-
ఫైనల్లో ముంబై గరుడ
► సెమీస్‌లో బెంగళూరుపై విజయం ప్రొ రెజ్లింగ్ లీగ్ న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో ముంబై గరుడ అప్రతిహతంగా దూసుకెళుతోంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బెంగళూరు యోధాస్‌ను 5-2తో ఓడించిన ముంబై ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా ముంబై ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకపోవడం విశేషం. పురుషుల 97కేజీ విభాగంలో జరిగిన తొలి బౌట్లో ఒడికడ్జ్ ఎలిజబెర్ 7-2తో పావ్లో ఒలియనిక్ను ఓడించి ముంబైకి తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత మహిళల 48కేజీలో రితూ ఫోగట్ అనూహ్యంగా పోరాడింది. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన అలీసా లాంప్ (బెంగళూరు)పై తొలి రౌండ్లో 0-4తో వెనుకబడింది. ఈ దశలో కోచ్ వ్యూహం ప్రకారం ముందుకెళ్లిన రితూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసింది. ఆ తర్వాత పుంజుకుని 8-4తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. బౌట్ పూర్తయ్యేసరికి 10-4 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పురుషుల 125కేజీలో గియోర్గి సకన్డెలిడ్జ్ 7-4తో డావిట్ను ఓడించి గరుడ ఆధిక్యాన్ని 3-0కు పెంచాడు. మహిళల 53కేజీలో ఒడునాయో అడెకురోయ్ 10-0తో లలితా షెరావత్‌ను చిత్తుగా ఓడించడంతో ముంబై ఫైనల్‌కు చేరడం ఖాయమైంది. చివరి మూడు బౌట్లలో బెంగళూరు ఐకాన్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74కేజీ) 7-0తో ప్రదీప్‌పై ఓదార్పు విజయాన్ని సాధించాడు. ముంబై ఐకాన్ రెజ్లర్ అడెలిన్ గ్రే కేవలం 45 సెకన్లలోనే 6-0తో నవజ్యోత్ కౌర్‌ను చిత్తు చేయగా చివరి బౌట్లో బజరంగ్ పూనియా 10-4తో అమిత్ ధన్కర్ను ఓడించి బెంగళూరుకు రెండో విజయాన్ని అందించింది. నేడు జరిగే రెండో సెమీస్‌లో పంజాబ్, హరియాణా తలపడతాయి. ఈ మ్యాచ్ విజేత ఫైనల్లో ముంబై గరుడతో ఆడుతుంది. -
ఢిల్లీ వీర్‌కు ఊరట
బెంగళూరు: ఆలస్యంగానైనా తేరుకున్న ఢిల్లీ వీర్ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ఎట్టకేలకు ఓ విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. బెంగళూరు యోధాస్‌తో బుధవారం జరిగిన తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ వీర్ 4-3తో గెలిచి ఊరట చెందింది. నిర్ణాయక ఏడో బౌట్లో నవ్రుజోవ్ ఇఖ్తియార్ (ఢిల్లీ వీర్) 10-1 పాయింట్ల తేడాతో బజరంగ్ పూనియా (బెంగళూరు)ను ఓడించి తమ జట్టుకు ఏకైక విజయం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అంతకుముందు పురుషుల 57 కేజీల విభాగంలో బెఖ్‌బాయెర్ (ఢిల్లీ వీర్) 7-0తో సందీప్ తోమర్‌పై, 125 కేజీల విభాగంలో దావిత్ (బెంగళూరు) 10-0తో కృషన్‌పై, 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ (బెంగళూరు) 8-4తో దినేశ్ కుమార్‌పై గెలిచారు. మహిళల 53 కేజీల బౌట్లో లిలియా హోరిష్నా (ఢిల్లీ వీర్) 11-6తో లలితా షెరావత్‌పై, 58 కేజీల బౌట్లో యులియా (బెంగళూరు) 3-1తో ఎలిఫ్ జాలెపై, 48 కేజీల బౌట్లో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్) 10-0తో అలీసా లాంపెపై విజయం సాధించారు. ఆరు జట్ల మధ్య జరుగుతోన్న ఈ లీగ్‌లో ఇప్పటికే పంజాబ్ రాయల్స్, హరియాణా హ్యామర్స్, ముంబై గరుడ, బెంగళూరు యోధాస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగే చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ముంబై గరుడతో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది. 25, 26 తేదీల్లో సెమీస్ జరుగుతాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement