-
‘మా ఆవిడకి నా పని నచ్చలేదు’
లండన్ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. 24 గంటలు ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది అయితే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం తమలోని సృజనాత్మకతను బయటపెడుతున్నారు. రకరకాల వంటలు చేస్తూ కుటుంబ సభ్యులపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇక నిత్యం పనితో బిజీబిజీగా గడిపేవారు మాత్రం లాక్డౌన్ వేళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో తోచగా తాము చేసే పనిని ఇంట్లోనే చేస్తూ కామెడీ పూలు పూయిస్తున్నారు. లాక్‌డౌన్‌తో రోజు పలు సమస్యలపై వ్యంగ్య ఆర్ట్స్ వేస్తూ ఆలోచింపజేసే బాన్స్కీ(బ్రిటన్ వీధుల్లో స్ప్రే పెయింటింగ్ వేయడంలో బాన్స్కీ దిట్ట) ఈ సారి కూడా ఓ వెరైటీ పెయింటింగ్‌తో ముందుకు వచ్చాడు. కానీ ఈ సారి వీధుల్లో పెయింటింగ్ వేయలేదు. తన ఇంట్లోనే ఈ పెయింటింగ్ వేశాడు. బాత్రూంలో ఎలుకలు చేసే పనిని తన పేయింటింగ్‌తో అద్భుతంగా చూపించారు. ఇక ఆయన వేసిన పేయింటింగ్‌లో ఓ ఎలుక పేస్ట్‌ను బయటకు వచ్చేలా తొక్కుతోంది. మరో ఎలుక టాయిలెట్ రోల్‌ను కిందకు లాగుతోంది. మరోకటి హ్యాండ్‌వాష్‌ను తన నోటితో కొరుకుతోంది. నిజమైన ఎలుకలు బాత్రూంలోకి వస్తే ఎలా ప్రవర్తిస్తాయో అలాగే ఉన్నాయి. ఇక ఈ పెయింటింగ్ ఫోటోను బాన్స్కీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ‘ నేను ఇంటి వద్ద నుంచి చేసిన పని(వర్క్ ఫ్రమ్ హోమ్) నా భార్యకు నచ్చడం లేదు’ అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం నాన్‌స్కీ పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కు ఇప్పటికే 1.5 మిలియన్ల లైకులు, 20 వేల కామెంట్లు వచ్చాయి. నాన్‌స్కీ పోస్ట్‌పై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. ‘మీ క్రియేటీవ్ పెయింటింగ్ చాలా బాగుంది. మీకు తెలుసా మీ బాత్రూం వెల కట్టలేనిది’, ‘ఎలుకలు చాలా ఉన్నాయి. పక్కింటి నుంచి పిల్లిని తీసుకురండి’, ‘మురికిగా బాత్రూంలంటే నాకిష్టం ఉండదు. కానీ నేను ఇలాంటి బాత్రూంను ఎందుకు కావాలనుకుంటాను’, ‘క్వారంటైన్ లో 365వ రోజు’ వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram . . My wife hates it when I work from home. A post shared by Banksy (@banksy) on Apr 15, 2020 at 10:45am PDT -
స్టీవ్ జాబ్స్ కూడా ఓ శరణార్థే!
ప్రముఖ బ్రిటన్ గ్రాఫిటీ చిత్రకారుడు బాన్క్సీ వేసిన ఓ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థుల సమస్యను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. ఉత్తర ఫ్రాన్స్ కలైస్ పట్టణంలోని శరణార్ధుల శిబిరం వద్ద యాపిల్ సంస్థ స్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ చిత్రాన్ని బాన్క్సీ గోడపై వేశాడు. ఈ చిత్రంలో స్టీవ్ జాబ్స్ పాతకాలపు యాపిల్ కంప్యూటర్ను చేతిలో పట్టుకొని భుజాన నల్లని బ్యాగు వేసుకొని ఉన్నాడు. ఇటీవల అనేక దేశాలు.. శరణార్థుల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామనే భావిస్తున్నాయి. దీనిని తప్పుపడుతూ బాన్క్సీ ఈ చిత్రాన్ని వేశాడు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం స్టీవ్ జాబ్స్ కూడా సిరియా నుంచి ఒక శరణార్థి లాగే అమెరికాలోకి ప్రవేశించాడని, జాబ్స్ ద్వారా ఆ దేశానికి ఆర్ధికంగా మేలే జరిగింది అనే విషయాన్ని బాన్క్సీ వెల్లడించాడు. 'ది జంగిల్' అనే శరణార్థుల శిబిరం వద్ద ఈ చిత్రాన్ని గమనించిన అధికారులు.. దీనిని అమూల్యమైన సంపదగా భావించి సంరక్షిస్తామని తెలిపారు. అలాగే ధ్వంసమైన పడవలో అవస్థలు పడుతున్న శరణార్థులు.. ఓ ఖరీదైన నౌక సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాన్ని సైతం బాన్క్సీ అద్భుతంగా ఆవిష్కరించి శరణార్థుల సమస్యలను కళ్లకు కట్టాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement