-
పసికందును ఎత్తుకెళ్లిన తండ్రి
సాక్షి. జగిత్యాల(కరీంనగర్): మూడు రోజుల చంటిపాప ఆస్పత్రిలో తల్లి ఒడిలో ఉండగా మద్యం మత్తులో ఉన్న తండ్రి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. దీంతో తల్లితో పాటు ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణ పోలీసుల కథనం మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన చిదిరె ప్రశాంత్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నిజామాబాద్‌పల్లెకు చెందిన సర్వేశ్వరితో వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సర్వేశ్వరి కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. ప్రసవం నిమిత్తం ఈ నెల 20న జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చేరగా, ఆడబిడ్డ జన్మించింది. విషయం తెలుసుకున్న ప్రశాంత్ సోమవారం జగిత్యాలకు వచ్చి ఆస్పత్రిలో ఉన్న భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం పసికందును ఎత్తుకొని ఆస్పత్రి నుంచి పరుగులు పెట్టాడు. సిబ్బంది వెంట పడటంతో స్థానికులు అతన్ని పట్టుకొని, దేహశుద్ధి చేశారు. చంటిపాపను ఇవ్వకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని, పసికందును తల్లికి అప్పగించి. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
పిల్ల రాక్షసుడు ఎంత సాహసం చేశాడు
లండన్: సాధారణంగా ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలను వెనుక సీట్లోనో లేదంటే పక్క సీట్లోనో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేస్తుంటారు. స్కూల్‌కి వారే తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తుంటారు. ఒక యుక్త వయసు వచ్చే వరకు వారికి వాహనం నడపడంలాంటి బాధ్యతలు అప్పగించరు. కానీ, బ్రిటన్‌లోని వెస్ట్ సస్సెక్స్ లో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. ఓ తండ్రి వెనుకాలే ఓ ట్రాలీలాంటి దాంట్లో కూర్చోగా ఆ ట్రాలీని తన ఎలక్ట్రిక్ కారుకు కట్టుకొని ఓ పిల్ల రాక్షసుడు రద్దీ రోడ్డు దాటుతూ పాదచారుల ఎక్కువగా ఉండే వీధుల్లో తన కారును వేగంగా పోనిస్తూ ఏం చక్కా చక్కర్లు కొట్టారు. అలా సిటీ వీధుల్లో తిరుగుతూ అనంతరం తండ్రితో కలసి ఏం చక్కా ఇంటికి వెళ్లాడు. ఓ వ్యక్తి కెమెరాకు చిక్కిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement