-
స్నేహితులను వదిలి వెళ్లిపోయారు: ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్ర కారుడు ప్రొఫెసర్ బిపన్ చంద్ర మరణం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటించారు. ఆధునిక భారతదేశంలోని మొదటితరంలో మేధావుల్లో బిపన్ చంద్ర ఒకరని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కీర్తించారు. ఆయన సేవలకు దేశం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించిందని గుర్తు చేశారు. ఎంతో మంది స్నేహితులు, సహచరులు, విద్యార్థులను వదిలి ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు సంతాప సందేశాన్ని బిపన్ చంద్ర తనయుడు బికాస్ చంద్రకు రాష్ట్రపతి పంపించారు. -
చరిత్రకారుడు బిపన్ కన్నుమూత
గుర్గావ్(హర్యానా): ఆధునిక భారతదేశ చరిత్రను సాధారణ ప్రజలకు చేరువ చేసిన ప్రముఖ చరిత్ర కారుడు బిపన్ చంద్ర(86) ఇకలేరు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం గుర్గావ్లోని స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల కిందట భార్య మరణించినప్పటినుంచి చంద్ర ఆరోగ్యం సరిగ్గా లేదని, అయితే కడపటి వరకు రచనలు సాగిస్తూనే వచ్చారని ఆయన మాజీ శిష్యుడు, జవహర్లాల్ వర్సిటీ కాలేజీలో సహోద్యోగి అదిత్య ముఖర్జీ చెప్పారు. ఆరోగ్యం బాగాలేకున్నా ఆత్మకథతోపాటు భగత్‌సింగ్ జీవిత చరిత్రను పూర్తి చేశారని, అవి ముద్రణకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. దేశ ఆర్థిక, రాజకీయ చరిత్రలను వామపక్ష కోణంలో పరిశోధించిన చంద్ర చేసిన రచనలు మేధావులతోపాటు సాధారణ పాఠకుల ఆదరణ కూడా చూరగొన్నాయి. వలసవాదం, జాతీయోద్యమం, సమకాలీన చరిత్ర, మతతత్వ వ్యతిరేక ఉద్యమాలపై ఆయన విస్తృతంగా రచనలు చేశారు. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ: జేపీ మూవ్మెంట్ అండ్ ది ఎమర్జెన్సీ’, ‘ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం’, ‘నేషనలిజం అండ్ కలోనియలిజం ఇన్ మోడరన్ ఇండియా’, ‘ద మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా: ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ’, ‘ద ఇండియన్ లెఫ్ట్: క్రిటికల్ అప్రైజల్’ తదితరాలు ఆయన రచనల్లో కొన్ని. మహాత్మాగాంధీ జీవితంపై సాధికార రచనలు చేసిన చంద్ర చరిత్ర పుస్తకాలు పాఠశాలలు, కాలేజీల సిలబస్‌లో చోటుసంపాదించుకున్నాయి. 1928లో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో జన్మించిన ఆయనలాహోర్లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీ, స్టాన్‌ఫర్డ్ వర్సిటీ(అమెరికా), ఢిల్లీ వర్సిటీల్లో చదువుకున్నారు. జేఎన్‌యూలోని చరిత్ర అధ్యయనాల కేంద్రం అధ్యక్షుడిగా, యూజీపీ సభ్యుడిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్‌గా పనిచేశారు. ‘ఎంక్వైరీ’ పత్రికను స్థాపించి చాలాఏళ్లు సంపాదకమండలి సభ్యుడిగా వ్యవహరించారు. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన మృతితో నిబద్ధులైన మేధావుల శకం ఒకటి వెళ్లిపోయిందని అభిమానులు పేర్కొన్నారు. చంద్ర మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర నేతలు కూడా నివాళి అర్పించారు. బ్రిటిష్ వలసవాదంపై పోరులో లౌకిక, వామపక్ష శక్తుల పాత్రను చంద్ర వెలుగులోకి తెచ్చారని సీపీఐ కేంద్ర సెక్రటేరియట్ ఓ ప్రకటనలో కొనియాడింది. భవిష్యత్ తరాలకు మార్గదర్శకం: జగన్ సాక్షి, హైదరాబాద్: బిపన్ చంద్ర మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామం, మహాత్మాగాంధీ ఆ ఉద్యమాన్ని నడిపిన తీరు వంటి అంశాలపై చంద్ర రచనలు దశాబ్దాలుగా చరిత్ర కారులకు, చరిత్ర విద్యార్థులకు చుక్కానిలా ఉపయోగపడ్డాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశచరిత్ర ఆర్థిక, రాజకీయ కోణాలను విశ్లేషిస్తూ ఆయన చేసిన రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement