-
'ఆమెకు కేసులు పెట్టడం అలవాటు'
విజయవాడ: విజయవాడ టీడీపీ కార్పొరేటర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళ పక్కదారి పట్టే వ్యక్తి అని ఆ పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్పొరేటర్‌పై కేసు పెట్టిన మహిళ ‘పర్వర్టెడ్ ఫెమినిస్టు’ అని వ్యాఖ్యానించారు. ఆవిడకు కేసులు పెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. ఢిల్లీ రెస్టారెంట్లో కాలు తగిలిందని 70 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచార కేసు పెట్టిన చరిత్ర ఆమెకు ఉందని చెప్పారు. 55 ఏళ్ల మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారనడం నమ్మశక్యంగా లేదన్నారు. దీన్ని పట్టుకుని మహిళా సంఘాలు దుమ్మెత్తిపోయడం దారుణమని అన్నారు. -
కార్పొరేటర్ చంటిబాబుకు నోటీసులు
హైదరాబాద్: విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విజయవాడ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు నోటీసులు ఇవ్వనున్నట్లు శంషాబాద్ డీసీపీ తెలిపారు. ఈ కేసుపై ఆయన వివరణ కోరుతున్నట్లు డీసీపీ చెప్పారు. ఎయిరిండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చంటిబాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
'టీడీపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి'
► టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ధర్నా ► విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్ ► మేయర్ కారును అడ్డుకున్న మహిళా సంఘాలు ► అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం, అరెస్ట్ ► సొమ్మసిల్లి పడిపోయిన పలువురు మహిళలు విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు వ్యతిరేకంగా శనివారం మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. విమానంలో మహిళ పట్ల అసభ్యంగా కార్పొరేటర్ చంటిబాబు ప్రవర్తించడంతో మహిళా సంఘాలు ప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. మేయర్ కారును మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. తక్షణమే కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చంటిబాబుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
సీఎం ఉన్నారన్న ధీమాతోనే ఈ అరాచకాలు
విజయవాడ: విమానంలో ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విజయవాడ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుకు ఆ పార్టీ కార్పొరేటర్లు మద్దతుగా నిలవడం వివాదాస్పదంగా మారింది. వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్‌మీట్ పెట్టడం పట్ల మహిళా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో మహిళలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని, కార్పొరేటర్ల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అధికారముందని టీడీపీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, ఏంచేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారనే ధీమాతో అరాచకాలకు పాల్పడుతున్నారని మహిళలు విమర్శించారు. ప్రజల సొమ్ముతో టీడీపీ కార్పొరేటర్లు విహారయాత్రలకు వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మద్యంమత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన చర్యను సమర్థిస్తూ టీడీపీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టారు. మహిళలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శించారు. -
అసభ్య ప్రవర్తనతో టీడీపీ కార్పొరేటర్ పై కేసు నమోదు
విజయవాడ :విమానంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... విజ్ఞాన యాత్రకు వెళ్లిన టీడీపీ కార్పొరేటర్ చంటిబాబు విమానంలో చేసిన పోకిరీ చేష్టలు వివాదాస్పదమయ్యాయి. ఓ మహిళ ఫిర్యాదు మేరకు గన్నవరం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ భీముడు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు అరగంట సేపు విచారణ నిర్వహించారు. ఈ విషయాన్ని తోటి కార్పొరేటర్లు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్లు సమాచారం. గత నెల 29న విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం ఢిల్లీ నుంచి శుక్రవారం తిరుగు ప్రయాణం కట్టారు. కొందరు టీడీపీ కార్పొరేటర్లు విమానం, మరికొందరు రైల్లో బయలుదేరారు. అయితే చంటిబాబు విమానంలో పక్క సీట్లో ఓ మహిళ ఉన్నారు. తనతో చంటిబాబు అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గన్నవరం సెక్యూరిటీ వింగ్ రంగంలోకి దిగింది. విమానం గన్నవరం చేరుకోగానే సదరు కార్పొరేటర్‌ను సెక్యూరిటీ అధికారులు చుట్టుముట్టారు. అనూహ్య పరిణామంతో టీడీపీ కార్పొరేటర్లు కంగుతిన్నారు. అందరూ కలిసి ఉంటే బుక్కైపోతామని భావించారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావును చంటిబాబు వద్ద ఉంచి మిగితా వారంతా బయటకు వచ్చేశారు. అనంతరం ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి చంటిబాబును అక్కడ నుంచి తప్పించారు. గతనెల 30వ తేదీన పూణే లో ఓ కార్పొరేటర్ ట్రయిన్లో మద్యం సేవించి మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. కార్పొరేటర్ల ఆగడాలతో తలలు పట్టుకున్న టీడీపీ నాయకులు కనీసం ఖండన ఇచ్చే ధైర్యం చేయలేదు. ఈ వివాదం సద్దుమణగక ముందే మరో కార్పొరేటర్ విమానంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి చిక్కుల్లో పడ్డాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే చంటిబాబును వదిలేశారని గన్నవరం పోలీసులపై విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కావటం వల్లే అతడిని వదిలేసినట్లు తెలుస్తోంది. మహిళలతో టీడీపీ కార్పొరేటర్ల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్‌పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement