-
మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ సింగర్ కుమారుడు.. సోషల్ మీడియాలో వైరల్
లెజెండరీ సింగర్, దివంగత బప్పి లాహిరి కుమారుడు బప్పా లాహిరి మరో గుడ్ న్యూస్ చెప్పారు. తాను రెండో సారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ క్రిస్మస్ వేళ మేం నలుగురం కాబోతున్నాం అంటూ తన భార్య తనీషాతో కలిసి దిగిన ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ జంటకు ఇప్పటికే క్రిష్ అనే కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జంటకు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. బప్పా లాహిరి, తనీషా మార్చి 18, 2012 న పెళ్లి చేసుకున్నారు. అంతకుముందే వీరు ఒకరికొకరు పరిచయం ఉండగా.. కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. 2017లో వీరికి ఓ కుమారుడు జన్మించారు. బప్పి లాహిరి మరణం: బప్పి లాహిరి ఫిబ్రవరి 15న తుది శ్వాస విడిచారు. అతనికి కుమారుడు బప్పా లాహిరి, కుమార్తె రెమా లాహిరి సంతానం. View this post on Instagram A post shared by Bappa.b.Lahiri (@bappa.b.lahiri) -
బప్పి లహరితో నీకు పోలికేంటి? హీరోయిన్ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
Adah Sharma Trolled By Netizens: హార్ట్ ఎటాక్ హీరోయిన్ అదా శర్మ చేసిన పనికి నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? నువ్వు ఫేమస్ అవడం కోసం ఏదైనా చేస్తావా? అని దుయ్యబడుతున్నారు. ఇంతకీ అందరూ ఆగ్రహించేలా ఆమె ఏం చేసిందంటే... అదా శర్మ ఫేస్బుక్లో బప్పి లహరి ఫొటో పక్కన తన ఫొటోను జోడించింది. ఇందులో ఒంటి నిండా బంగారు నగలు ధరించి, వేళ్లకు ఉంగరాలు తొడుక్కుని బప్పి లహరి స్టైల్లో ఫొటోకు పోజిచ్చింది. అంతేకాదు, ఎవరి ఫొటో బాగుంది? అని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ జోడించింది. ఇది చూసిన నెటిజన్లు అంత పెద్ద సింగర్‌తో నీకు పోలికేంటి? అని ప్రశ్నిస్తున్నారు. 'లెజెండ్ ఎప్పటికీ లెజెండే, నువ్వు కనీసం ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేవు', 'భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన వ్యక్తితో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావా?, నీ సరదాల కోసం మరీ ఇలా దిగజారుతావా?', 'ఛీ, నీమీద ఉన్న గౌరవమంతా పోయింది' అంటూ అదాను ఏకిపారేస్తున్నారు. కాగా గ్రేట్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి ఫిబ్రవరి 16న మరణించారు. ఈయన అటు బాలీవుడ్లో, ఇటు సౌత్‌లో ముఖ్యంగా తెలుగు తమిళం, కన్నడ పరిశ్రమలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. 'ఆకాశములో ఒక తార', 'రాధా రాధా మదిలోన మన్మథ బాధ', 'భద్రాచలం కొండ', 'వానా వానా వెల్లువాయే', 'చిలుకా క్షేమమా', 'మావా మావా మావా..' వంటి ఎన్నో హిట్ సాంగ్స్ ఆయన సంగీతం అందించినవే! -
ముంబైలో బప్పి లహరి అంత్యక్రియలు, హాజరైన సినీ ప్రముఖులు
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి అంత్యక్రియలు ముంబైలో ప్రారంభమయ్యాయి. చివరి సారి ఆయనకు నివాళులు అర్పించేందుకు సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు అంత్యక్రియలకు తరలి వచ్చారు. ముంబైలో ఓ శ్మశాన వాటికలో బప్పి లహిరి అంత్యక్రియలు జరుగనున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన. ముంబైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
Bappi Lahiri: ఆ కళ్లద్దాలు 1.5 లక్షలు, గోల్డ్ టీ సెట్, ముల్లెట్ హెయిర్ స్టైల్.. ఇంకా
ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచిన బప్పీ లహిరి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. లక్షలాది మంది అభిమానులను శోక సంద్రంలో ముంచారు. కేవలం తన పాటలతోనే కాదు.. ఆహార్యంతోనూ అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిన బప్పీ ఇక సెలవు అంటూ దివికేగారు. ఫ్యాన్సీ కాలర్.. బప్పీ ఎక్కువగా కోట్లు ధరించడానికి ఇష్టపడేవారు. టీ–షర్ట్ పైన జాకెట్ ధరించేవారు. అలాగే తాను ధరించే కోట్ లేదా జాకెట్స్‌ని ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించుకునేవారు. ఫ్యాన్సీ కాలర్స్, ఆర్నమెంట్స్‌తో జాకెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండేవి. ముల్లెట్ హెయిర్ స్టయిల్ 1970లలో బాగా పాపులర్ అయిన హెయిర్ స్టైలే ముల్లెట్. కొంత పొడవుగా, పొట్టిగా ఉన్న వెంట్రుకల కలయికే ఈ హెయిర్ స్టైల్ ప్రత్యేకత. ఈ హెయిర్ స్టైల్‌నే బప్పీ చనిపోయేవరకు ఫాలో అయ్యారు. అదృష్ట అద్దాలు పగలేగాక, రాత్రి సమయాల్లో జరిగే ఈవెంట్లకు సైతం కళ్లద్దాలను తప్పనిసరిగా పెట్టుకునేవారు బప్పీ. 51 రకాల సన్ గ్లాసెస్ తన దగ్గర ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. రూ.1.5 లక్షల ఖరీదైన లూయిస్ వ్యూటన్ గ్లేర్ కళ్లద్దాలు కూడా బప్సీ కలెక్షన్స్‌లో ఉండడం విశేషం. ఇక 51 సన్ గ్లాసెస్‌లో నాలుగైదు అద్దాలు తనకు అదృష్టం తెచ్చిపెట్టాయని ఓ సందర్భంలో బప్పీ తపేర్కొన్నారు. అలాగే మెడలో ఉన్న గొలుసుల్లో ఒక గొలుసులో వినాయకుడి లాకెట్ కనబడుతుంది. ఎన్ని గొలుసులు మార్చినా బప్పీ ఇది మార్చేవారు కాదు. బయటికొచ్చేటప్పుడు ఆభరణాలు, సన్ గ్లాస్లు, ఆడంబరమైన దుస్తులు ధరించే బప్పీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా సింపుల్. మామూలు దుస్తులు ధరించడం ఆయన అలవాటు. అలాగే ఒంటి మీద ఆభరణాలు కూడా ఉంచుకునేవారు కాదు. గోల్డ్ టీ సెట్ బంగారు ఆభరణాలను ఇష్టంగా కొనుక్కున్న బప్పీ ఆ మధ్య ధన్తేరాస్కి వెరైటీ గోల్డ్ టీ–సెట్ కొన్నారు. ధన్తేరాస్కి ఏం కొందామని భార్య అడిగితే, ఒక మంచి గోల్డ్ టీ సెట్ కొని తెమ్మని అన్నారట. భర్త ఊహకు దగ్గరగా ఉన్న గోల్డ్ టీ సెట్ కొని, ఆయనకు బహుమతిగా ఇచ్చారు చిత్రాణి. ఫిష్ లవర్ బెంగాలీ ఫుడ్ అంటే బప్పీకి చాలా ఇష్టం. ముఖ్యంగా చేపలను ఇష్టంగా తినేవారు. వారానికి ఒక్కరోజు మాత్రమే శాకాహారం తీసుకునేవారు. మాంసాన్ని బాగా ఇష్టపడే బప్పీ అనారోగ్య కారణాలతో రెడ్ మీట్ మానేసారు. సాయంత్రం సమయంలో చికెన్ శాండ్విచ్ తినడానికి ఇష్టపడేవారు. సముద్ర చేపలకంటే నదిలో పెరిగే చేపలను బాగా ఇష్టపడేవారు. ఆవనూనెతో వండిన చేపల కూరను ఎక్కువగా తీసుకునేవారు. -కె చదవండి: Bappi Lahiri: మరణానికి రెండు రోజుల ముందు కూడా 'బంగారు' బప్పి.. పోస్ట్ వైరల్ -
Bappi Lahiri: మైఖేల్‌కు అన్నీ ఉన్నాయి.. కానీ నా దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే!
Bappi Lahiri- Michael Jackson: 1996లో కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ ముంబై వచ్చారు. ఆ సందర్భంలోనే బప్పీ లహిరిని చూశారాయన. ముఖ్యంగా బప్పీ మెడలో ఉన్న వినాయకుడి లాకెట్‌ని చూసి, ‘‘ఓ మై గాడ్.. అద్భుతం. మీ పేరేంటి’’ అని అడిగారు మైఖేల్. బప్పీ తన పేరు చెప్పారు. ‘‘మీరు కంపోజరా?’’ అడిగారు మైఖేల్. ‘‘అవును.. ‘డిస్కో డ్యాన్సర్’ చేశాను’’ అన్నారు బప్పీ. వెంటనే ఆ సినిమాలోని పాట ‘జిమ్మీ’ని ప్రస్తావించి, ‘‘నాకు మీ ‘జిమ్మీ జిమ్మీ..’ పాట చాలా ఇష్టం’’ అన్నారు మైఖేల్. మామూలుగా కొన్ని సందర్భాల్లో బప్పీ బంగారు గొలుసులను కొందరికి బహుమతిగా ఇస్తుంటారు. అయితే ఆ రోజు మైఖేల్‌కి వినాయకుడి లాకెట్ నచ్చినప్పటికీ ఆయనకు ఇవ్వలేదు. దానికి కారణాన్ని ఓ షోలో స్వయంగా చెప్పారు బప్పీ. ‘‘ఆ లాకెట్ మా ఆవిడ కొనిచ్చింది. నా లక్కీ లాకెట్. ఆయన (మైఖేల్)కు అన్నీ ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్నది ఈ బంగారం మాత్రమే. అది నా అదృష్టం. నేను కోల్‌కతాలో పుట్టాను. కానీ నన్ను మహారాష్ట్ర మట్టి ఆశీర్వదించింది. ఒకవేళ మైఖేల్‌కు నేను గణేశుడి లాకెట్ ఇచ్చి ఉంటే.. ఆ ఆశీర్వాదాలు నన్ను వదిలి వెళ్లిపోయి ఉండేవేమో’’ అని ఆ షోలో బప్పీ అన్నారు. అయితే 2009లో మైఖేల్ చనిపోయినప్పుడు ఆయన మీద ఉన్న ఇష్టంతో ప్రత్యేకంగా ఓ పాట కంపోజ్ చేశారు బప్పీ. – కె చదవండి: Rashmika Mandanna: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే ప్రేమ పెళ్లి చేసుకుంటా: రష్మిక
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement