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విడుదల చేసిన ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయిగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్! )
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement