-
మొబైల్ రంగంలోకి బాలీవుడ్ ఖాన్
వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫాంలో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సినిమాలతో పాటు వ్యాపార రంగం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే బీయింగ్ హ్యూమన్ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్న సల్మాన్, తాజాగా మొబైల్ రంగం మీద దృష్టిపెట్టాడు. ఇటీవల బీయింగ్ ఇన్ టచ్ అనే యాప్ విడుదల చేసిన కండల వీరుడు, త్వరలో మొబైల్ బ్రాండ్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ మొబైల్ కంపెనీ కోసం బీయింగ్ స్మార్ట్ అనే ట్రేడ్ మార్క్‌ను సైతం రిజిస్టర్ చేయించాడు. పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువచ్చే ప్లాన్‌లో ఉన్నాడు సుల్తాన్. బీయింగ్ హ్యూమన్ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సల్మాన్, తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు. -
ఫ్యాన్స్‌కు సల్మాన్ బర్త్‌డే గిఫ్ట్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ శాంతాక్లాజ్‌గా మారిపోయారు. ఎవరైనా బర్త్‌డేకి బహుమతులు పుచ్చుకుంటారు. కానీ ఈ కండలవీరుడు తన 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. అయితే ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా? సల్మాన్‌ఖాన్ సొంత దుస్తుల బ్రాండు 'బీయింగ్ హ్యుమన్' పై స్పెషల్ డిస్కౌంట్లు. బీయింగ్ హ్యుమన్ ఫ్లాట్‌పై 51 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన సర్ఫ్రైజ్ గిఫ్ట్‌ను రివీల్ చేశాడు. ప్రత్యేకంగా ఆన్లైన్ మింత్రాలో కూడా ఈ డిస్కౌంట్లు అందించనున్నట్టు తెలిపాడు. 'గెట్ రెడీ ఫర్ బిగ్ బర్త్ డే సర్ఫ్రైజ్' అంటూ అభిమానులకు అంతకముందే సల్లూభాయ్ ట్వీట్ చేశాడు. ఈ సర్‌ఫ్రైజ్‌ను ట్విట్టర్ ద్వారా తెలిపేశాడు. సామాజిక సేవలో భాగంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన సల్లూభాయ్, దీన్ని సేవలను మరింత విస్తరించడానికి ఈ బ్రాండు పేరుతోనే జువెల్లరీ రంగంలోకి సల్మాన్ అడుగుపెడుతున్న్డు. బర్త్‌డే సందర్భంగా బీయింగ్ హ్యుమన్ ఫౌండేషన్, స్టైయిల్ క్వాటియంట్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో బీయింగ్ హ్యుమన్ ఫ్యాషన్ జువెల్లరీని లాంచ్ చేస్తున్నాడు. Celebrate my birthday with Flat 51% Off at @bebeinghuman stores and exclusively online @Myntra https://t.co/3Uc5Wgncbf #2712 pic.twitter.com/mQsk7kU4Sr — Salman Khan (@BeingSalmanKhan) December 26, 2016 -
మరో కొత్త వ్యాపారంలోకి సల్మాన్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరో వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నాడట. ఈ విషయాన్ని ఆయన సోదరి అర్పిత ఖాన్ స్వయంగా వెల్లడించింది. ' రీటైల్ జ్యుయెల్లరీ ఇండియా 2016' అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. సల్మాన్ ఖాన్ ఫామస్ బ్రాండ్ ది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ద్వారా నగల వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది. తమకెంతో ఇష్టమైన జ్యుయెల్లరీ బిజెనెస్ ను వచ్చే త్వరలోనే లాంచ్ చేయనున్నామని చెప్పింది. అందుకే తాను ఈ ఈవెంట్ కి హాజరయ్యానని వివరించింది. వచ్చే నెల నుంచే ఆభరణాల పరిశ్రమలోకి ప్రవేశించనున్నామని ప్రకటించిన అర్పిత బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఉత్పత్తులు సరసమైన ధరలతో అన్ని రకాల వినియోగదారులకు అందుబాటులో వుండేలా చూస్తామన్నారు. ముఖ్యంగా 70 శాతం మహిళల కోసం 30శాతం పురుషులకుపయోగపడేలా తమ కలెక్షన్ ఉండబోతోందన్నారు. నటి ఇషా డియోల్, దర్శకుడు దివ్య ఖోస్లా కుమార్ అవార్డుల ప్యానెల్ లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. కాగా బీయింగ్ హ్యూమన్ అని రాసి ఉన్న టీషర్ట్ లతో సల్మాన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. దీని ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నాడు. మరోవైపు 1998 నాటి కృష్ణజింకలు, చింకారలని వేటాడి చంపినట్టుగా నమోదైన అభియోగాలను విచారించిన రాజస్థాన్ హై కోర్టు సల్మాన్ కు భారీ ఊరట నిచ్చింది. కింది కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు... దోషిగా తేల్చడానికి సరైన ఆధారాలు లేవంటూ, సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరో కేసులో సల్మాన్ ఖాన్..?
ఈమధ్యే ఓ కోర్టు వివాదం నుంచి బయటపడిన సల్మాన్ ఖాన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేలా ఉంది. ఇటీవల తన 50వ పుట్టిన రోజు సందర్భంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు సల్మాన్ ఖాన్. ఆన్లైన్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టిన సల్లూభాయ్, ఖాన్ మార్కెట్ ఆన్లైన్ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. అయితే వెబ్సైట్ ద్వారా ఇంకా అమ్మకాలు ప్రారంభం కాకపోయినా వివాదాలు మాత్రం ప్రారంభమయ్యాయి. గత 65 ఏళ్లుగా ఢిల్లీ వేదికగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఖాన్ మార్కెట్ సంస్థ తమ బ్రాండ్ నేమ్‌ను వాడుకోవటంపై అభ్యంతరం తెలిపింది. ఈ సందర్భంగా ఖాన్ మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సల్మాన్‌ను తన ఆలోచనను వెనక్కు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో తాము కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు. అయితే ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సల్మాన్ టెక్నికల్ టీం ఇప్పుడు పేరు మార్చటం కుదరదని చెపుతున్నారు. ఖాన్ మార్కెట్ నిర్వహకులు మాత్రం తామ బ్రాండ్ వాడుకోవద్దంటూ గట్టిగా చెపుతున్నారు. బీయింగ్ హ్యూమన్ అంటూ ప్రచారం చేస్తున్నసల్మాన్, తానే ఆ విలువలు పాటించకపోవటం కరెక్ట్ కాదని, పొరాపాటుగా తమ బ్రాండ్ వాడుకొని ఉన్నా, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెపుతున్నారు. లేని పక్షంలో లీగల్‌గా చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. -
హాఫ్ సెంచరీ కొట్టిన సల్మాన్
2015లో భారీ సక్సెస్‌లతో అలరించిన సల్మాన్ ఖాన్, ఈ ఏడాది మరో మెమరబుల్ మార్క్‌ను రీచ్ అయ్యాడు. ఈ ఆదివారం ( డిసెంబర్ 27) తన 50వ పుట్టిన రోజు వేడుకను జరుపుకుంటున్నాడు. ఇప్పటికీ బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న సల్లూ భాయ్, గోల్డెన్ జూబ్లీ బర్తే డే సెలబ్రేషన్స్‌ను భారీగా నిర్వహించడానికి అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ వెబ్ సైట్లలో సల్మాన్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ పోస్ట్‌లు వెళ్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు బీటౌన్ సెలబ్రిటీలు కూడా సల్మాన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు సల్మాన్ పాల్గొనే పుట్టిన రోజుక వేడుకలపై ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం సుల్తాన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సల్మాన్, ఈ సారి తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవటం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి కొంత మంది సల్మాన్ పుట్టిన రోజును బిగ్‌బాస్ 9 సెట్లో చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు. సల్మాన్ టీం నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం లేదు. ఈ సారి సల్మాన్ జరుపుకుంటున్న పుట్టినరోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. చాలా రోజులుగా సల్మాన్ ను ఇబ్బంది పెడుతున్న కోర్ట్ కేసుల నుంచి కండలవీరుడికి విముక్తి లభించటంతో పాటు సల్మాన్ జీవితకథ బీయింగ్ హ్యూమన్ పేరుతో పుస్తక రూపంలో రిలీజ్ అవుతోంది. ఇలా వరుస సక్సెస్‌లతో పుట్టిన రోజును గ్రాండ్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లూ భాయ్.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement