-
మహిళను అలా తాకి లైవ్‌లో బుక్కయ్యాడు!
-
మహిళను అలా తాకి లైవ్‌లో బుక్కయ్యాడు!
లండన్: టీవీ లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ మహిళను అనుచితంగా తాకినందుకు ఓ ప్రముఖ జర్నలిస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీబీసీ జర్నలిస్ట్ బెన్ బ్రౌన్ ఇంగ్లండ్ లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో నార్మన్ స్మిత్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేబర్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా కొన్ని కీలక విషయాలపై వీరు చర్చిస్తున్నారు. ఇంతలో బెన్ బ్రౌన్కు పరిచయం ఉన్న ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతుండగానే బొటనవేలుతో సక్సెస్ అంటూ చూపిస్తూ అతడిని పలకరించింది. లైవ్ ఇంటర్వ్యూకు సమస్య తలెత్తుతుందని భావించిన బ్రౌన్ వెంటనే ఆ మహిళను కాస్త పక్కకు జరుగు అంటూ అసభ్యకర రీతిలో టచ్ చేస్తూ ఆమెను వెనక్కి జరిపాడు. అనుకోని సంఘటనతో కంగుతిన్న మహిళ వెంటనే తేరుకుని, బెన్ బ్రౌన్‌ను ఒక్క దెబ్బకొట్టి మరీ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఎంత బిజీ పనులలో ఉన్నా మహిళల పట్ల ఆ తరహాలో అసభ్యంగా ప్రవర్తించకూడదని, మహిళలను అలా తాకవద్దంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బెన్ మాత్రం అనుకోకుండా అలా జరిగిపోయిందని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని వివరణ ఇచ్చుకున్నా అలా ప్రవర్తించడం ముమ్మాటికీ తప్పేనంటూ హితవు పలికారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తెలుగు వాళ్లు నా సినిమాలు కాపీ కొట్టారు: తమిళ డైరెక్టర్
ఒక్క మెసేజ్‌తో 'సలార్' బైక్‌ను సొంతం చేసుకున్న అదృష్టవంతుడు
హిందువులను విభజించేందుకు ప్రయత్నం: కాంగ్రెస్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు
రాజస్తాన్‌తో మ్యాచ్.. ఎస్ఆర్హెచ్ స్టార్ ప్లేయర్ ఎంట్రీ! తుది జట్లు
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
తప్పక చదవండి
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- 'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement