-
ట్రంప్ కేబినెట్లో బాబీ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన ట్రంప్ కేబినెట్లో భారతీయ అమెరికన్ బాబీ జిందాల్‌కు స్థానం లభించనుందని మీడియా పేర్కొంటోంది. జిందాల్ లూసియానా గవర్నర్‌గా రెండు సార్లు పనిచేయడం తెలిసిందే. ట్రంప్ కేబినెట్లో జిందాల్‌కు స్థానం దక్కితే.. ఆ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. అంతేకాకుండా యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికరుున రెండవ అమెరికన్ అవుతారు.బెన్ కార్సన్‌తో కలసి జిందాల్‌ను ఆరోగ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వీరిద్దరూ రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికలకు పోటీపడడం తెలిసిందే. సుప్రీం జడ్జీల నామినీల్లో అముల్! అమెరికా సుప్రీంకోర్టు జడ్జి పదవి కోసంట్రంప్ తయారుచేసుకున్న జాబితాలో భార తీయ అమెరికన్ జడ్జి అముల్ థాపర్(47) చోటు దక్కించుకున్నారు. ముగ్గురు సుప్రీం జడ్జీల ఎంపిక కోసం 21 మందితో కూడిన ఈ జాబితాలో అముల్ గట్టి అభ్యర్థి. -
అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్న బాబీ జిందాల్
లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. 2016లో జరగనున్న అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీలో ఉన్న ఆయన.. మంగళవారం తన ప్రచారాన్ని నిలిపివేశాడు. ఈ సందర్భంగా జిందాల్ మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ తరపున మరో అభ్యర్థిని తాను బలపరచదలచుకోలేదన్నారు. అయితే పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని తెలిపారు. అధ్యక్ష రేసు కోసం ఎంతో సమయాన్ని విధానాల తయారీకి, ఇతరత్రా విషయాల కోసం వెచ్చించినట్లు వెల్లడించాడు. అయితే ఇది తనకు సరైన సమయం కానందున రేసు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలిపాడు. బాబీ జిందాల్ తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ తరపున ఇంకా బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు. బాబీ జిందాల్ తన ప్రచారంలో మొదటగా ఎన్నికలు జరిగే లోవా ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అయితే అక్కడి ఓటర్ల నుంచి ఆశించినంత మేర ఆదరణ జిందాల్‌కు లభించలేదు. అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న బలమైన ఇతర అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, బెన్ కార్సన్ల నుంచి ఎదురవుతన్న పోటీలో జిందాల్ వెనుకబడ్డాడు. నిధుల సమీకరణలో కూడా జిందాల్‌కు నిరాశ తప్పలేదు. వీటన్నింటి దృష్ట్యా ప్రాక్టికల్‌గా ఆలోచించి జిందాల్ పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
'అరెస్టుకు ఆమె ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారు'
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ అరెస్టు అవడానికి కేవలం ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారని లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ వ్యాఖ్యానించారు. కోర్టు ప్రొసిడింగ్స్‌లో ఆమె చెప్పిన అబద్దాలు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగత మెయిల్స్ సమాచారం వాడుకున్న విషయాలు బయట పడతాయని ఆయన పేర్కొన్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరఫున బాబీ జిందాల్ అమెరికా అధ్యక్షపదవి బరిలో ఉన్న విషయం విదితమే. స్టేట్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఆమె మెయిల్స్ ను బహిర్గతం చేయాల్సిందిగా వచ్చిన ఆదేశాల అనుసారం హిల్లరీ ఈ సమాచారాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా జిందాల్ మాట్లాడుతూ.. హిల్లరీ ఇకనైనా చైనీస్ ప్రభుత్వాన్నిడాక్యుమెంట్లు డంప్ చేయవద్దని వేడుకోవడం మంచిదంటూ హెచ్చరించారు. ఇందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని జిందాల్ చెప్పారు. టాప్ సిక్రెట్ అని రాసి ఉంచిన మెయిల్స్ కొన్నింటిన క్లింటన్ తాను సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు సర్వర్ నుంచి వాడుకున్నట్లు బహిర్గతమయ్యాయి. 2009-2011 మధ్య కాలంలో డిపార్ట్మెంట్ ఉద్యోగులు కొన్ని మెయిల్స్ చేశారని, అందులో కొన్ని హిల్లరీకి పంపినట్లు ఈ ఘటనతో బయటపడింది. -
ఫేస్బుక్లో జిందాల్ హవా
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బాబీ జిందాల్ ఇప్పుడు ఫేస్బుక్లో హవా సృష్టిస్తున్నారు. జిందాల్‌కు ఫేస్బుక్లో 21 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, 49 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులలో ఎక్కువగా చర్చలో ఉన్న వారిలో పదో వ్యక్తిగా బాబీ జిందాల్ నిలిచారు. ఆయనతో పాటు టెక్సాస్ మాజీ గవర్నర్ రికీ పెర్రీ కూడా ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. అయితే వీళ్లిద్దరినీ ఫాక్స్ న్యూస్ తమ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌కు పిలవలేదు. కానీ బాబీ జిందాల్, పెర్రీ ఇద్దరూ మాత్రం గురువారం రాత్రి జరిగిన హేపీ అవర్ డిబేట్లో పాల్గొన్నారు. పెర్రీకి 24 లక్షల మంది ఫాలోవర్లుండగా 73 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. అందరికంటే అగ్రస్థానంలో బిజినెస్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయనకు 2.62 కోట్ల మంది ఫాలోవర్లుండగా 13.56 కోట్ల మంది సంభాషణలు జరుపుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్ ఉన్నారు. -
వెనుకబడ్డ బాబీ జిందాల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన ఇండియన్-అమెరికన్ బాబీ జిందాల్ ఎన్నికల నిధుల వేటలో వెనుకబడ్డారు. గత వారంలో రోజుల్లో ఆయన 579,000 డాలర్లు సేకరించారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయన ఇప్పటివరకు 9 మిలియన్ డాలర్లుపైగా పోగుచేశారు. తనతో పాటు అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థులతో పోలిస్తే విరాళ సేకరణలో జిందాల్ వెనుకబడ్డారు. సొంత పార్టీలో జిందాల్ కు పోటీలో నిలిచిన ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ 16 రోజుల్లోనే 11.4 మిలియన్ డాలర్లు కూడగట్టారు. డెమొక్రటిక్ పార్టీ తరపున బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ ఖాతాలో దాదాపు 47.5 మిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలోగా 100 డాలర్లు సేకరించాలని హిల్లరీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్‌గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement