-
తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు: స్టార్ హీరోయిన్
సాధారణంగా హీరోయిన్ అనగానే తెల్లగా ఉండాలి, లేకపోతే సినిమా అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆ హీరోయినే బయటపెట్టింది. అసలు అప్పట్లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ.. ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో పాటే ఎవరికీ తెలియని బోలెడన్నీ సంగతల్ని పంచుకుంది. (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!) 'మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని. అయినాసరే రన్నరప్‌గా నిలిచాను. ఇది నేను గర్వపడే విషయమే. 15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. చాలా స్ట్రగుల్స్ చూశాను. దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి. దీంతో నా టీనేజీ అంతా చాలా కష్టంగా గడిచింది. మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ప్రతినెలా పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా రక్తం పోయేది' 'నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్స్, ర్యాంప్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు. అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు. చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అదే అందరిలో నన్ను స్పెషల్‌గా మార్చింది' 'అందం అనేది శక్తివంతమైన ఆయుధం. నా దేశం తరఫున ఓ యాక్టర్, అంబాసిడర్‌గా పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను' అని నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈమె.. తెలుగులో మంచు విష్ణు 'సూర్యం' మూవీ మాత్రమే చేసింది. ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాలేదో, వద్దనుకుందో గానీ పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. View this post on Instagram A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) (ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రేజీ హారర్ మూవీ.. నెలలోపే స్ట్రీమింగ్కు రెడీ) -
'ఫేమస్ నైట్ గర్ల్.. చేసినవన్నీ అడల్ట్ సినిమాలే, డైరెక్టర్ ఎదుటే..'
ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు రోజుకో బ్రేకింగ్ న్యూస్ వదులుతాడు. ఆ హీరోకు పెళ్లైనా అఫైర్లు ఉన్నాయని, ఈ హీరోయిన్ కాల్ గర్ల్ అని, వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారని, ఛాన్సులకోసం సదరు నటి చాలామందితో బెడ్ షేర్ చేసుకుందని, కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్, మందు తీసుకున్నారని ఇలా రోజుకో పుకారు సృష్టిస్తుంటాడు. కొందరు దీన్నీ చూసీచూడనట్లు వదిలేస్తారు. మరికొందరేమో అతడు అనే మాటలను తట్టుకోలేక రియాక్ట్ అవుతారు. తాజాగా అదే పని చేసింది బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ. 'సెలీనా.. తండ్రీకొడుకులైన ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌లతో శారీరకంగా చాలాసార్లు కలిశారు' అని ట్వీట్ చేశాడు ఉమైర్. దీనిపై మండిపడ్డ నటి.. 'మీకు ఏదో సమస్య ఉందనుకుంటా.. ముందు డాక్టర్ దగ్గరకు వెళ్లండి. ఇలాంటివారిపై ట్విటర్ చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్ చేసింది. తనపైనే ఎదురుదాడి చేయడంతో ఉడుక్కున్న ఉమైర్.. నటి గురించి అసభ్యంగా మాట్లాడుతూ వరుస ట్వీట్లు చేశాడు. 'నోర్మూయ్.. నువ్వొక సీ గ్రేట్ నటివి. అన్నీ సాఫ్ట్ పోర్న్ సినిమాలే చేశావు. తర్వాత బాగా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయావు. స్వార్థపరురాలా. ట్విటర్.. ఈ సైకో నన్ను వేధిస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోండి. అయినా 2003లో జనాషీన్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ముందు ఒంటి మీద బట్టలు లేకుండా నిలబడలేదా? సమాధానం చెప్పు.. పైగా నాకు ఏదో రోగం ఉందంటున్నావ్. నువ్వు నాతో బెడ్ షేర్ చేసుకున్నావ్ కదా అప్పుడే ఆ సమస్య వచ్చింది. 2006, 2007 సంవత్సరాల్లో ముంబైలో నువ్వొక ఫేమస్ నైట్ గర్ల్‌వి. సీ గ్రేడ్ భోజ్‌పురి నటివైన నీకు నా ట్వీట్‌తో పబ్లిసిటీ వచ్చింది. అందుకు నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పాలి' అని పేర్కొన్నాడు. వీరి మధ్య జరిగిన వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రిటిక్ ఉమైర్ సంధు She slept with me in Austria 🇦🇹 that’s why she knows I’ve erectile dysfunction 😛 ! Btw you were famous “ Night Girl ” in Mumbai in 2006 & 2007. Thanks to me , you got publicity from my tweet. C Grade Bhojpuri Actress 😄😘 https://t.co/gZg1usZzTa — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 Oh Just Shutup ! You were a C Grade Actress. Look at your Filmography. You always did Soft Porn Films. Ok ! Married with a Rich guy & then settled down ! Selfish woman. @TwitterSafety this psychopath is harassing me. Take notice. https://t.co/gZg1usZzTa — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 Sach Kafi Zaiyda Karwa Lag gaya !! Bataon sub ko ! You were naked infront of Director Feroze Khan in his office during Janasheen auditions in 2003. https://t.co/gZg1usZ23C — Umair Sandhu (@UmairSandu) April 11, 2023 -
మిస్టర్ సంధు.. వెంటనే డాక్టర్‌ను కలవండి.. గట్టిగా ఇచ్చిపడేసిన నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్ నటించిన జనషీన్ చిత్రంతో సెలీనా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా నటీనటులపై అదేపనిగా విమర్శలు చేస్తూ ఉండే సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నీ సమస్య త్వరలోనే నయమవుతుందని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారామె. కాగా.. ఉమైర్ సంధు ట్వీట్ చేస్తూ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ నటులైన తండ్రీ, కుమారులు ఫిరోజ్ ఖాన్, ఫర్దీన్ ఖాన్‌తో శారీరకంగా చాలాసార్లు కలిశారంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి ఘాటూగా స్పందించింది. సెలీనా ట్వీట్లో రాస్తూ.. 'మిస్టర్ సంధు.. ఈ పోస్ట్ చేయడం వల్ల మీరు మనిషిగా మారడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నా. అలాగే మీ లైంగిక పటుత్వ సమస్య నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటున్నా. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. వెంటనే వైద్యుని వద్దకు వెళ్లండి. ఇలాంటి వారిపై దయచేసి ట్విటర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దివంగత నటుడు ఫిరోజ్ ఖాన్ సెలీనా జైట్లీని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనషీన్ చిత్రీకరణ సమయంలో ఫిరోజ్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు తనను యువరాణిలా భావించారని నటి పేర్కొంది. ఈ చిత్రానికి ఫిరోజ్ ఖాన్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. సెలీనా నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కూడా కనిపించింది. Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da — Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023 -
ముగ్గురు పిల్లలున్న నటికి పెళ్లి ప్రపోజల్.. ఇల్లరికమైనా ఓకే అంటూ..
హీరోయిన్ల అందచందాలను చూసి మంత్రముగ్ధులవుతుంటారు అబ్బాయిలు. వారి ఫోటోలను వాల్పేపర్లుగా పెట్టుకుని మురిసిపోయేవారు కొందరైతే సెల్ఫీలు దిగి షేర్లు చేసేవారు మరికొందరు. అయితే కొద్దిమంది మాత్రం సదరు హీరోయిన్ను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో అని పట్టపగలే కలలు కంటూ ఊహల్లో తేలిపోతుంటారు. తాజాగా ఓ నెటిజన్ కూడా అదే ఊహలో మునిగిపోయాడు. బాలీవుడ్ నటి, మోడల్ సెలీనా జైట్లీ తనకు భార్య అయితే ఎంత బాగుంటుందోనని కలలు కన్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు ప్రపోజ్ చేశాడు. 'సెలీనా జైట్లీ.. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. నా ఆరోగ్యం మరింత దిగజారకముందే నీతో నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకో. నీతో జీవితం పంచుకోవడానికి ఇల్లరికం రావడానికి కూడా నేను సిద్ధమే! నా ప్రపోజల్‌కు స్పందిస్తావని ఎదురుచూస్తున్నాను. ఇట్లు కోల్‌కతా నుంచి విజయ్ మగన్‌లాల్ వోరా' అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన సెలీనా వెరైటీగా రిప్లై ఇచ్చింది. 'నా భర్తను, ముగ్గురు పిల్లలను అడిగాక వస్తాను' అంటూ తెలివిగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిస్ యూనివర్స్ 2003 రన్నరప్‌గా నిలిచిన సెలీనా జైట్లీ ఆస్ట్రేలియాకు చెందిన ఎంటర్ప్రెన్యూర్ పీటర్‌ను పెళ్లాడింది. వీరికి 11 ఏళ్ల కవలలు విన్స్టన్, విరాజ్‌తో పాటు ఐదేళ్ల ఆర్థూర్ సంతానం. ఇకపోతే మోడల్‌గా సత్తా చాటిన సెలీనా 2003లో 'జనాషీన్' సినిమాతో వెండితెరపై తన లక్ పరీక్షించుకుంది. నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ సినిమాల్లో మెరిసింది. I will ask my husband and three kids and revert ! https://t.co/jIEXG8pEVD — Celina Jaitly (@CelinaJaitly) April 6, 2023 -
మీరు కూడా అడుక్కుంటున్నారా?.. హీరోయిన్‌పై నెటిజన్ సెటైర్లు
ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని ఎగతాళి చేసిన ఓ నెటిజన్‌పై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మండిపడ్డారు. ఇటీవల ఆమె ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి మద్దతుగా ఓ వీడియోనూ రిలీజ్ చేసింది. ట్రాన్స్‌జెండర్స్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆమె ట్వీట్లో జత చేశారు. ఇది చూసిన ఓ నెటిజన్ స్పందించారు. 'ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇలాంటి వారే అడుక్కుంటారు' సెలీనా ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన సెలీనా జైట్లీ నెటిజన్‌పై ఘూటుగా స్పందించింది. 'అసలు అందులో తమాషా ఏముంది సార్ ???? ఎవరైనా లింగమార్పిడి చేసుకుని మరీ అడుక్కునే స్థాయికి దిగజారడం చూస్తే గుండె పగిలేలా లేదు ??? మీలాంటి వారే ట్రాన్స్ విజిబిలిటీ మేటర్స్ కావడానికి కారణం. " అంటూ ట్వీట్ చేసింది. మరో ట్వీట్లో నెటిజన్ రాస్తూ..'వారు ఎలా అడుక్కుంటారో మీరు చూశారా? వారు అడుక్కోరు. పబ్లిక్‌లో తప్పుగా ప్రవర్తిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఈ ప్రత్యేకమైన జెండర్ గల వ్యక్తులు చేసే పనిని మరొకరు చేస్తే మీకు ఓకేనా? ఆర్ యూ బెగ్గింగ్? బహుశా ఇది నీ పెంపకం వల్ల కావచ్చు.' అంటూ రిప్లై ఇచ్చాడు. మార్చి 31న అంతర్జాతీయ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ సందర్భంగా,సెలీనా వారికి మద్దతును తెలియజేస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. "ప్రపంచంలోని ధైర్యవంతులైన కొంతమంది లింగమార్పిడి వ్యక్తులు. వారిపై జరిగే అన్ని వివక్ష, హింసకు వ్యతిరేకంగా నేను పోరాడతా. మన ప్రపంచానికి వారి సహకారాన్ని అభినందిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. Have you seen how they beg? They don't beg. They misbehave in public. And would you be ok if man did what these "special" gender people do at Traffic signals 🚦 under the pretext of begging? Maybe you would because of your poor upbringing 😎 I pity your parents 😊 https://t.co/rOfrg7PFHY — Naam Kya Hay (@NaamKyaHay) April 1, 2023 దీనికి సెలీనా జైట్లీ స్పందిస్తూ.. 'నా పెంపకం గురించి నువ్వు అస్సలు చింతించకు. నేను 4 తరాల భారత సాయుధ బలగాల కుటుంబంలో పెరిగాను.ట్రాన్స్ కమ్యూనిటీ ఇప్పటికీ మన దేశంలో చాలా వెనుకబడి ఉంది. వారి పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మీలాంటి వ్యక్తులే వారి బహిష్కరణకు, దుస్థితికి బాధ్యులు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. సెలీనా జైట్లీ మిస్ యూనివర్స్-2003లో రన్నరప్‌గా నిలిచింది. జనాషీన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నో ఎంట్రీ, అప్నా సప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమె గత రెండు దశాబ్దాలుగా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీతో కార్యకర్తగా పని చేస్తున్నారు. I'm reminded of this gender only at Traffic signals 🚦🤣 — Naam Kya Hay (@NaamKyaHay) March 31, 2023
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్‌కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement