-
ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యారేజ్‌లో పేలుడు పదార్థాలున్న వాహనం పేలి మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ట్యాంకర్‌కు వ్యాపించడంతో అది కూడా పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా రోజూ ఫుట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి వచ్చే యువకులే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాక్ సైన్యం ప్రకటనలో తెలిపింది. పేలుడుకు గల కరాణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. చదవండి: ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం -
హైదరాబాద్ టు బాగ్దాద్
శంషాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా బాగ్దాద్ వెళ్లేందుకు విమాన సర్వీసు ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 3.17 గంటలకు ‘ఫ్లై బాగ్దాద్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఐఎఫ్–462 టేకాఫ్ తీసుకుని తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్–బాగ్దాద్‌ల మధ్య వారానికి రెండు రోజులు ఈ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇక బాగ్దాద్ నుంచి వచ్చేవిమానం ప్రతి ఆదివారం ఉదయం 11.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. మంగళవారం బాగ్దాద్ నుంచి వచ్చే విమానం ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. అదేరోజు ఉదయం 10.55 కు ఇక్కడి నుంచి బాగ్దాద్ బయలుదేరుతుంది. పెరుగుతున్న మెడికల్ టూరిజం ఏటా ఇరాక్ నుంచి 10 శాతానికి పైగా మెడికల్ టూరిస్టులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారని పర్యాటక మంత్రిత్వశాఖ చెబుతోంది. అంతేగాక ఇరాక్‌లోని బాగ్దాద్, కర్బలా ప్రాంతాలకు కూడా మనదేశం నుంచి పర్యాటకుల రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించారు. -
రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి
బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. సోమవారం అత్యంత పటిష్ఠ భద్రత ఉండే గ్రీన్ జోన్‌ను(పార్లమెంటు భవనం) ముట్టడించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ జోన్లో కొందరు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పుల మోత మోగించారు. ఈ ఘటనలో 15 మంది సదర్ మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. అయితే ప్రత్యక్షసాక్షులు మాత్రం సదర్ మద్దతుదారులకు, ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేమ్ వర్క్ అనూకుల వ్యక్తులకు మధ్య ఘర్షణలు చెలరేగాయని పేర్కొన్నారు. కో ఆర్డినేషన్ ఫ్రేంవర్క్ సానుభూతిపరులు సదర్ మద్దతుదారులపై కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలోనే సదర్ సపోర్టర్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మరోవైపు కో ఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ ఈ దాడిని ఖండించింది. సదర్ మద్దతుదారులు సంయమనం పాటించి చర్చలకు రావాలని సూచించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులపై భద్రత దళాలు గానీ, పోలీసులు గానీ కాల్పులు జరపకుండా తాత్కాలిక ప్రధాని ముస్తఫా అల్ ఖదేమీ నిషేధం విధించారు. అందరూ శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. బాగ్ధాద్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలని సూచించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా బాగ్ధాద్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాక్‌లో ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్‌ను ముట్టడించారు. అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. చదవండి: 300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం -
ఇరాక్‌లో ఉద్రిక్తతలు.. 3 రోజులుగా పార్లమెంట్‌లోనే నిరసనకారులు
బాగ్దాద్: ఇరాక్‌లో ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇరాన్ అనుకూల పార్టీలు, షియా గురువు ముఖ్తదా అల్–సదర్ వర్గాల మధ్య రాజధాని బాగ్దాద్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్–సదర్ అనుచరులు మూడు రోజులుగా పార్లమెంట్లో బైఠాయించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటవలేదు. ఇరాన్ అండతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. షియా గురువు అల్–సదర్ అనుచర వర్గం ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. ఇరాన్ అనుకూల శక్తుల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బాగ్దాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. -
మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టూరిజానికి ప్రధాన హబ్‌గా మారిన హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాండ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్‌కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. చికిత్సలకు తక్కువ ఖర్చు అవుతుండటంతో.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బాగ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొదలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. (చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్ )
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement