-
బెంగళూరులో ఏం జరగలేదా?
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు న్యూఇయర్ వేడుకల్లో మహిళలు, యువతులపై జరిగిన భారీ లైంగిక వేధింపుల ఘటనపై మొన్న ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యలు చేయగా తాజాగా సిటీ పోలీస్ బాస్ ప్రవీణ్ సూద్ వ్యాఖ్యలు చేశారు. అసలు బెంగళూరులో పెద్ద మొత్తంలో లైంగిక వేధింపులు జరిగినట్లు ఆధారాలే లేవని అన్నారు. 30 సెకన్లపాటు జరిగిన దాన్ని మాత్రమే పదేపదే చూపించి హడావుడి చేశారని, దానికి ముందు దానికి వెనుక ఏంజరిగిందో ఎవ్వరికీ తెలియదంటూ సమాధానం ఇచ్చారు. అయినా, దాదాపు కోటి జనాభా ఉండే బెంగళూరులో ఇలాంటివి జరిగి ఉండొచ్చని తర్వాత అన్నారు. ఈ ఘటనను మాస్ మోలెస్టేషన్(పెద్దమొత్తంలో జరిగిన లైంగిక వేధింపులు) అంటూ పిలవడాన్ని తాను ఒప్పుకోనని, మహిళల విషయంలో పెద్ద తప్పు జరిగిందని మాత్రం చెప్పారు. బెంగళూరులోని ఎంజీ రోడ్డులో న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో పెద్దమొత్తంలో అమ్మాయిలు, మహిళలపై యువకులు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పలు కథనాలు వచ్చాయి, ఫొటోలు కొన్ని వీడియోలు కూడా ఆ సంఘటనను రుజువు చేశాయి. దీంతో అక్కడి పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వారికి మొన్న రాష్ట్ర హోంమంత్రి అండగా నిలవగా తాజాగా సీటీ పోలీస్ చీఫ్ ప్రవీణ్ సూద్ మద్దతిచ్చారు. 'డిసెంబర్ 31న పోలీసులు అక్కడే ఉన్నారు. 20 మీడియాలకు చెందిన ఓబీ వాహనాలు ఎంజీ రోడ్డులోనే ఉన్నాయి. అక్కడి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు జనవరి 1వ తేదిన ఏ ఒక్కరూ రిపోర్టు చేయలేదు. నిజంగా ఏదైనా తప్పు జరిగితే ఈ రోజుల్లో క్షణాల్లో వైరల్‌గా మారుతుంది.. కనీసం ఏ ఒక్కరు కూడా ఆరోజు ఈ విషయాన్ని లేవనెత్తలేదు' అని మీడియాతో అన్నారు. అంటే ఆ రోజు బెంగళూరులో ఏమీ జరగలేదని అంటారా అన్న ప్రశ్నకు బదులిస్తూ 'అది జరగలేదనే నేను చెబుతున్నాను' అంటూ బదులిచ్చారు. అయితే, పది మిలియన్ల జనాభా ఉన్న బెంగళూరులో ఇలాంటి కార్యక్రమం(న్యూఇయర్ వేడుక) సందర్భంలో ఏం జరగలేదని మాత్రం చెప్పలేము. నిజంగా మూడు రోజుల కిందట ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా తమవద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజు ఫుటేజీ మొత్తాన్ని మీడియా వక్రీకరించిందని, 30 సెకన్ల వీడియోని మాత్రమే పదేపదే చూపిందని, కానీ దాని తర్వాత ఏం జరిగిందో మాత్రం చూపలేదని అన్నారు. అయితే డిసెంబర్ 31 తేదిన రాత్రి ఎం,జీ, రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో మహిళలపై దాడుల్లో మీడియాలో వచ్చిన ఆధారాల ప్రకారం సిటీలోని అశోక్‌నగర, ఇందిరానగర, కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్లలో సుమోటోగా మూడు కేసులు నమోదు చేసినట్లు ప్రవీణ్ సూద్ తెలిపారు. ఎవరైనా పూర్తి ఆధారాలు అందజేస్తే కేసును మరింత వేగవంతంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా న్యూఇయర్ వేడుకలను కవర్ చేసిన 45 సీసీటీవీ కెమెరాలన్నింటిలో అమ్మాయిలు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసిన సన్నివేశాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
నలుగురు దొరికారు, ఇద్దరు పరారీ
బెంగళూరు: కమ్మనహళ్లి కాముకుల్లో నలుగురు పోలీసులకు చిక్కారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులకు పట్టుబడ్డ నిందితుల్లో ముగ్గురు 20 ఏళ్లు లోపువారు కావడం గమనార్హం. ఘటన వెలుగులోకి వచ్చిన దాదాపు 48 గంటల్లోపు పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 1 అర్థరాత్రి 1:40 గంటలకు కమ్మనహళ్లి వద్ద నడుచుకుని వెళుతున్న యువతితో స్కూటీపై వచ్చిన ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆరుగురూ కలిసి మూడు బైక్‌లలో ఆమెను వెంబడించారు. నిందితులు అయ్యప్ప అలియాస్ నితీష్‌కుమార్ (19) (ఏ1), లెనో అలియాస్ లెనిన్ ప్యాట్రిక్ (20), సుదేష్ అలియాస్ సుధి (20), సోమశేఖర్ అలియాస్ చిన్ని (24)లని పోలీసు కమిషనర్ ప్రవీణ్‌సూద్ మీడియాకు వెల్లడించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులందరూ స్థానికంగా ఉంటూ చిన్నాచితకా ఉద్యోగాలు చేసేవారు. తన ఇంటి బయటి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన చిత్రాలను పరిశీలించి, వాటిని పోలీసులకు అందజేసిన యజమాని ప్రశాంత్ ఫ్రాన్సిస్‌ను నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్ సూద్ అభినందించారు. -
అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన నటుడు
ముంబై: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ రిజ్వీపై బాలీవుడ్ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాశ్చాత్య దుస్తులు ధరించడం వల్లే మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చేసిన రిజ్వీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘మహిళలు విదేశీ దుస్తులు ధరించొద్దు. ఎందుకంటే పాశ్చాత్యుల్లా దుస్తులు తొడుక్కున్న మగాళ్లు కీచకులుగా మారి వేధింపులకు పాల్పడుతున్నారు. చొక్కా ధరించిన మగాడు ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఇంతకన్నా విడ్డూరం ఉండద’ని ట్వీట్ చేశాడు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులో పోలీసుల సమక్షంలోనే పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురైన ఘటనపై స్పందిస్తూ రిజ్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాశ్చత్య దుస్తులు ధరించి మహిళలు రాత్రిపూట బయటకు రావొద్దని ఆయన హితబోధ చేశారు. రిజ్వీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పలువురు తప్పుబట్టారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
పోలింగ్‌పై పోస్టుమార్టం..
నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!
Anjali Lavania: పంజా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..! (ఫోటోలు)
ఏలూరులో చల్లారని రగడ...
పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
ఏకకాలంలో ఎన్నోపనులు..!
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement