-
వాట్సాప్ కేసులో ఫేస్బుక్ కు మరోషాక్
రియోడిజనిరో: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు బ్రెజిల్ లో మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. నిందితుల సమాచారాన్ని అందించే విషయంలో బ్రెజిల్ పోలీసులు, ఫేస్బుక్ మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తాజాగా బ్రెజిల్ కోర్టు సంస్థకు చెందిన భారీ నిధులను సీజ్ చేసింది. అమెజాన్ ఫెడరల్ కోర్టు దాదాపు 11.7 మిలియన్ డాలర్లను(38 మిలియన్ రియాస్) ఫ్రీజ్ చేసింది . కోర్టులు, పోలీసులు ఆదేశాలను ధిక్కరించిన ఆరోపించిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ జాబర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. డేటాని సరఫరా చేసే విషయంలో కోర్టు నియమాన్ని పాటించని ఫేస్ బుక్ ఇంక్ పై అగ్రహం వ్యక్తం చేసిన కోర్టు దాని ఖాతా లోని నిధులను స్తంభింప చేసింది. క్రిమినల్ కేసు విచారణలో నిందితుల సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు ఈ సంస్థ అనుబంధ సంస్థ వాట్సాప్ నిరాకరించడంతో ఈ మేరకు నిధులను ఫ్రీజ్ చేశారు. అయితే ఈ పరిణామంపై ఫేస్ బుక్ ఇంకా స్పందించలేదు. అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా కేసుకు సంబంధించిన నేరస్తులు వాట్సాప్ ద్వారానే సంప్రదింపులు జరిపారని, ఆ వివరాలు తమకు తెలపాలని గతంలో వాట్సాప్ ను బ్రెజిల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రవాణా ముఠా వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించారని, ఆ సమాచారం తమకు ఇవ్వాలని వాట్సాప్ పేరెంటింగ్ సంస్థ ఫేస్ బుక్‌ను బ్రెజిల్ పోలీసులు కోరారు. అయితే, వ్యక్తిగత సమాచారం ఇవ్వబోమని ఫేస్ బుక్, వాట్సాప్ స్పష్టం చేశాయి. నోటీసులు పంపించినా అందుకు వాట్సాప్ అంగీకరించలేదు. దీంతో వివాదం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మే నెలలో మూడుసార్లు వాట్సాప్‌ను పూర్తిగా నిలిపివేశారు కూడా. అయితే వాట్సాప్‌పై నిషేధం విధించడాన్ని తప్పుబట్టిన బ్రెజిల్ సుప్రీంకోర్టు వెంటనే నిషేధం ఎత్తివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ
రియోడిజనిరో: ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెజిల్ పోలీసులు ఆ సంస్థకు చెందిన దాదాపు 60లక్షల డాలర్లను ఫ్రీజ్ చేశారు. ఓ కేసుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు ఈ సంస్థ అనుబంధ సంస్థ అయిన వాట్సాప్‌కు నిరాకరించడంతో ఈ మేరకు నిధులను ఫ్రీజ్ చేశారు. ఓ అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా కేసుకు సంబంధించిన నేరస్తులు వాట్సాప్ ద్వారానే సంప్రదింపులు జరిపారని, ఆ వివరాలు తమకు తెలపాలని గత కొద్ది రోజులుగా వాట్సాప్ ను బ్రెజిల్ పోలీసులు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. నోటీసులు పంపించినా అందుకు వాట్సాప్ అంగీకరించలేదు. మే నెలలో మూడుసార్లు వాట్సాప్‌ను పూర్తిగా నిలిపివేశారు కూడా. పలుమార్లు తీవ్రంగా ప్రయత్నించిన పోలీసులు చివరకు విచారణలో భాగంగా ఫేస్ బుక్ కు చెందిన పెద్ద మొత్తం ఫండ్స్ ఫ్రీజ్ చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement