-
అండర్–14 చాంప్స్ అర్జున్, జిషిత
సాక్షి, హైదరాబాద్: ముంబై ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జిషిత ఆకట్టుకున్నారు. అండర్–14 ఓపెన్ విభాగంలో అర్జున్... అండర్–14 బాలికల విభాగంలో జిషిత అగ్రస్థానాన్ని సంపాదించారు. ముంబైలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అర్జున్ తొమ్మిది రౌండ్లకుగాను 6.5 పాయింట్లు సంపాదించి ఓవరాల్‌గా 16వ స్థానంలో... తన విభాగంలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అర్జున్ అజేయంగా నిలిచాడు. జిషిత 5.5 పాయింట్లు సంపాదించింది. ఆమె ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు గేముల్లో ఓడిపోయింది. అండర్–14 ఓపెన్ విభాగంలో హైదరాబాద్‌కే చెం దిన రాజా రిత్విక్ 6 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–20 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష ఆరు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. -
ఓవరాల్ చాంపియన్ చిలకలూరిపేట
గుంటూరు స్పోర్ట్స్ఖేలో ఇండియా జిల్లా స్థాయి పోటీల్లో చిలకలూరిపేటకు చెందిన అథ్లెటిక్స్ బాలికల జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించింది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా జిల్లా స్థాయి క్రీడాపోటీలను గురువారం స్థానిక బ్రహ్మనందరెడ్డి స్టేడియంలో ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రారంభించారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాలలో జరిగిన పోటీలలో 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చి రాష్ట్ర జట్టుకు ఎంపికవ్వాలని క్రీడాకారులకు సూచించారు. డీఎస్డీవో బీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఆర్ స్టేడియంలో ఈనెల 3వ తేదీన బాక్సింగ్, ఖోఖో, 5వ తేదీన కబడ్డీ, హాకీ జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. 7వ తేదీన నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఫుట్‌బాల్, వాలీబాల్, తైక్వాండో పోటీలు జరుగుతాయన్నారు. విజేతలు వీరే.. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల జాబితాను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసరావు ప్రకటించారు. అండర్–14 బాలుర అథ్లెటిక్స్ విభాగంలో వంద మీటర్ల పరుగులో ధన్‌రాజ్ (బాపట్ల), కె.ఉమేష్ (గుంటూరు తూర్పు) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 400మీటర్ల పరుగులో బి.పవన్‌కుమార్(చిలకలూరిపేట), సి.హెచ్.గోపి (వినుకొండ), లాంగ్‌జంప్‌లో కె.గోపివర్మ (బాపట్ల), బి.రాము (రేపల్లె), షాట్‌పుట్‌లో పృథ్విరాజ్ (వేమూరు), సైదు మస్తాన్‌వలి(వినుకొండ), బాలికల విభాగంలో వంద మీటర్ల పరుగులో కె.సీతమ్మ (పొన్నూరు), ఆర్.అంజలి (మాచర్ల), 400 మీటర్ల పరుగులో బీబీ ఫాతిమా (గుంటూరు తూర్పు), ఎ.నిఖిత (రేపల్లె), లాంగ్‌జంప్‌లో డి.శ్రావణి (గుంటూరు పశ్చిమ), ఎ.సాయిదుర్గ (బాపట్ల), షాట్‌పుట్‌లో బి.మానస (గుంటూరు పశ్చిమ), ఎల్.పూజ (వేమూరు), అండర్–17 బాలుర విభాగంలో వంద మీటర్ల పరుగులో జి.హర్షవర్ధన్ (గుంటూరు తూర్పు), ఆర్.సాంబిరెడ్డి (సత్తెనపల్లి), 400 మీటర్ల పరుగులో బి.శ్యామేల్ (బాపట్ల), షేక్ రసూల్ (నరసరావుపేట), లాంగ్‌జంప్‌లో ఎ.కోటేశ్వరరావు (గుంటూరు తూర్పు), జె.రమేష్ (గుంటూరు తూర్పు), ఎ.సాంబిరెడ్డి (చిలకలూరిపేట), వీరాంజనేయులు (వినుకొండ), బాలికల విభాగంలో వంద మీటర్ల పరుగులో బి.జ్యోతి (చిలకలూరిపేట), బి.రాజ్యలక్ష్మి (వేమూరు), 400 మీటర్ల పరుగులో జె.రాణి (ప్రత్తిపాడు), డి.లహరి (రేపల్లె), లాంగ్‌జంప్‌లో ఎన్.సౌజన్య (చిలకలూరిపేట), కె.సుప్రియ (వినుకొండ), షాట్‌పుట్ విభాగంలో కె.శాంతకుమారి (నరసరావుపేట), ఎం.నాగభార్గవి (పొన్నూరు) వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఎమ్మెల్సీ రామకృష్ణ ట్రోఫీ అందజేశారు.కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement