-
Ayalaan OTT Release: ఓటీటీలోకి 'అయలాన్'
తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తమిళ్లో నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయలాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సన్ నెక్ట్స్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వర్షన్ రాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 19 నుంచి అయలాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం తమిళ్ వర్షన్లో సుమారుగా రూ. 100 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. -
OTT: ఒకేరోజు ఐదు సినిమాలు.. సలార్ హిందీ వర్షన్‌పై అప్డేట్
ప్రతివారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రమే పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటాయి. ఇకపోతే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన భారీ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్, అయలాన్, కాటేరా సినిమాలు శుక్రవారం (ఫిబ్రవరి 9న) డిజిటల్ ప్లాట్ఫామ్లో అడుగుపెట్టాయి. మరి ఈ చిత్రాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.. కెప్టెన్ మిల్లర్ ఎక్కడంటే? మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. రూ.280 కోట్లకు పైగా రాబట్టిన గుంటూరు కారం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీ తమిళనాట జనవరి 12న విడుదలైంది. తెలుగులో సంక్రాంతి బరిలో దిగిన సినిమాల లిస్ట్ పెద్దదిగా ఉండటంతో ఇక్కడ కాస్త ఆలస్యంగా విడుదలైంది. తెలుగులో జనవరి 26న రిలీజైంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. కాటేరా స్ట్రీమింగ్ అక్కడే! కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా విడుదలైన ఈ మూవీ తన సత్తా నిరూపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా రాబట్టింది. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నేడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీతో సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు ఆరాధన్ రామ్ కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సన్ నెక్స్ట్లో అయలాన్ తమిళ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం అయలాన్. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్ చేసిన హంగామా తమిళ ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ జనవరి 12న విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ సినిమా సన్ నెక్స్ట్‌లోకి వచ్చేసింది. Ayalaan vandhutaan! 👽🔥#Ayalaan is streaming worldwide now only on #SunNXT https://t.co/xFjM7jf2GI@Siva_Kartikeyan @rakulpreet @ravikumar_dir @arrahman#SivaKarthikeyan #ARRahman #AyalaanOnSunNXTFromFeb9 #AyalaanOnSunNXT #SunNXTExclusiveAyalaan pic.twitter.com/Ni1c8W4pHD — SUN NXT (@sunnxt) February 9, 2024 ఓటీటీలో థ్రిల్లర్ మూవీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. అదే భక్షక్. భూమి పడ్నేకర్ నటించిన ఈ మూవీకి పులకిత్ దర్శకత్వం వహించాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్ నిర్మించారు. ఈ సినిమా నేడే నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎట్టకేలకు సలార్ హిందీ వర్షన్‌పై అప్డేట్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా రాబట్టింది. జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా హిందీ వర్షన్ ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై బిగ్ అప్డేట్ వచ్చింది. హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 19న హిందీ వర్షన్ విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. Tumne bulaya aur Salaar chala aaya 😎 #SalaarInHindi streaming from 16th Feb.#Salaar #SalaarOnHotstar pic.twitter.com/few5IFwQyA— Disney+ Hotstar (@DisneyPlusHS) February 9, 2024 చదవండి: ‘ఈగల్’ టాక్ ఎలా ఉందంటే.. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే చాలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న దానిపై ఆసక్తితో ఉంటారు ఆడియన్స్. అలాగే ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ వారంలో పెద్ద సినిమాల సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాలు ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. సంక్రాంతి రిలీజైన సినిమాల్లో ఇప్పటికే సైంధవ్ స్ట్రీమింగ్ అవుతుండగా.. మహేశ్ బాబు గుంటూరు కారం, ధనుశ్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ ఈ వీకెండ్లో అలరించనున్నాయి. వీటితో పాటు భూమి పెడ్నేకర్ భక్షక్ క్రైమ్ థ్రిల్లర్, సుస్మితా సేన్ ఆర్య వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. మరీ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓ లుక్కేయండి. అంతే కాకుండా ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు మాస్ మహారాజా రవితేజ ఈగల్ వచ్చేస్తోంది. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం ఈనెల 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వస్తున్న యాత్ర-2 ఈ వారంలోనే థియేటర్లకు రానుంది. ఈనెల 8న యాత్ర-2 థియేటర్లలో విడుదలవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08 గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09 భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్ )- ఫిబ్రవరి 09 లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09 యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09 ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09 ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09 హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10 బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11 అమెజాన్ ప్రైమ్ కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09 డిస్నీప్లస్ హాట్ స్టార్ ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-09 జీ5 కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09 జియో సినిమా హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 8 సన్ నెక్ట్స్ అయలాన్- (తెలుగు డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి 09 -
స్టార్ హీరో సంక్రాంతి సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేస్తోంది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అయలాన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తమిళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించారు. మొదట ఈ మూవీని జనవరి 26న టాలీవుడ్ ప్రేక్షకులను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. కానీ కానీ ఊహించని విధంగా తెలుగు బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) అయితే ఈ చిత్రం ఓటీటీలోనే డైరెక్ట్‌గా రిలీజ్ చేయనున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్లుగానే తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఈనెల 9 నుంచి సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. దీంతో తమ అభిమాన హీరో మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Thamizh and Tattoo are all set to meet you on February 9th 👽🔥#Ayalaan streaming worldwide exclusively on #SunNXT@Siva_Kartikeyan @rakulpreet @ravikumar_dir @arrahman#SivaKarthikeyan #ARRahman #AyalaanOnSunNXTFromFeb9 #AyalaanOnSunNXT #SunNXTExclusiveAyalaan pic.twitter.com/m3QgKBosa8 — SUN NXT (@sunnxt) February 6, 2024 -
స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?
సంక్రాంతి సినిమాల సందడి ఆల్మోస్ట్ అయిపోయింది. 'హనుమాన్' తప్పితే మిగతావన్నీ సైడ్ అయిపోయాయి. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే కానుకగా ఇతర భాషా, డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. ఓ స్టార్ హీరో మూవీకి మాత్రం అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడా చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేయబోతుందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమా? ఏం జరుగుతోంది? తమిళనాడులోని థియేటర్లలో సంక్రాంతికి 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' చిత్రాలు విడుదలయ్యాయి. పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ దక్కించుకున్నాయి. తెలుగులోనూ పండగకే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్ల దొరక్క జనవరి 26న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా నిన్న అంటే శుక్రవారం.. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' థియేటర్లలోకి వచ్చింది. ఏవో ఆర్థిక సమస్యల కారణంగా 'అయలాన్' వాయిదా పడింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) అయితే 'అయలాన్' సినిమా తెలుగు వెర్షన్ విడుదలపై సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఓటీటీ ప్రకటన వచ్చేసింది. ఈ మూవీ త్వరలో తమ ఓటీటీలో రిలీజ్ కానుందని సన్ నెక్స్ట్ ప్రకటించేసింది. అయితే ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ అని అంటున్నారు. కానీ అంతకు ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒకవేళ తెలుగులో వచ్చేవారం.. అంటే ఫిబ్రవరి 2న థియేటర్లలో ఈ సినిమా రిలీజైనా సరే వారం పదిరోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేయొచ్చు. కాబట్టి తెలుగు వెర్షన్ విడుదల ఉంటుందా? లేదంటే శివకార్తికేయన్ 'అయలాన్' చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్? చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?) #Ayalaan is all set to land worldwide exclusively on #SunNXT 👽 Wait for the updates 😉@Siva_Kartikeyan @Rakulpreet @Ravikumar_Dir @arrahman#SivaKarthikeyan #ARRahman #SunNXTExclusiveAyalaan pic.twitter.com/tRPGrNUW2K — SUN NXT (@sunnxt) January 27, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీవీడ్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్‌డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
చిరు పై పోసాని సంచలన కామెంట్స్
Ragini Dwivedi: వైట్ అవుట్ ఫిట్ తో రాగిణి ద్వివేది అందాలు (ఫొటోలు)
తప్పక చదవండి
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement