-
ఎక్కడి వారు అక్కడే.. గప్ చుప్!
రాజన్న సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే తనిఖీలు.. సోదాలతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాల నుంచి డబ్బు, మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ జిల్లాకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ నిరంతరం ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఆన్లైన్.. ఆఫ్‌లైన్ నిఘా..! జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియాతోపాటు ప్రత్యక్షంగా నిఘా పటిష్టం చేశారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పరిశీలిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీస్‌శాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, గంభీరావుపేట మండలం పెద్దమ్మ, ముస్తాబాద్ మండలం బదనకల్, వేములవాడ మండలం ఫాజుల్‌నగర్, బోయినపల్లి మండలం నర్సింగాపూర్ చెక్‌పోస్టుల్లో 30 మంది రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వాట్సాప్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో మెస్సేజ్‌లపై నిరంతర నిఘా పెట్టారు. గ్రూప్ అడ్మిన్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ప్రత్యేక బృందాలు.. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగకుండా పోలీస్, రెవెన్యూశాఖల అధికారులతో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. ఎలక్షన్ నిర్వహణ ప కడ్బందీగా సాగడానికి ఎన్నికల నియమావళి అమలుకు కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్‌తోపాటు టోల్‌ఫ్రీ నంబర్ 1950 ఏర్పాటు చేశారు. ఎన్జీఆర్ఎస్, సీ విజిల్ యాప్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించేలా ఆదేశాలిచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిస్టిక్ సర్వేలైన్స్, వీడియో సర్వేలైన్స్ మూడు చొప్పున పద్దెనిమిది బృందాలు పని చేస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. సోదాలు.. దాడులు! ► జిల్లాలోని అన్ని బెల్టు షాపుల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు పోలీసులుసోదాలు చేస్తూ మద్యం సీజ్ చేస్తున్నారు. ► ఐదు చెక్‌పోస్టుల్లో రెండు షిఫ్టుల్లో సిబ్బంది జిల్లాకు వచ్చిపోయే వాహనాలు అన్నింటిని చెక్ చేస్తున్నారు. ► రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లడానికి ఆస్కారం లేదు కాబట్టి నగదు రవా ణాపై ప్రత్యేక దృష్టి సారించారు. ► ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో పొలిటికల్ లీడర్స్ ఫొటోలు, ప్రకటలు లేకుండా చూస్తున్నారు. ► జిల్లా నలుమూలల్లో ప్రత్యేక బలగాలు, అధికారులు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారు. -
చెక్‌పోస్టులో ఆధునిక కెమెరాల ఏర్పాటు
బీవీపాళెం(తడ) : బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. గతంలో ఏర్పాటుచేసిన కెమెరాల స్థానంలో మూడు కొత్త కెమెరాలను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలకు సంబంధించిన నంబర్లను క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. రాత్రి వేళల్లోనూ అవి బాగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement