-
లండన్‌లో హైదరాబాద్ యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్ టర్మ్ అయిపోయింది.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పిన ఆ యువతి శాశ్వతంగా సెలవు తీసుకుంది. హైదరాబాద్ యువతి సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) లండన్‌లో దుర్మరణం చెందింది. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడం, మృతదేహం రావడానికి సమయం పడుతుండటంతో నగరంలోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు నగరంలోని ఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమార్తె తేజస్వి సైదాబాద్‌లో ఇంజనీరింగ్ (సీఎస్ఈ) పూర్తి చేశారు. లండన్‌లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్‌లో వెళ్లారు. ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న సహ విద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి బలగాలు గాలించి తేజస్వి మృతదేహాన్ని గుర్తించి ససెక్స్ కౌంటీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తేజస్వి బంధువులు మృతదేహం ఇక్కడకు తరలించడానికి సహకరించాలని కోరారు. బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. మృతదేహం శుక్రవారం నాటికి నగరానికి చేరుకుంటుందని ఆమె కుటుంబీకులకు సమాచారం అందింది. ‘‘చనిపోవడానికి ముందు రోజు తేజస్వి తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడింది. ఫస్ట్ టర్మ్ పూర్తయిన విషయం చెప్పింది. వీలుంటే వారం లేదా పది రోజులు సెలవు తీసుకుని రమ్మని వాళ్లు చెప్పారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలోపు ఇలా జరిగింది’’అని తేజస్వి బంధువులు తెలిపారు. చదవండి: ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత -
రాత్రి బీచ్‌లో స్నానం.. యువకుడు షాక్
సిడ్నీ: ఆస్ట్రేలియాలో రాత్రి పూట బీచ్‌లో స్నానానికి దిగిన ఓ యువకుడికి షాక్ ఎదురైంది. అరగంటపాటు సముద్రం ఒడ్డున స్నానం చేసి బయటకు వచ్చిన అతడి పాదాల నుంచి చీలమండలం నుంచి రక్తం కారడం ప్రారంభించింది. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా పరీక్షించి చికిత్స చేసిన వైద్యులకు కూడా అలా ఎందుకు జరిగిందో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. వైద్యులు, అక్కడి వారంతా కేవలం ఊహాగానాలు మాత్రమే చేశారే తప్ప ఏ ఒక్కరూ ఇదీ కారణం అని స్పష్టం చేయలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. శ్యామ్ కానిజే అనే 16 ఏళ్ల యువకుడు మెల్బోర్న్లోని బ్రిగ్టాన్ బీచ్‌లో రాత్రి ఆరుగంటల ప్రాంతంలో బీచ్‌లో స్నానానికి దిగాడు. అరగంటపాటు అందులోనే ఉండిపోయాడు. కాళ్లు మొత్తం కూడా మొద్దు బారినట్లు అనిపించడంతో బయటకు వచ్చి చూడగా రక్తం కారుతూ కనిపించింది. 'ఆ చల్లటి నీళ్లు నా కాళ్లు మొద్దుబారేలాగా చేశాయి. రక్తం చూసి బహుశా నా కాళ్లకు ఏవైనా మేకులో, నీడిల్ సూదులో గుచ్చుకున్నాయి అని అనుకున్నాను. తీక్షణగా చూస్తే అలా ఏం కనిపించలేదు' అని చెప్పాడు. అతడి రెండు కాళ్ల చీలమండలానికి వందల సంఖ్యలో అతి సూక్ష్మమైన రంధ్రాలు కనిపించాయి. అలా ఎందుకు జరిగిందో వైద్యులకు కూడా అర్థం కాలేదు. అయితే, నీటి పేలు అతడిని కుట్టి ఉంటాయని అంటున్నారు. అది కూడా జరిగి ఉండదని స్పష్టమైంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్‌హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement