-
బీడీ చుట్టలు చుడితేనే జీవనం సాగేది.. అలాంటిది పది లక్షలంటే..
సాక్షి, నిజామాబాద్(దోమకొండ): బీడీ చుట్టలు చుడితేనే ఆ పేద కుటుంబం జీవనం సాగేది. ఆర్థికంగా ఇబ్బందులున్నా చదువు ఉంటేనే భవిష్యత్తుల్లో ఏదో ఒకరకంగా జీవనం సాగించవచ్చని భావించి పాఠశాలకు పంపుతున్నారు. ఈలోగా తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కుమార్తె యాయత్రికి బోన్ క్యాన్సర్ అని తెలిసి దోమకొండకు చెందిన బీసు రాజనర్సు, అర్చన దంపతలు ఒక్కసారిగా కుంగిపోయారు. ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల కోసం ప్రస్తుతం ఆ పేద కుటుంబం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం విద్యార్థిని హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నెల కిందట చేతినొప్పి రావడంతో డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం బోన్ క్యాన్సర్‌గా ధృవీకరించారు. విద్యార్థిని తండ్రి రాజనర్సు కామారెడ్డిలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, తల్లి అర్చన బీడీలు చుడుతుంది. తమ కుమార్తె వైద్యం కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు రాజనర్సు (ఫోన్ నెంబర్ 9951068730) అర్చన (7036475197) విజ్ఞప్తి చేశారు. -
సొంత నివాసానికి సీఎం కేసీఆర్
క్యాన్సర్ రోగులతో మాటామంతి హైదరాబాద్: హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముచ్చటించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన సొంత నివాస భవనానికి వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉన్న బసవతారకం ఆసుపత్రిలో ఉన్న క్యాన్సర్ రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకోవటంతో పాటు రోగుల సహాయకులకు వసతి సదుపాయాలు, నైట్ షెల్టర్ల ఏర్పాటు అవసరాలను ఆరా తీశారు. ఇటీవల సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. సిటీలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటా రోగుల సహాయకులు ఉండేందుకు వీలుగా షెల్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించటం తెలిసిందే.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement