-
Batukamma: అలాంటి పిచ్చి డ్యాన్స్‌లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!
ఎక్కడా లేనట్లుగా పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటున్నాం. ఎంతో విశిష్టత ఉన్న ఈ వేడుకల్లో తొమ్మిదిరోజులపాటు ఆడబిడ్డలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పొద్దున్నే లేచి తీరొక్క పూలను సేకరిస్తున్నారు. అందంగా బతుకమ్మలను పేర్చి సాయంత్రం అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతున్నారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పటి బతుకమ్మ ఆటాపాట తీరుపై పలువురు మహిళలు అసంతృప్తి వ్యక్తంజేస్తున్నారు. నాటి సంస్కృతి, సంప్రదాయాలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అప్పటి, ఇప్పటి బతుకమ్మ వేడుకల నిర్వహణపై పలువురు మహిళలు వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. చదవండి: బతుకమ్మ, జానపద సాంగ్స్‌తో ఉర్రూతలూగిస్తున్న సింగర్స్ అప్పట్లోనే బాగా ఆడేవాళ్లం కోటపల్లి: బతుకమ్మ పండుగత్తే మా చిన్నతనంలో ఎంతో సంబురపడేటోళ్లం. మాకన్న పెద్దోళ్లు ఆడుతుంటే వాళ్ల అడుగులో అడుగేసి వారి లెక్కే ఆడెటోళ్లం. నడుము వంచి చేతులతో చప్పట్లు కొడుతూ పాటలు పాడేవాళ్లం. ఇప్పటోళ్లకు డీజే పాటల మీద డ్యాన్సుల చేసుడు తప్ప చప్పట్లు కొడుతూ ఆడుడు తెల్వది. పాటలు పాడుతలేరు. చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతూ సంస్కృతిని కాపాడుకోవాలె. – కావిరి సుగుణ, రొయ్యలపల్లి, కోటపల్లి మండలం పెద్దవాళ్ల నుంచి నేర్చుకున్న.. చెన్నూర్: చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, అమ్మ బతుకమ్మ పాటలు పాడడం గమనించిన. నాకూ పాటలు అంటే ఇష్టం. ప్రతీ బతుకమ్మ పండుగకు పాటలు పాడడం చెప్పలేనంత సంతోషాన్నిస్తోంది. పండుగ వచ్చిందంటే కొత్తకొత్త పాటలు నేర్చుకొని తొమ్మిది రోజులు పాడేదాన్ని. బతుకమ్మ అంటేనే చప్పట్లు కొడుతూ పాడుతూ ఆడేది. బతుకమ్మ ఆటను అప్పట్లాగే ఆడితేనే బాగుంటది. – మదాసు శృతి, చెన్నూర్ పిచ్చి పాటలు.. పిచ్చి డ్యాన్స్‌లు.. కాసిపేట: ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ దాకా అప్పట్లో ఎంతో సంబురంగా చప్పట్లు కొడుతూ స్వయంగా పాటలు పాడెటోళ్లం. 40 ఏళ్లుగా మా ఊళ్లో నేను పాటలు పాడుతుంటే మిగతావాళ్లు పాడేది. ప్రస్తుతం ఏడ జూసినా సౌండ్ బాక్స్‌లు, డీజేలల్ల పిచ్చి పాటలు పెట్టి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తున్నరు. ఇది మన సంస్కృతి కాదని అందరూ తెలుసుకుంటే మంచిది. – సాయిని మల్లక్క, కోమటిచేను, కాసిపేట మండలం పాటలు పాడుతూ ఆడుతాం చెన్నూర్‌రూరల్: నేను బతుకమ్మ పాటలు పుస్తకంలో చూసి నేర్చుకొన్న. నా చిన్నతనం నుంచి బతుకమ్మ వద్ద పాటలు పాడుతున్న. మా వాడకు బతుకమ్మ ఆడేటప్పుడు చప్పట్లు కొడుతూ స్వయంగా పాడుతున్నం. ఊళ్లో చాలాచోట గిట్లనే ఆడుతున్నరు. నాకు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం. చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడి మన సంస్కృతిని కాపాడుకోవాలె. – గద్దె శ్రీలత, పొక్కూరు, చెన్నూర్ డీజే సౌండ్లు తప్ప చప్పట్లు లేవు కాసిపేట: బతుకమ్మ వేడుకలు మొదలైనయంటే తొమ్మిది రోజులు ఊళ్లో పండుగ వాతావరణం కనిపించేది. ఒకరు పాటందుకుంటే మిగతా వాళ్లు అనుకరించెటోళ్లు. సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఆనందంగా ఆడుకునెటోళ్లం. ఇప్పుడు డీజే సౌండ్లు, డ్యాన్స్‌లు తప్పా చప్పట్లు వినిపించడంలేదు. యువత పూర్వం నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాలె. – బూసి రాజేశ్వరి, సోమగూడం, కాసిపేట మండలం ఇప్పుడు పాడెటోళ్లే లేరు లక్సెట్టిపేట: చిన్నప్పుడు బతుకమ్మ పాటలు పాడుతూ సంబురంగా బతుకమ్మ పండుగను జరుపుకొనేటోళ్లం. బతుకమ్మ వచ్చిందంటే చాలు సంబురంగా పాటలు పాడేదాన్ని. ఇప్పుడు పాటలు పాడేవాళ్లే లేరు. డీజే పాటలు పెట్టుకుని ఆడుతున్నరు. రోజురోజుకూ ఆట తీరే మారుతున్నది. బాధనిపిస్తుంది. సంప్రాదాయాన్ని కాపాడుకోవాలె. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకోవాలె. – లింగాల దేవక్క, గంపలపల్లి, లక్సెట్టిపేట మండలం ఎంతో ఇష్టపడి పాటలు పాడుతా భీమారం: బతుకమ్మ పండుగ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రతీ సంవత్సరం పండుగ వచ్చిందంటే చాలు ఉదయాన్నే మాఇంట్లో లేని పూలను ఇంటింటికీ వెళ్లి సేకరించి బతుకమ్మను పేరుస్తా. డీజే పాటలు పెట్టినా నన్నే పాడుమంటరు. నేను పాడితే మిగతావాళ్లు సంబురంగా పాడుతున్నరు. మా ఊళ్లో ఎంతో ఇష్టంగా తొమ్మిదిరోజుల పాటు సంబురాలు జరుపుకొంటున్నం. – ఎల్కటూరి శంకరమ్మ, భీమారం మండలం ఇప్పటోళ్లకు ఆడుడే రాదు జన్నారం: నాడు సాయంత్రం బతుకమ్మ ఆట మొదలువెట్టి గంటలతరబడి ఆడుకునేది. వాడోళ్లందరం చప్పట్లు కొడుతూ పాటలు పాడెటోళ్లం. ఎంతో భక్తిశ్రద్ధలతో తొమ్మిదిరోజులు పండుగ జరుపుకొనేది. ఇప్పుడు ఎక్కడ చూసినా డీజే పాటలు పెట్టుకుని ఎగురుతున్నరు. బతుకమ్మల చుట్టూ కోలలాడుతున్నరు. బతుకమ్మ ఆటనే మార్చిండ్రు. ఇప్పటోళ్లకు ఎగురుడు తప్ప ఆడుడు రాదు. – అమరగొండ లక్ష్మి, జన్నారం మండలం మా అప్పుడు డీజేల లొల్లి లేదు లక్ష్మణచాంద: అప్పట్లో మేం బతుకమ్మ ఆడేటప్పుడు గీ డీజేల లొల్లి లేదు. అచ్చమైన బతుకమ్మ పాటలు పాడెటోళ్లం. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పుట్లు కొడుతూ ఒకరు ముందు పాడితే వెనుక అందరం పాడేది. ‘రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో..’ అంటూ రాగమెత్తితే ఆ జోష్ వేరేలా ఉండేది. ఇప్పటోళ్లకు అప్పటిలెక్క ఆడుడే రాదు. తెల్వనోళ్లు నేర్చుకుని ఆడాలె. – ఎంకవ్వ, లక్ష్మణచాంద సంప్రదాయాలను కాపాడుకోవాలె భీమిని: పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపైన ఉంది. పూలను దేవతగా పూజించే పండుగ మరెక్కడా లేదు. సంప్రదాయం ప్రకారం బతుకమ్మ ఆడాలి. నాడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుకునేవాళ్లం. నేడు డీజే సౌండ్ల మధ్య జరుపుతున్నారు. ఆనాటి సంప్రదాయాలను కాపాడుకోవాలె. – పుల్లూరి సురేఖ, కన్నెపల్లి, భీమిని మండలం అప్పటి ఆట పిల్లలకు నేర్పిస్తున్న భైంసాటౌన్: నేటి తరం పిల్లల కు మన అప్పటి బతుకమ్మ ఆట గురించి తెలియదు. పిల్లలకు వివరించేందుకు తల్లిదండ్రులకూ సమయం ఉండడం లేదు. నేను భరత నాట్యం నేర్చుకుని ఇప్పటి పిల్లలకు నేర్పుతున్న. బతుకమ్మ పండుగ అంటే డీజే పెట్టుకుని డ్యాన్సులు చేయడం కాదని వారికి వివరిస్తున్న. దీంతో వారిలో మార్పు వస్తోంది. కొందరైనా నన్ను అనుసరించడం సంతోషంగా ఉంది. – రంగు సౌమ్య, నృత్య శిక్షకురాలు, భైంసా -
బతుకమ్మ.. పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట!
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఆరంభమైంది. తొమ్మిది రోజులు వేడుకగా సాగే ఈ సంబురంలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ.. కోలాటాలతో ఆడబిడ్డలంతా కథాగానం చేస్తూ గౌరమ్మను పూజిస్తారు. ఈ పండుగ వేళ బతుకమ్మ జననం గురించి చెప్పే 200 ఏళ్ల నాటి పాట మీకోసం.. ‘‘శ్రీలక్ష్మీ దేవియు చందమామ- సృష్టి బతుకమ్మాయె చందమామ పుట్టిన రీతి జెప్పె చందమామ- భట్టు నరసింహకవి చందమామ ధర చోళదేశమున చందమామ- ధర్మాంగుడను రాజు చందమామ ఆరాజు భార్యయు చందమామ- అతి సత్యవతి యంద్రు చందమామ నూరునోములు నోచి చందమామ- నూరు మందిని గాంచె చందమామ వారు శూరులయ్యె చందమామ- వైరులచే హతమైరి చందమామ తల్లిదండ్రులపుడు చందమామ- తరగనీ శోకమున చందమామ ధనరాజ్యమునుబాసి చందమామ- దాయాదులను బాసి చందమామ వనితతో ఆ రాజు చందమామ- వనమందు నివసించె చందమామ కలికి లక్ష్మిని గూర్చి చందమామ- పలికె వరమడుగుమని చందమామ వినుతించి వేడుచు చందమామ- వెలది తన గర్భమున చందమామ పుట్టుమని వేడగా చందమామ- పూబోణి మది మెచ్చి చందమామ సత్యవతి గర్భమున చందమామ- జన్మించె శ్రీలక్ష్మి చందమామ అంతలో మునులునూ చందమామ- అక్కడికి వచ్చిరి చందమామ కపిలగాలవులునూ చందమామ- కశ్యపాంగీరసులు చందమామ అత్రి వశిష్టులూ చందమామ- ఆ కన్నియను జూచి చందమామ బతుకు గనె ఈ తల్లి చందమామ- బతుకమ్మ యనిరంత చందమామ’’ చదవండి: Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..! -
Bathukamma: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..!
Bathukamma 2022- Song: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో ఆడపడుచుల సంబరాల వేడుక ఆరంభమైంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచేట చేర్చి.. చుట్టూ తిరుగుతూ చప్పట్లతో తమ అనుభవాలు, ఆనందాలు, కష్టాలనే పాటలుగా మలిచి గౌరమ్మను కొలుస్తారు ఆడబిడ్డలు. ఇక ఏ పండక్కి పుట్టింకి వెళ్లినా వెళ్లకపోయినా చాలా మంది ఆడపడుచులు ఈ పండుగకు మాత్రం అమ్మగారింటికి వెళ్తారు. మరి అలా వెళ్లాలంటే అత్తింటి వారి అనుమతి తీసుకోవాలి కదా! ఓ ఆడబిడ్డను పుట్టింటికి తీసుకువెళ్లడానికి ఆమె అన్నలు రాగా.. అత్తమామలు, బావ- యారాలు(తోడికోడలు), ఆపై భర్తను అడిగి అనుమతి పొందిన తీరును పాటగా మలిస్తే... ఇలా.. ‘‘కలవారి కోడలు ఉయ్యాలో.. కనక మహాలక్ష్మి ఉయ్యాలో.. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో.. కడవల్లోనబోసి ఉయ్యాలో.. అప్పుడే వచ్చెను ఉయ్యాలో.. ఆమె పెద్దన్న ఉయ్యాలో.. కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో.. కన్నీళ్లు తీసింది ఉయ్యాలో.. ఎందుకు చెల్లెలా ఉయ్యాలో.. ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో.. తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో.. ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో.. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో.. వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో.. చేరి నీవారితో ఉయ్యాలో.. చెప్పిరాపోవమ్మ ఉయ్యాలో.. పట్టెమంచం మీద ఉయ్యాలో.. పవళించిన మామ ఉయ్యాలో.. మాయన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ అత్తనడుగు ఉయ్యాలో.. అరుగుల్ల గూసున్న ఉయ్యాలో.. ఓ అత్తగారు ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ బావనడుగు ఉయ్యాలో.. భారతం సదివేటి ఉయ్యాలో.. బావ పెద్ద బావ ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ అక్కనడుగు ఉయ్యాలో.. వంటశాలలో ఉన్న ఉయ్యాలో.. ఓ అక్కగారు ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో.. మీ భర్తనే అడుగు ఉయ్యాలో.. రచ్చలో గూర్చున్న ఉయ్యాలో.. రాజేంద్ర భోగి ఉయ్యాలో.. మా అన్నలొచ్చిరి ఉయ్యాలో.. మమ్ముబంపుతార ఉయ్యాలో.. కట్టుకో చీరలు ఉయ్యాలో.. పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో.. ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో.. వెళ్లిరా ఊరికి ఉయ్యాలో..’’ – సేకరణ: తొడుపునూరి నీరజ, కరీంనగర్ – విద్యానగర్(కరీంనగర్) -
Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే
బతుకమ్మ అంటే ఒక సంబరం. ఒక సాంస్కృతిక వారసత్వం. ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. అందుకే బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రకృతిలో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు పల్లె మహిళలు. తెలంగాణ జిల్లాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగే ఇది. ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి వరకు జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో అందగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో భాగం. వారి జీవన విధానంలో మమేకమై ఆనాదిగా ఆచారంగా వస్తున్న పండుగే బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వారం, పది రోజులు ఒక్కటే సందడిగా మారుతుంది. కొత్త బట్టలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ ఇది. సిబ్బి లేదా పళ్ళెం, తాంబాలంలో అడుగున ఆకులు పరిచి, తంగేడు, గునుగు పూలతో పాటు ప్రకృతిలో దొరికే ఏ పువ్వయినా బతుకమ్మలో పేర్చుతారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలకరించి పసుపు కుంకుమ అక్షింతలు వేసి, తమ ముత్తయిదువతానాన్ని నిలిపే గౌరవమ్మను భక్తిగా పూజిస్తారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతూ ఉత్సాహంగా వేడుక జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు మహిళలు. బతుకమ్మ వెనుక ఎన్ని కథలున్నా.. ఎంత చరిత్ర ఉన్నా బతుకమ్మ అచ్చంగా మనదైన పండుగ, మన ఆడపడుచుల పండుగ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement