-
ఈ చీపురు తింటే.. ఫన్నీ పోస్టుకు కేకపుట్టించే కామెంట్లు!
చిన్నప్పుడు అమ్మ వడ్డించే చీపురు దెబ్బల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా కష్టమే. పెళ్లయ్యాక భార్య చూపించే చీపురు ప్రతాపాన్ని తట్టుకుని నిలబడటం కూడా కష్టమే.(కొందరి విషయంలోనే..) ఏదిఏమైనా దెబ్బలు అనగానే ఎవరికైనా ముందుగా చీపురే గుర్తుకు వస్తుంది. నవ్వించే కార్టూన్లలోనూ చీపురు పట్టుకున్న ఆడవాళ్లు కనిపిస్తుంటారు. మొత్తంగా చూసుకుంటే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక చీపురు ఫొటో వైరల్‌గా మారింది. ఈ పోస్టు నెటిజనులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్టర్ పోస్టులో.. ఏదో గ్రోసరీ షాపు ముందు పెట్టిన చీపురుకట్ట కనిపిస్తోంది. దానిపై దానిని వినియోగిస్తే మన శరీరంలో బర్న్ అయ్యే కేలరీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్న వివరాల మాదిరిగానే ఈ చీపురుపైన కూడా పలు వివరాలు ఉన్నాయి. చీపురుపై ఉన్న ర్యాపర్‌పై కేలరీ 150 అని ఉంది. ఇంతేకాదు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ మొదలైన వివరాల ఉన్నాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్.. ‘ఇది చీపురు కేలరీ చార్ట్. మీరు దీనిని తినగలరేమో ప్రయత్నించండి’ అని రాశారు. మరో యూజర్ .. ‘ఎవరైనా దీనిని మూడు నిముషాల్లో తింటే 300 కేలరీలు బర్న్ అవుతాయి. అని రాశారు. ఇంకొక యూజర్..‘మహిళలకు కోపం వచ్చినప్పుడు దీనిని భర్త చేత తినిపించాలి’ అని రాశారు. ఇది కూడా చదవండి: పెళ్లి డబ్బులకు కిడ్నాప్ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు the broom has a calorie chart … in case you decide to snack on it! pic.twitter.com/II0N82b69k — JΛYΣƧΉ (@baldwhiner) August 2, 2023 -
అమ్మో! జీలకర్ర
రాయబరేలి : జీలకర్ర దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో ఉపయోగించే సాధారణ మసాలా (ఔషధ) దినుసు. కాదేదీ కల్తీకి అనర్హం అని రెచ్చిపోతున్న అక్రమార్కులు పెద్దమొత్తంలో నకిలీ జీలకర్రను సరఫరా తయారు చేస్తూ పోలీసులకు దొరికారు. ఉత్తర ప్రదేశ్, రాయ్ బరేలిలో ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. చిపురు పుల్ల ముక్కలు, ఎండుగడ్డి, మొలాసిస్ ఉపయోగించి తయారు చేసిన 30వేల కిలోల నకిలీ జీలకర్ర (జీరా)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని రూ. 60 లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు. మహారాజ్‌గంజ్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. చీపురు ముక్కలతోపాటు ఎండు గడ్డిని చీపుర్లలా తయారు చేస్తారు. అనంతరం వీటిని వేడి వేడి మొలాసిస్‌లో ముంచి ఎండ బెడతారు. ఎండిన తర్వాత, నిజమైన జీలకర్రలా కనిపించేలా ముక్కలుగా చేసి కల్తీ చేసి వివిధ నగరాలకు రవాణా చేస్తున్నారని తెలిపారు. 80, 20 నిష్పత్తిలో కల్తి చేశారన్నారు. తద్వారా ముఠా సభ్యులు 50 నుంచి 60 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించుకుంటారనితెలిపారు. గత ఏడాది కాలంతా ఈ ముఠా ఈ దందాను కొనసాగిస్తోందన్నారు. ఈ కేసులో ప్రశాంత్ సాడు, కమలేష్ మౌర్య, పంకజ్ వర్మ, ఇంద్రజీత్, పవన్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్, చోతేలాల్పై కేసు నమోదు చేశారు. పరారీలోఉన్న వీరిని అరెస్టు చేయడానికి రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. గత నెలలో ఢిల్లీ పోలీసులు దాదాపు ఇలాంటి భారీ రాకెట్టును ఛేదించిన సంగతి తెలిసిందే. సో.. నకిలీ ఏదో.. అసలు ఏదో నిర్ధారించుకోవాల్సిన పదార్థాల జాబితాలో జీలకర్ర కూడా చేరిందన్నమాట. ఇటీవల ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న నకిలీ జీలకర్ర తయారీ దృశ్యాలు -
‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’
ప్రముఖ నటి, ఎంపీ హేమామాలిని ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా చీపురు పట్టి పార్లమెంట్ పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే హేమా మాలిని చేసిన పనికి ప్రశంసలు లభించకపోగా.. విమర్శల పాలవుతోంది. తాజాగా ఇలా విమర్శించే వారి జాబితాలో హేమా మాలిని భర్త ధర్మేంద్ర డియోల్ కూడా చేరారు. హేమా మాలిని చేసిన పని తనకు కూడా అసహజంగా తోచిందన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ఇలా బదులిచ్చాడు. హేమా మాలిని నిజ జీవితంలో ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా అని ఓ అభిమాని ట్విటర్లో ధర్మేంద్రను ప్రశ్నించాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తను ఎన్నడు చీపురు పట్టి ఎరగదు’ అన్నాడు. హేమా మాలిని ఆలోచన మంచిదే.. అయితే దాన్ని అమలు చేయడంలో ఆమె విఫలం అయ్యారన్నారు ధర్మేంద్ర. ఆమె ప్రచారం చేయదల్చుకున్న శుభ్రత సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు ధర్మేంద్ర. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు ధర్మేంద్ర. Haan films main , mujhe bhi अनाड़ी लग रहीं थीं . मैं ने मगर बचपन में , अपनी माँ का हमेशा हाथ बटाया है । मैं झाड़ू में माहिर था । I love cleanliness 🍀🍀🍀🍀🍀🍀🍀🍀 — Dharmendra Deol (@aapkadharam) July 14, 2019 -
'స్వచ్ఛభారత్’లో సమంత
-
సమంత కూడా చీపురు పట్టింది!
అందాల తార సమంత చీపురు పట్టింది. చేతులకు గ్లోవ్స్ తొడుక్కుని కర్ర చీపురు, మామూలు చీపురు కూడా పట్టుకుని పలు ప్రాంతాలను శుభ్రం చేసింది. హీరో రామ్ స్వచ్ఛభారత్‌కు ఆమెను నామినేట్ చేయడంతో ఆ సవాలు స్వీకరించింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసింది. స్వయంగా సమంతే తమ స్కూలు వద్దకు వచ్చి చీపురు పట్టుకుని తుడుస్తుండటంతో విద్యార్థులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సమంత చెప్పింది. దాంతోపాటు, పారిశుధ్య కార్మికులను కలుసుకుని వాళ్లతో ఫొటోలు దిగింది. వాళ్లు ప్రతిరోజూ ఈ పని చేస్తుంటారని, కానీ అందుకు వాళ్లకు కేవలం నెలకు 5వేల రూపాయలు మాత్రమే లభిస్తుందని, అది సరికాదని చెప్పింది. అందువల్ల మీ చెత్తను మీరే శుభ్రం చేసుకోవాలని కూడా అందరికీ ట్విట్టర్ ద్వారా సలహా ఇచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో తనతో పాటు ఉంటూ సహకారం అందించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సమంతతో పాటు నీరజా కోన, మరికొంతమంది పాల్గొన్నారు. They do this everyday. So you think, so what they get paid. 5000rs.enough? No right. So clean your crap yourself!! pic.twitter.com/cvRsh5gSGt — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 15, 2014 #swachhbharath glad to be a part of the bigger picture. pic.twitter.com/YnQU2PW3O3 — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 15, 2014 "@sravi_sam: The besties @NeerajaKona and @Samanthaprabhu2 at the campaign #swachBharath! pic.twitter.com/XxXLrJGXOh" — Tarun (@tarun5848) November 15, 2014 Our @Samanthaprabhu2 doing her part for #SwachhBharath :) pic.twitter.com/ayC1JBvGQK — ?ai s?ava? (@sravan523) November 15, 2014
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement