-
వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే ఎక్కువ నీళ్లు తాగాలి. వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని పానీయాలను తీసుకోవాలి. ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం! ► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. ► పల్చటి మజ్జిగలో నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణసమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. సౌందర్య పోషణలో ►చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి. ► కాల్షియం, విటమిన్స్ , ఇతరపోషక విలువల కారణంగా మజ్జిక కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది. -
లోకేష్ యాత్ర లో మజ్జిగ ప్యాకెట్లు..ఎలా విసురుతున్నారో చూడండి
-
Health: వీళ్లు అస్సలు కాఫీ తాగకూడదు.. రోజూ మధ్యాహ్నం మజ్జిగ తాగితే!
డెయిలీ కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్–2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. అయితే కొందరు మాత్రం అస్సలు కాఫీ తాగకూడదు. వారు ఎవరు? కాఫీ ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం. వీరు కాఫీ తాగకూడదు ►గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ►ఒకవేళ తాగినా, 200 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ►అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ►అందువల్ల వీరు పాలిచ్చే రోజుల్లో కాఫీ మానటం ఉత్తమం. ►మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. ►కొంతమంది వ్యక్తులలో కాఫీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు కాఫీ తాగడం మానేయాలి లేదా తగ్గించాలి. మజ్జిగ వల్ల కలిగే ఈ ఆరోగ్య లాభాలు తెలుసా? ►రోజూ మధ్యాహ్నం భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ దరి చేరదు. ►మజ్జిగ ప్రోబయోటిక్. అంటే ఇది మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ►మజ్జిగలో చిటికడు జీలకర్ర లేదా వాము పొడి కలిపి తాగితే జీర్ణసమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీలు ఉండవు. ►మజ్జిగ లో ఉండే అనేక ప్రోటీన్లు, మినరల్స్ మనశరీరానికి రోజూ అవసరమైన అనేక విధులు నిర్వర్తించేందుకు దోహదపడతాయి. ►కాల్షియం లోపం ఉన్నవారు రోజూ మజ్జిగ తాగడం మంచిది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చదవండి: Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
Sakshi Cartoon: మజ్జిగ పాకెట్ తాగి సడెన్‌గా అలా వేడెక్కి పోయారేంటి సార్!
మజ్జిగ పాకెట్ తాగి సడెన్‌గా అలా వేడెక్కి పోయారేంటి సార్! -
చల్లగా వుండండి
వేసవి తన చండప్రతాపం చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. బయటకు వెళ్తే వడదెబ్బ, డీ–హైడ్రేషన్ సమస్యలు వెన్నాడే పరిస్థితి. ఆహారాల పరంగా అందరూ చలువ పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ద్రవాహారాలైతే మజ్జిగ, కొబ్బరినీళ్ల వంటివీ, పండ్ల విషయానికి వస్తే కీర, పుచ్చకాయలు, కర్బూజ వంటివి మామూలే. ఇలా అందరికీ తెలిసిన సాధారణ చలవచేసే పదార్థాలే కాకుండా... మనం రోజూ తీసుకునే వాటితో పాటు, మరికొన్ని ప్రత్యేక ఆహారాల గురించి తెలుసుకుందాం. అలాగే వేసవితాపాన్ని సమర్థంగా ఎదుర్కోడానికి పనికి వచ్చే ఘనాహారాలేమిటి, వేటితో ఎలాంటి ప్రయోజనాలుంటాయన్న సంగతులతో పాటు... కొన్ని ఆహారాలపై ఉండే అపోహలూ, వాస్తవాలతోపాటు అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. చల్లబరిచే ఆహార ధాన్యాలివే... వరి: వరిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువనీ, అందుకే తినగానే తక్షణం శక్తి సమకూరుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది చలవ చేసే ఆహారమేనని చెప్పవచ్చు. పైగా చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది. పొట్టుతీయని స్వాభావికమైన వరిలో విటమిన్–బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. స్వాభావికంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పాలిష్ చేయని వరి అన్నం, పోహా, ఇడ్లీ, దోస వంటివి ఈ వేసవిలో మనకు మేలు చేస్తాయి. బార్లీ: బాగా చలవ చేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బార్లీ చాలా ముఖ్యమైనది. దీన్ని వేసవి ధాన్యం (సమ్మర్ సిరేల్) అని చెప్పడం అతిశయోక్తి కాదు. బార్లీలో ఫాస్ఫరస్ చాలా ఎక్కువ. దాంతో పాటు క్యాల్షియమ్, ఐరన్ పాళ్లూ అధికంగానే ఉంటాయి. బార్లీ అనేది అల్సర్, డయాబెటిక్ రోగులకు అమృతం లాంటిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం ఇస్తుంది. బార్లీ గింజలను ఉడికించి సలాడ్‌గా తీసుకోవచ్చు. అలాగే దీని పిండితో పూరీలు, చపాతీలను చేసుకోవడమే కాకుండా అట్లుగా కూడా వేసుకోవచ్చు. బార్లీ జావ చలవ పానియంగా పనిచేస్తుంది. కొంతమంది దీన్ని నిమ్మకాయ నీటితో కలుపుకొని కూడా తాగుతుంటారు. ఎలా తీసుకున్నా ఈ వేసవిలో బార్లీ చాలా మంచి ఆహారం. తృణధాన్యాలు (చిరుధాన్యాలు) ఇటీవల చిరుధాన్యాల (మిల్లెట్స్) వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. ఆరోగ్య స్పృహ పెరగడంతో ఈమధ్య చాలామంది రాగులు, కొర్రలు, సజ్జలు, ఊదలు లాంటి చిరుధాన్యాలను చాలా మక్కువతో తమ ప్రధాన ఆహారంగానే తీసుకుంటున్నారు. కొంతమందిలో వీటిని వేసవిలో తీసుకోకూడదనే దురభిప్రాయం ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. పైగా వేసవిలో వీటిని తీసుకోవడం వేసవిని ఎదుర్కోవడంతో పాటు... ఇంకా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలామంది తృణధాన్యాలను ఇటీవల అన్నంలా వండుకుంటున్నారు కదా. దానికి బదులుగా వరి అన్నాన్ని గంజి కాచుకున్నట్లుగానే వేసవిలో వీటిని జావలాగా కాచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం... చలవకు చలవ. అయితే వీటిని అలా వండే ముందుగా క్రితం రాత్రి నానబెట్టుకోవడం మరవద్దు. ఇక్కడ పేర్కొన్న విధంగా సజ్జలతో చేయదగిన కొన్ని రకాల రెసిపీలలాగే మిగతా తృణ(చిరు)ధాన్యాలతోనూ దాదాపు అలాంటివే చేసుకోవచ్చు. ఉదాహరణకు సజ్జలను నీళ్లలో బాగా నానబెట్టి, లస్సీ తయారు చేసుకున్న తర్వాత వాటిని... ఆ పానీయంతో కలుపుకొని బాజ్రా లస్సీలా చేసుకోవచ్చు. ఇది వేసవిని ఎదుర్కొనేందుకు చాలా సమర్థమైన పానీయం. ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉండటంతోపాటు ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు పీచు పదార్థాలూ ఎక్కువే. పైగా తృణధాన్యాలన్నింటిలోనూ పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి అవి వేసవిలో సులభంగా జీర్ణమైపోయి ఒంటిని తేలిగ్గా ఉంచుతాయి. పప్పుదినుసులు (దాల్స్) పప్పుధాన్యాల్లో పెసర్లు, సాగో లాంటి పప్పులు ఒంటిని చల్లబరచడంలో కీలక భూమిక వహిస్తాయి. పెసర్లు/పెసలు: వీటిలో చాలారకాల ఖనిజలవణాలు ఎక్కువ. వేసవిలో మనం చెమట రూపంలో కోల్పోయే పోషకాలు ఖనిజ లవణాలే ప్రధానం. వాటిని భర్తీ చేయడానికి ద్రవాలతో పాటు వాటిని తీసుకుంటూ ఉండాలి. ద్రవాలతోపాటు ఖనిజలవణాలు తగ్గడాన్నే డీ–హైడ్రేషన్ అంటారు. వేసవిలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ. పెసర్లలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు... పెసలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. అందుకే వీటిని ఎన్నో రకాలైన రెసిపీలుగా చేసుకొని... వైవిధ్యమైన వంటకాలుగా తీసుకోవచ్చు. ఆకుపచ్చటి ఆకుకూరలు, కొన్ని కాయగూరలతో కలిపి, పైన కాస్తంత ఆలివ్‌నూనెను డ్రెస్సింగ్‌గా వేసుకొని సలాడ్‌గా తీసుకోవచ్చు. సలాడ్‌లో టొమాటోలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరప... లాంటి వాటితో కలిపి తీసుకుంటే అవన్నీ ఖనిజలవణాలనూ పుష్కలంగా సమకూర్చుతాయి. అంతేకాదు... ఇక్కడ సలాడ్‌లో పేర్కొన్న పదార్థాలన్నీ చలవచేసేవే. ఇక వంటకాల్లో పెసరట్టు అందరూ చాలా ఇష్టంగానూ, విస్తృతంగా తినే రూపం. పెసర్లతో ఉప్మా, కిచిడీ కూడా చేసుకోవచ్చు. నిజానికి కాస్తంత జావజావగా ఉప్మా, కిచిడీ లాంటి రెసిపీలను ఆయుర్వేదంలో స్నిగ్ధవంటకాలుగా చెబుతుంటారు. పెసర్లు కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. శనగలు: దేశంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించిపోయే చాలా వేడిప్రదేశాల్లో శనగలను ఒక ప్రధానాహారంగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఐరన్, మెగ్నీషియమ్, క్యాల్షియమ్ లాంటి లవణాలు చాలా ఎక్కువ. వీటిని చాట్ రూపంలో చాట్భండార్లలోనూ, కొన్ని చోట్ల ఇళ్లలోనూ చేసుకుంటూ ఉంటారు. ఇక టొమాటోలు, ఉల్లిముక్కలు, పచ్చిమిరపకాయలతో పాటు కొన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలతో కలిపి చెనా సలాడ్స్‌గా కూడా తింటుంటారు. శనగలు కూడా వేసవిలో చలవపదార్థంగా ఉపయోగపడ టంతో పాటు ఖనిజలవణాలను పుష్కలంగా ఒంటికి అందిస్తాయి. వేసవి కూరలు కాకరకాయ: కేవలం వంటకాలలో కూరగా ఉపయోగపడటంతో పాటు డయాబెటిస్ నివారణ, నియంత్రణలలో దీనికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. వేసవిలో ఒక మనిషి కోల్పోయే దాదాపు అన్ని రకాల ఖనిజలవణాలన్నీ కాకరకాయలోనే ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు. అందుకే దీన్ని అనేక రకాల వైద్యప్రక్రియల్లో ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు. కాకరకాయ కూరను వేసవిలో ఎక్కువగా వండుకోవడం చాలా మంచిది. చలవచేయడంతో పాటు ఇది సాధారణ వ్యాధినిరోధకతను పెంచి వేసవిలో వచ్చే చాలా రకాల జబ్బులను నివారిస్తుంది. చర్మం పేలడం, చర్మంపై పగుళ్లను నిరోధిస్తుంది. వేడిమికి ట్యాన్కావడాన్నించి కూడా కాకర మన ఒంటిని కాపాడుతుంది. గోరుచిక్కుడు: ఈ వేసవిలో తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు, ఒంట్లో అవసరమైన అన్ని ఖనిజలవణాలనూ భర్తీ చేస్తుంది. దీనిలో ఉన్న గ్లైకోన్యూట్రియెంట్స్ రక్తంలో చక్కెరపాళ్లను నియంత్రిస్తాయి. దాంతో గోరు చిక్కుళ్లు వేసవిలో డయాబెటిస్ రోగులకు మంచి రక్షణ ఇస్తాయి. ఇందులోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ ఎముకల్లోకి తేలిగ్గా ఇంకుతాయి. పైగా ఇందులో ఉన్న పొటాషియమ్, ఫోలేట్ పోషకాలు గుండెకు మేలు చేస్తాయి. ఇందులో పోటాషియమ్ పుష్కలంగా ఉన్నందున ఇవి రక్తపోటునూ (హైబీపీని) అదుపు చేస్తాయి. మెదడు ప్రశాంతంగా ఉంచగల అద్భుతమైన ఆహారం ఇది. వేసవిలో ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నందున సులువుగా జీర్ణమై, ఉక్కపోతతో కూడిన వాతావరణంలో శరీరం చాలా తేలిగ్గా ఉండేందుకు ఇవి ఉపకరిస్తాయి. తోటకూర (అమరాంత్ గ్రీన్స్) : వేసవిలో తోటకూర తినడం చాలా మంచిది. ఇందులోని ప్రోటీన్లు, ఫోలేట్ వంటి విటిమిన్లు, ఖనిజలవణాలు ఒంటిలోని మినరల్ రిసోర్సెస్‌ను భర్తీ చేయడంతో పాటు గుండెజబ్బులు, గుండెపోటు, పక్షవాతం, అనేక రకాల క్యాన్సర్లు, డయాబెటిస్‌ను నివారిస్తాయి. పుట్టగొడుగులు: పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వేగన్లకు పుట్టగొడుగులు మంచి ప్రోటీన్ వనరుగా చెప్పవచ్చు. ఇందులో నీటిపాళ్లు చాలా ఎక్కువ. పుట్టగొడుగుల్లో దాదాపు 92% నీళ్లే ఉంటాయి. కాబట్టి వేసవిలో అనేక రెసిపీలుగా వీటిని చేసుకొని తినడం అన్ని విధాలా మేలు చేస్తుంది. వేసవి... కొన్ని ఆహారాల పట్ల అపోహలు గుడ్లు: సాధారణంగా గుడ్లు వేడి చేస్తాయనే దురభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో దీన్ని వాడకాన్ని తగ్గిస్తారు. అయితే గుడ్లు వేడి చేస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజాలు లవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో పాటు ఒళ్లు కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. వేసవిలో గుడ్లను మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా పరిగణించవచ్చు. పాలు: చాలామందిలో వేసవిలో పాలను అంతగా తీసుకోకూడదనీ, పెరుగుగా తోడుపెట్టి... దాన్ని కూడా మజ్జిగగా మార్చే తీసుకోవాలని అంటుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ చాలామంచిదే. ఎండాకాలంలో దాని వాడకం కూడా ఎక్కువే. కానీ వేసవిలో పాలు కూడా మంచి ఆహారమే. నిజానికి పాలలో నీటిపాళ్లే చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు మనం కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే నీటినీ, ఖనిజలవణాలనూ ఏకకాలంలో భర్తీ చేయడమేనన్నమాట. అందుకే వేసవిలో ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగడం చాలా మేలు చేస్తుంది. సూప్‌లు అన్ని రకాల సూప్‌లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. మిగతా సూప్‌లలో ఉపయోగించే మిగతా ఆకుకూరలు, కాయగూరల్లోంచి సూప్‌లోకి లవణాలు పుష్కలంగా ఊరి, అవి తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్‌లు తీసుకోవడం మేలు చేస్తుంది. మొక్కజొన్న, దోసకాయ, టోమాటో, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ), గ్రీన్‌పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్‌లు తయారుచేసుకోవచ్చు. అవన్నీ వేసవిలో ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూర్చుతాయి. పిల్లలకు జావ రూపంలో ఈ వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. ఇలా జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. ఇలా జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. అయితే ఆర్గానిక్ మార్గంలో పండించిన పొట్టుతీయని వరినూక, గోధుమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకూ, వృద్ధులకూ ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. పానీయాలు... సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కాస్తంత పంచదారతో చేసుకునే పానీయం చాలా త్వరగా చేసుకోవచ్చు. పైగా చాలా చవగ్గా కూడా తయారవుతుంది. అలాగే దానికంటే కాస్త ఖరీదే అయినా బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్, ద్రాక్షపానియాలూ అందరికీ అందుబాటులో ఉండేవే. అయితే దీనితోపాటు వేసవిని సమర్థంగా ఎదుర్కొనే పానీయమే సారస్పరిల్లా. దీన్ని ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. సారస్పరిల్లా: ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలామంది చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, ఇంకొందరు నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్ తీసుకొని లేదా ఆ వేర్ల పౌడర్‌ను ఉపయోగించి, ఒక గ్లాసులో కాస్తంత ఎసెన్స్ తీసుకొని, అందులో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళ భరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు విరివిగా లభిస్తాయి కాబట్టి... ఆమ్‌పన్నా అనేది సీజనల్ డ్రింక్‌గా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవేగాక ఖస్ షర్బత్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్‌లు చాలా మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలపడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి చెరుకురసాన్ని ఎలాంటి ఇతర పదార్థాలతో కలపకుండా తాజాగా తీసుకోవడం చాలా మేలు. ఇక ఇవేగాక... పుచ్చకాయ – ఇందులో 80 శాతం కంటె అధికంగా నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. గ్రిల్డ్ వెజిటబుల్స్ – ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరలను ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేసవిలో ఎండలో తిరగటం వల్ల కలిగే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి. వెజిటబుల్ చీజ్ సలాడ్స్ – తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండే పానీయాలు – వేసవి రాగానే సాధారణంగా ... తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తుంటాం. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటివల్ల తాత్కాలికంగా దాహం నుంచి ఉపశమనం లభిస్తుందే కాని, అవి ఆకలిని తీర్చలేవు. అందువల్ల – మజ్జిగ, లస్సీ వంటివి తీసుకోవాలి. పండ్లతో తయారయిన డెజర్ట్స్ – చిక్కగా, మందంగా ఉండే డెజర్ట్స్‌ను వేసవిలో తీసుకోకపోవడమే మంచిది. వీటికి బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌ని తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న తాజా పండ్లతో కూడిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు తీసుకోవాలి. వేసవిలో లభించే ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. చల్లని కుకుంబర్ – దోస వంటివి సహజంగానే చల్లగా ఉంటాయి. తాజాగా ఉన్న చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలో వాడుకోవాలి. మామిడి – కేవలం వేసవిలో మాత్రమే లభిస్తాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వేడి చేస్తాయనే అభిప్రాయం ఉన్నా సీజనల్ ఫ్రూట్‌గా చాలా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)– ఇవి చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో ఈ చిన్న చిన్న పళ్లను తినటం మంచిది. అంతేకాక వీటిని పెరుగులోనూ, ఐస్‌క్రీంలాంటి వాటిలోను వాడవచ్చు. పనీర్ – ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువ. వాల్నట్స్ – వేసవిలో తీసుకునే ఆహారంలో కొద్దిగా ఆక్రోట్లు (వాల్నట్) , చేపలు తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు మంచిది. ఓట్లు – ఇందులో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకోవటం మంచిది. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు – దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. పెద్దలకు ►బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం ఈ కాలంలో మంచిది కాదు. ►తాజాపండ్లు, కూరలు తీసుకోవాలి. తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. ►మజ్జిగను ఎక్కువగా తాగుతుండాలి. ►తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది. ►క్యారట్లు, బీట్రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది. ఈ కాలంలో దొరికే తాజాగా ఉండే ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది. ►మధ్యాహ్నం, రాత్రివేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి. ►ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. పీచుపదార్థాలు (ఫైబర్) పేగు సంబంధిత సమస్యలు వయసుపెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్ధకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. వీటిని తీసుకోవటం మంచిది... ►పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్లు ►హోల్గ్రెయిన్తో చేసిన బ్రెడ్ ►గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్ ►బీన్స్ లేదా ఆ జాతికి చెందిన గింజలు తీసుకోకూడని ఆహారాలు ►వేసవిలో ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది డీహైడ్రేషన్‌ను కలిగిస్తుంది. దాహాన్ని పెంచుతుంది. ►ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ ఉపయోగాల్సి కూడా వీలైనంతగా తగ్గించాలి. ►కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. అందుకే అవి డీహైడ్రేషన్ కలిగిస్తాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. ►రెడ్‌మీట్ వంటి మాంసాహారం నుంచి దూరంగా ఉండటం ఈ సీజన్లోనే కాదు... ఏ సీజన్లో అయినా మంచిదే. ►ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. ►చక్కెర ఎక్కువగా ఉండే అన్ని రకాల పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. పిల్లలకు... ►వేసవిలో పిల్లలు ఇంట్లో గడుపుతుంటారు. ప్రయాణాలు చేస్తుంటారు. లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉంటారు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటిశాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి. ►పాల ఉత్పత్తులు – లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. అయితే ఇందులో చక్కర పరిమితంగానే వాడాలి. ►తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి. ►పిజ్జాలు, శాండ్విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు. ►గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. ►ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. వృద్ధులకు ►వయసు మీద పడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సమతుల ఆహారం తీసుకుంటే మాత్రం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమయిన బరువుతో ఉండటానికి క్రమపద్ధతిలో తీసుకునే ఆహారం మంచిది. అందుకే వీరు తీసుకునే ఆహారంలో. ►గంజిలాంటి కార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు . ►ప్రొటీన్లు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పు. ►ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు. ►తగినంత ఉప్పు (వృద్ధులు రోజుకి ఆరుగ్రాముల ఉప్పు కంటె ఎక్కువ తీసుకోకూడదు). ►ఈ సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువ కాబట్టి లవణాలను భర్తీ చేసేలా పొటాషియమ్, సోడియమ్ ఎక్కువగా ఉండే అన్ని రకాల పండ్లు తీసుకోవాలి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ , యశోద హాస్పిటల్స్,మలక్‌పేట, హైదరాబాద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పుతిన్ ఐదోసారి ప్రమాణం
బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్
శిక్షణలోనే సందేహాలు నివృత్తి చేసుకోవాలి
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఎస్సీ వర్గీకరణ మోదీకే సాధ్యం
మీ బిడ్డను ఎంపీగా ఆదరించండి
అభివృద్ధిని అడ్డుకునే బీజేపీని ఓడించండి
ఇంటర్ ఫెయిల్ అయ్యామని..
‘దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ’
వాహన తనిఖీలు ముమ్మరం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement