-
బాషా రీమేక్ చేస్తే?
తమిళసినిమా: బాషా చిత్రం సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీ కేరీర్లో గోల్డెన్ చిత్రంగా నిలిచిందనడంతో సందేహం లేదు. అప్పటివరకూ ఎక్కువగా కోలీవుడ్‌కే స్టార్ హీరోగా ఉన్న రజనీకాంత్‌కు ఇండియన్ సూపర్‌స్టార్ అంతస్తును తెచ్చిపెట్టిన చిత్రం బాషానేనని చెప్పక తప్పదు. సురేశ్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయనకు పెద్ద టర్నింగ్‌గా నిలిచింది. అందుకే బాషాకు సీక్వెల్ చేయాలన్న కోరిక ఆయనలో బలంగా ఉంది. రజనీకాంత్ ఓకే అంటే బాషా–2 చేయడానికి తాను రెడీ అని సురేశ్‌కృష్ణ చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాదు ఈ విషయమై రజనీకాంత్‌తో చర్చించారు కూడా. అయితే బాషా ఒక్కడేనని, మరో బాషా రాడని అప్పట్లో రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇలాఉండగా ప్రస్తుతం రీమేక్‌ల పర్వం నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో బాషా చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో అజిత్ మాత్రమే నటించగలరని నటుడు కరుణాకరన్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. అందుకు రీజన్ కూడా చెబుతూ ప్రస్తుతం స్టార్ హీరోలలో గ్యాంగ్‌స్టర్ పాత్రలకు అజిత్ మాత్రమే కరెక్ట్ అని ఆయన అన్నారు. ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన బిల్లా చిత్ర రీమేక్‌లో అజిత్ నటించి సక్సెస్ అయ్యారన్నది గమనార్హం. ప్రస్తుతం విశ్వాసం చిత్రానికి సన్నద్ధం అవుతున్న అజిత్ భవిష్యత్తులో బాషాగా మారే సాహసం చేస్తారో? లేదో చూడాలి. -
మరోసారి బాషాగా..?
‘ఈ బాషా ఒక్కసారి చెబితే... వంద సార్లు చెప్పినట్టే’... 1995లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్. ఆ మాటకొస్తే... ఇప్పటికీ ఆ డైలాగ్‌ని ఎవరూ మర్చిపోలేదు. రజనీ స్టైల్‌గా డైలాగ్ చెబితే అలానే ఉంటుంది మరి. మాస్ చిత్రాల్లో ‘బాషా’... నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా. ‘బాషా’ మార్క్ స్క్రీన్‌ప్లేతో దక్షిణాదిన లెక్కకు మించిన సినిమాలొచ్చాయి. తెలుగు ప్రేక్షకులకు అప్పటికే సుపరిచితుడైన రజనీకాంత్‌ని, ఇక్కడ కూడా సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన సినిమా ‘బాషా’. అందుకే... ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే... రేటింగ్ ఓ రేంజ్‌లోనే ఉంటుంది. ఇప్పుడీ చిత్రం సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయట. దర్శకుడు సురేశ్‌కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారని వినికిడి. ఇటీవలే సూపర్‌స్టార్‌తో కూడా ఈ విషయంపై చర్చించారట సురేశ్‌కృష్ణ. అయితే... రజనీకాంత్ మాత్రం భిన్నంగా స్పందించారని సమాచారం. కేవలం తమిళనాటకే పరిమితమైన తన స్టార్‌డమ్‌ని దేశవ్యాప్తం చేసిన సినిమా ‘బాషా’ అనీ, ఆ సినిమా సీక్వెల్ అంటే సాదాసీదా వ్యవహారం కాదని సురేశ్కృష్ణతో రజనీ అన్నారని బోగట్టా. అయినా, సురేశ్‌కృష్ణ మాత్రం కొండంత పట్టుదలతో సూపర్‌స్టార్‌ని మెప్పించే స్క్రిప్ట్ తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారట. అన్నీ కుదిరితే త్వరలోనే మళ్లీ ‘బాషా’గా సూపర్‌స్టార్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చూస్తారనమాట.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం..
‘శబరి’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
- సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement