-
బొటాస్‌కు తొలి పోల్
వియన్నా: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ సీజన్లో తొలి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 03.130 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11వ, 17వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. -
బొటాస్‌కు రెండో టైటిల్
ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో విజేత స్పీల్బెర్గ్ (ఆస్ట్రియా): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా ఆదివారం జరి గిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులో బొటాస్ 71 ల్యాప్‌లను గంటా 21 నిమిషాల 48.527 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. ఈ సీజన్లోనే రష్యా గ్రాండ్‌ప్రిలోనూ బొటాస్ విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ వెటెల్‌కు రెండో స్థానం, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానం, హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానం పొందారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఈనెల 16న జరుగుతుంది. -
రికియార్డో తొలిసారి...
కెనడా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం - మెర్సిడెస్ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు - హామిల్టన్‌కు నిరాశ - ‘ఫోర్స్’ హుల్కెన్‌బర్గ్‌కు ఐదో స్థానం - ఎనిమిది మంది మధ్యలోనే అవుట్ మాంట్రియెల్ (కెనడా): ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తొలి ఆరు రేసుల్లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కెనడా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్లను వెనక్కినెట్టి రెడ్‌బుల్ జట్టు యువ డ్రైవర్ డానియెల్ రికియార్డో విజేతగా అవతరించాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు. అయితే రేసు సమయంలో రికియార్డో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఇంధనాన్ని వాడినట్లు తేలడంతో అతనిపై అనర్హత వేటు వేశారు. కెరీర్‌లోని తొలి రేసులోనే చేదు అనుభవాన్ని చవిచూసిన రికియార్డో నిరాశను పక్కనబెట్టాడు. కెనడా గ్రాండ్‌ప్రిలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అనుకున్న ఫలితాన్ని సాధించాడు. తన కెరీర్లో తొలి విజయాన్ని నమోదు చేయడంతోపాటు ఈ సీజన్లో రెడ్‌బుల్ జట్టుకు మొదటి విజయాన్ని అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రేసు ఆద్యంతం నాటకీయంగా సాగింది. 70 ల్యాప్‌ల ఈ రేసును రికియార్డో గంటా 39 నిమిషాల 12.830 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నాలుగు సెకన్ల తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో ఏకంగా ఎనిమిది మంది డ్రైవర్లు వివిధ కారణాలతో రేసు మధ్యలోనే వైదొలిగారు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో రేసును మొదలుపెట్టినా ఇంజిన్‌లో సమస్య కారణంగా 46వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. హామిల్టన్‌తోపాటు మరో ఏడుగురు డ్రైవర్లు గ్రోస్యెన్ (లోటస్), క్వియాట్ (ఎస్టీఆర్), కొబయాషి (కాటర్‌హమ్), మల్డొనాడో (లోటస్), ఎరిక్సన్ (కాటర్‌హమ్), మాక్స్ చిల్టన్ (మారుసియా), బియాంచి (మారుసియా) కూడా రేసును పూర్తి చేయలేకపోయారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలిచి తన ఖాతాలో 10 పాయింట్లు వేసుకోగా... మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ 11వ స్థానంలో నిలిచి త్రుటిలో పాయింట్‌ను కోల్పోయాడు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఈ నెల 22న జరుగుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement