-
మళ్లీ వారిదే రంజీ టైటిల్
నాగ్‌పూర్: రంజీట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విదర్భ టైటిల్‌ను నిలబెట్టుకుంది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ 78 పరుగుల తేడాతో విజయం సాధించి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విదర్భ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దాంతో టైటిల్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయింది. విదర్భ బౌలర్లలో స్పిన్నర్ ఆదిత్య సర్వతే ఆరు వికెట్లతో సౌరాష్ట పతనాన్నిశాసించాడు. అతనికి జతగా అక్షయ్ వాఖరే మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ వికెట్ తీశాడు. సౌరాష్ట్ర ఆటగాళ్లలో విశ్వరాజ్ జడేజా(52) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడింది. నలుగురు మాత్రమే నాలుగు అంకెల స్కోరును దాటడంతో సౌరాష్ట్రకు పరాజయం తప్పలేదు. అంతకుముందు విదర్భ తన రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. దాంతో విదర్భకు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఐదు పరుగుల ఆధిక్యంతో 205 పరుగుల్ని బోర్డుపై ఉంచింది. ఆదిత్య సర్వతే (49), గణేశ్ సతీష్(35), మోహిత్ కాలే(38)లు క్లిష్ట దశలో మెరిసి జట్టు స్కోరును రెండొందలకు చేర్చారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 58/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర మరో 69 పరుగులు చేసి మిగతా వికెట్లను చేజార్చుకోవడంతో సౌరాష్ట ఓటమి పాలైంది. -
కౌంటీల్లో పుజారా జోరు
సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మన్ ట్రెంట్‌బ్రిడ్జ్: ఒకవైపు భారత వన్డే జట్టు చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో ఇంగ్లండ్‌లో బిజీగా ఉంటే... ఈ జట్టులో స్థానం లేని మరో భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా ఆ దేశంలోనే ఇంకో చోట తన బ్యాట్ పదును చూపించాడు. కౌంటీ క్రికెట్లో భాగంగా నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతున్న పుజారా, తన రెండో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. గ్లూసెస్టర్‌షైర్‌తో శుక్రవారం ప్రారంభమైన ఈ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో పుజారా (206 బంతుల్లో 112; 14 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు మైకేల్ లంబ్ (117) కూడా సెంచరీ బాదడంతో తొలి రోజు నాటింగ్‌హామ్ 96 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గత వారం గ్లామోర్గాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పుజారా విఫలమయ్యాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement