-
చెత్త సినిమా ప్రియాంకదే!
లాస్ ఏంజిల్స్ : ప్రియాంక చోప్రా హాలీవుడ్లో నటించిన తొలి చిత్రం బేవాచ్ చెత్తసినిమాల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రతి ఏడాది చెత్త సినిమాలకు ర్యాంకులనిచ్చే గోల్డెన్ రాస్బెర్రి 'వరస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో 2017 ఏడాదికిగానూ బేవాచ్ ఎంపికైంది. చెత్త సినిమా, చెత్త స్క్రీన్ ప్లే, చెత్త రీమేక్, సీక్వెల్, చెత్త నటుడు కేటగిరీల్లో బేవాచ్‌ను ఎంపిక చేశారు. ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ లు జంటగా తెరకెక్కిన బేవాచ్ గత ఏడాది మే లో రిలీజ్ అయ్యింది. అయితే బుల్లితెర మీద ఘనవిజయం సాధించిన ఈ స్టోరి వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బేవాచ్ ఫ్లాప్ అయినా అందులో ప్రియాంక నటనకు మంచి మార్కులేపడ్డాయి. ఆ తర్వాత వచ్చిన క్వాంటికో సిరీస్‌లోనూ తన నటనతో ప్రియాంక అంతర్జాతీయ స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్న విషయం తెలిసిందే. చెత్త సినిమా విభాగంలో నామినీలు బేవాచ్ ది ఈమోజీ మూవీ ఫిఫ్టీ షేడ్స్ డార్కర్ ది మమ్మీ ట్రాన్స్ ఫార్మర్స్ : ది లాస్ట్ నైట్ చెత్త హీరోయిన్ విభాగంలో నామినీలు కేథరిన్ హిగ్(అన్ఫర్గటబుల్) డకోటా జాన్సన్(ఫిఫ్టీ షేడ్స్ డార్కర్) జెన్నీఫర్ లారెన్స్(మథర్) టైలర్ పెర్రీ(బూ 2 ఏ మాడీ హల్లోవీన్) చెత్త నటుల విభాగంలో నామినీలు టామ్ క్రూస్ (ది మమ్మీ) జాన్ డెప్ ( పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్స్ : డెడ్ మెన్ టెల్ నో టేల్స్) జామీ డోర్నన్ (ఫిఫ్టీ షేడ్స్ డార్కర్) జాక్ ఎఫ్రాన్ (బేవాచ్) మార్క్ వేల్ బర్గ్( డాడీస్ హోమ్ 2, ట్రాన్స్ ఫార్మర్స్ : ది లాస్ట్ నైట్) -
ప్రియాంక సినిమానే నెంబర్ వన్..!
హాలీవుడ్‌ను దున్నేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో రికార్డ్ సృష్టించారు. బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి మూవీతో పాటు క్వాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఎక్కువగా హాలీవుడ్ మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్న ప్రియాంక ఎక్కవుగా అక్కడే సమయం గడుపుతున్నారు. అయితే బేవాచ్ సినిమా రిజల్ట్ పరంగా నిరాశపరిచినా.. తాజాగా ఈ సినిమా ఖాతాలో ఓ రికార్డ్ చేరింది. ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ లు జంటగా తెరకెక్కిన బేవాచ్ ఈ ఏడాది మే లో రిలీజ్ అయ్యింది. అయితే బుల్లితెర మీద ఘనవిజయం సాధించిన ఈ స్టోరి వెండితెర మీద మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా 2017 ఇప్పటి వరకు అతి ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకున్న చిత్రాల్లో గత నెలలో బేవాచ్ తొలి స్థానంలో నిలిచింది. దీంతో వెండితెర మీద ఆకట్టుకోలేకపోయినా.. హోం థియేటర్లలో సత్తాచాటిన సినిమాగా రికార్డ్ సృష్టించింది బేవాచ్. ఈ సినిమా తరువాతి స్థానాల్లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2, మమ్మీ 2017 చిత్రాలు నిలిచాయి. -
హాలీవుడ్ స్టార్స్‌ను దాటేసింది..!
హాలీవుడ్‌ను దున్నేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో రికార్డ్ సృష్టించింది. బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి బేవాచ్ మూవీతో పాటు క్వాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ మోస్ట్ పాపులర్ నటిగా నిలిచింది. ప్రియాంక తన బేవాచ్ కోస్టార్ డ్వేన్ జాన్సన్ తో పాటు వండర్ వుమెన్ స్టార్ గాల్ గాడెట్ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. సోషల్ మీడియా ఎనలిటిక్స్ సంస్థ ఎంవీ పిండిక్స్ తాజాగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో మోస్ట్ పాపులర్ ర్యాంకింగ్ నటీనటుల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ప్రియాంక చోప్రా, డ్వేన్ జాన్సన్ సెకండ్ ప్లేస్, యాక్టర్, కమెడియన్ కెవిన్ హర్ట్ థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. వండర్ వుమెన్ స్టార్ గాల్ గాఢట్ నాలుగో స్థానంలో, కారా డెలివింగ్నే ఐదో ర్యాంక్ తో సరిపెట్టుకున్నారు. వీరి తరువాత స్థానాల్లో విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్ ఉన్నారు. -
ప్రియాంకకు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డు!
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు అరుదైన గౌరవం దక్కుతోంది. హాలీవుడ్లో కూడా అడుగుపెట్టి అక్కడ క్వాంటికో సిరీస్ చేయడంతో పాటు బేవాచ్ సినిమా కూడా చేసిన ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డును త్వరలో ఇవ్వనున్నారు. 'అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటి' విభాగంలో ఆమెకు ఈ అవార్డు ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించింది. ఈ విభాగాన్ని ఈ సారే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. గతంలో స్పోర్ట్స్ డ్రామా 'మేరీకోమ్' బయోపిక్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రియాంక.. అంతర్జాతీయంగా కూడా తన నటనకు మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు ఈ అవార్డు పొందుతున్న మొదటి మహిళగా ప్రియాంక నిలవబోతోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా ఆమె స్వయంగా నిర్ధారించాల్సి ఉంది. ట్విట్టర్లో కూడా ప్రియాంక దీని గురించి ఏమీ వ్యాఖ్యానించలేదు. జూన్ ఒకటో తేదీన ఈ అవార్డు బహూకరణ కార్యక్రమం జరగనుంది. అంతేకాదు.. ప్రియాంక తల్లి మధు చోప్రాకు కూడా ఒక అవార్డు రాబోతోంది. తొలిసారి ఆమె నిర్మాతగా వ్యవహరించి తీసిన 'వెంటిలేటర్' సినిమాకు గాను ఉత్తమ తొలి చిత్రం అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. హీరో సిద్దార్థ మండిపాటు అయితే ఈ అవార్డు విషయంలో ఒక వర్గం జాతీయ మీడియా వ్యవహరించిన తీరుపై హీరో సిద్దార్థ తీవ్రంగా మండిపడ్డాడు. శీర్షికలో 'అకాడమీ' అనే పేరును తీసేసి కేవలం దాదాసాహెబ్ ఫాల్కే అని మాత్రమే పెట్టడం పట్ల అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధ్యతారహితమైన జర్నలిజం అన్నాడు. The word academy has been swallowed in the headline. Click bait. Irresponsible journalism. pic.twitter.com/gb46N93GJn — Siddharth (@Actor_Siddharth) 29 May 2017 -
పిల్లల్ని పాడు చేయకండి!
ప్రియాంకా చోప్రా పద్ధతి చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. ఎంత ఇంగ్లీష్ సినిమా చేసినా... అక్కడి ప్రేక్షకుల కోసం రెండు పీలికల దుస్తులు (బికినీలు) వేసినా... భారతీయులకు ఓ సందేశం ఇచ్చారు. నా సినిమాకు మీ పిల్లల్ని తీసుకురావద్దని పెద్దలకు భలే పద్ధతిగా చెప్పారామె. ప్రియాంక నటించిన ఫస్ట్ హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’ జూన్ 2న విడుదలవుతోంది. అమెరికన్ ‘బేవాచ్’ టీవీ సిరీస్‌ను ఫాలో అయినవాళ్లకు అందులో నటించిన భామలు దాదాపు బికినీల్లో దర్శనిమిచ్చిన విషయం తెలుసు. ఒక్క లైన్లో చెప్పాలంటే, ‘బేవాచ్’ అంటే బికినీ బ్యూటీలకు ఫేమస్. ఆ సిరీస్‌కు కొన్ని మార్పులు చేసి, ‘బేవాచ్’ సినిమా తీశారు. ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌లో హాట్ హాట్‌గా కనిపించిన ప్రియాంక, ఈ సినిమాలోనూ అదే స్థాయిలో నటించారు. అందుకేనేమో... ‘ఈ సినిమాకు మీ పిల్లల్ని తీసుకు వెళ్లకండి’ అనే స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఇందులో ప్రియాంక విలన్‌గా చేశారు. హాట్ విలన్ వేషాలు చూసి, పిల్లలు ఎక్కడ పాడవుతారోనని వాళ్లకు సినిమా చూపించొద్దని భలే పద్ధతిగా చెప్పారు కదా! ప్రస్తుతం ఈ సినిమా ప్రచారం కోసం అమెరికాలో ఉన్న ప్రియాంక విపరీతంగా అందాలను ఒలకబోస్తున్నారు. ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో బికినీల్లో ప్రియాంక చేసిన సందడి, స్టిల్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్!!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement