-
పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి?
పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ‘మాకు చేసుకోవాలనిపించినప్పుడు’ అంటారు పిల్లలు. ‘మేము చేయాలనుకున్నప్పుడు’ అంటారు తల్లిదండ్రులు. ‘మేము కన్న మా పిల్లల భవిష్యత్తు మాకు తెలియదా’ అని ప్రశ్నిస్తారు కూడా. అలాగే పిల్లల నిర్ణయం ప్రకారమే అనుకుంటే అది పదిహేనేళ్లు కావచ్చు, పాతికేళ్లు కావచ్చు. అందుకే ప్రభుత్వం వివాహానికి ఒక వయసును నిర్ధారించింది. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21ని వివాహ వయసుగా నిర్ధారిస్తూ అంతకంటే ముందు పెళ్లి జరిగితే ఆ పెళ్లిని బాల్య వివాహంగా పరిగణించాలని కూడా చెప్పింది. అలా వచ్చిన చట్టమే ‘ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్– 2006’, అంటే బాల్య వివాహ నిషేధ చట్టం అన్నమాట. అమ్మాయి అక్షరాలు దిద్దుతోంది కానీ... చట్టాలు పని చేస్తూనే ఉన్నాయి. సమాజం చైతన్యవంతం అవుతూనే ఉంది. అమ్మాయిల అక్షరాస్యత శాతం పెరుగుతోంది. అయినా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అక్షరాస్యత శాతం పెరుగుతోంది కానీ పాఠశాల విద్య దాటి కాలేజ్ బాట పట్టే సంఖ్య తక్కువగానే ఉంది. ఆ చదువు కూడా ఇప్పటికీ ఇంటర్ దాటడం లేదు. మనం చెప్పుకుంటున్న కేస్‌స్టడీలు గ్రామాలు, అల్పాదాయ వర్గానికి చెందినవి కావడం గమనార్హం. బాల్య వివాహాలకు ‘తల్లిదండ్రులకు చదువు లేకపోవడంతో΄ాటు సమాజంలో ఆడపిల్లకు భద్రత కరువవడం’ కూడా కారణమేనంటారు కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ అనుబంధ విభాగం ‘బచ్పన్ బచావో ఆందోళన్’ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త చందన. బాల్యాన్ని హరించడమే! ‘‘బాల్య వివాహం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే. వివాహం, పని, ఒత్తిడితో కూడిన చదువు... ఇవన్నీ పిల్లల బాల్యాన్ని హరించేవే. పిల్లల బాల్యాన్ని హరించే హక్కు కన్నవాళ్లకు కూడా ఉండదు. బాల్యవివాహాల నియంత్రణ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో అతి పెద్ద విఘాతం కరోనా రూపంలో వచ్చి పడింది. మునుపు 35గా ఉన్న బాల్య వివాహాల శాతం కరోనా కారణంగా 2020లో 62 శాతానికి పెరిగిపోయింది. ఆ తర్వాత ఏడాది కొంత తగ్గి 57 శాతం దగ్గర ఆగింది. ప్రభుత్వ పథకాలు కొంత వరకు బాల్య వివాహాలను తగ్గించగలుగుతున్నాయి. కానీ రావలసినంత మార్పు రాలేదనే చెప్పాలి. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని సంతోషం పడడమే ఇప్పటికి మనం సాధించింది’’ అన్నారు చందన. 2025 నాటికి స్త్రీ–పురుష సమానత్వంతో పాటు మహిళలు, బాలికల సాధికారత సాధించాలని ఐక్యరాజ్యసమితి ఒక లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే బాలికల విద్య మీదనే దృష్టి పెట్టాలి. అల్పాదాయ వర్గాల వాళ్లు కూడా అమ్మాయి పెళ్లికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. చదివించడం లేదెందుకంటే ‘మా దగ్గర డబ్బులెక్కడున్నాయ్’ అంటారు. అలాంటి వాళ్లందరికీ నేను చెప్పేదొక్కటే... ‘పెళ్లికి చేసే ఖర్చుని అమ్మాయి చదువుకి ఉపయోగించండి. మీ అమ్మాయి జీవనస్థాయి మారుతుంది. – చందన, కో ఆర్డినేటర్, బచ్పన్ బచావో ఆందోళన్, తెలంగాణ ఐదు వేల బాల్య వివాహాలను నివారించాం మనదేశంలో ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు బాల్య వివాహం చట్రంలో నలిగిపోతున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాసాధికారత కోసం నిర్వహించిన ‘సబల’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. అధికారులు ఐదు వేల బాల్య వివాహాలను నివారించగలిగారు. బాల్య వివాహ వ్యవస్థ తరతరాలుగా వస్తున్న దురాచారం. దీన్ని రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, పూర్తిగా నివారించడానికి ఇంకా కొన్నేళ్లు పడుతుంది. దీనికి మూలకారణం ఆర్థిక స్థితిగతులు, చదువు. ఆడపిల్లలను చదివించడం మీద దృష్టి పెట్టిన కుటుంబం బాల్య వివాహానికి దూరంగా ఉన్నట్లే. మహిళ సాధికారత సాధిస్తే తన కూతురిని ఈ చట్రంలో ఇరుక్కోకుండా రక్షించుకోగలుగుతుంది. అందుకే బాలికల విద్య, మహిళల ఆర్థికస్వయం సమృద్ధి పూర్తి స్థాయిలో సాధించగలిగిన రోజు బాల్య వివాహాలు వాటంతటవే నిర్మూలన అవుతాయి. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి చదవండి: Meenakshi Gadge: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు.. -
థూ.. ఛీ.. ఈ వన్‌సైడ్ లవ్
ఇటీవల హైదరాబాద్‌లో సంధ్య అనే అమ్మాయి మీద కార్తిక్ అనే ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సంఘటన ఆధారంగా రాసిందే ఈ కథనం! మండిపోతోంది! కని, పెంచిన అమ్మ కడుపు మండిపోతోంది. గుండెలకు హత్తుకున్న నాన్న గుండె మండిపోతోంది. అనురాగాన్ని పంచిన అన్న మనసు మండిపోతోంది. నిస్సహాయంగా చూస్తున్న సమాజానికి ఒళ్లు మండిపోతోంది. వన్‌సైడ్ లవ్.. అమ్మాయిల చితిగా మండిపోతోంది! థూ.. ఛీ.. అని ఎంత ఊసినా ఈ వన్‌సైడ్ లవ్ మండిపోతూనే ఉంది! ‘‘జాబ్ మానేయమని చెప్పాగా? వినిపించట్లేదా?’’ ఓ మగాడి హుకుం! ‘‘ఎందుకు మానెయ్యాలి?’’ ఓ అమ్మాయి అమాయకమైన ప్రశ్న! ‘‘నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు కాబట్టి నువ్వూ మానేయ్యాలి’’ అతని అహంకారం!‘‘నిన్ను తీసేస్తే నేనెందుకు మానెయ్యాలి?’’ మళ్లీ అదే అమాయకత్వం అమ్మాయిది!‘‘నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నా. కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి’’ ఆ పురుషుడి ఆధిపత్యం!‘‘నీకు ఇష్టమైతే నాకు నువ్వు ఇష్టం కావద్దా? నువ్వు పెళ్లిచేసుకోవాలనుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవద్దా?’’ మళ్లీ మళ్లీ అదే అమాయకత్వం ఆ పిల్లది. ‘‘యేడాది నుంచి అడుగుతున్నా.. పెళ్లి చేసుకుంటానని! ఒప్పుకో’’ హక్కుగా అతను.‘‘నేనూ యేడాది నుంచి చెప్తున్నా.. చేసుకోను అని. నాకిష్టంలేదు’’ స్పష్టంగా ఆమె.‘‘ఎందుకు ఇష్టంలేదు’’ అహం దెబ్బతిన్న అతను. ‘‘నాకు నువ్వు నచ్చలేదు’’ అదే స్పష్టతతో ఆమె.అప్పుడు సమయం సాయంకాలం ఆరున్నర. స్థలం.. హైదరాబాదు. ఆ టైమ్‌లో ఆమె తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంటికి వెళ్తోంది. దారికాపు కాసి మరీ ఆమెను విసిగిస్తున్నాడు అతను. అదే మొదలు కాదు. అప్పటికి చాలాకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లిచేసుకోమని సంవత్సర కాలంగా.. ఉద్యోగం మానెయ్యమని గతకొంతకాలంగా. ఆమె అతను అడిగిన అన్నిటికీ ‘నో’ అనే సమాధానమిచ్చింది. నో అంటే నో అనే. కాదు అంటే ఔననే అర్థంలో కానేకాదు. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరు కాదు. నానార్థాలు అసలే లేవు.వద్దు అంటే వద్దు అనే. అది తట్టుకోలేకపోయాడు అతను. వద్దు అంటుందని తెలిసే.. చాలా ప్లాన్‌తో వచ్చాడు ఆ రోజు. ఆమెనుంచి నో అనే సమాధానం రాగానే తన కోటు జేబులో దాచుకున్న పెట్రోల్ బాటిల్ తీసి ఆమె మీద పోసి నిప్పంటించి పారిపోయాడు. నడి రోడ్డు మీద.. జనసమ్మర్థం మెండుగా ఉన్న చోట! ఆమె విలవిల్లాడింది. అక్కడున్న జనం సహాయంతో ఆసుపత్రికి చేరింది. 64 శాతం కాలిన గాయాలతో ఆ రాత్రంతా పోరాడి తెల్లవారి ప్రాణాలు విడిచింది. అతను పారిపోయిన రోజు రాత్రే దొరికాడు. కాని అతని అహంకారం ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. తప్పు ఎక్కడ ఉంది? అతని పెంపకంలోనా?! కావచ్చు! ఒక్కసారి ఆ రెండిళ్ల నేపథ్యం తెలుసుకుందాం! అతని పేరు నిరంజన్. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. ఇంటికి అతనే పెద్దకొడుకు. తన తర్వాత ఓ తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. ఆ ఇంట్లో అతని తండ్రి ఏది చెబితే అదే శాసనం. ఆ తర్వాత ఆ అధికారం నిరంజన్, అతని తమ్ముడిదే. వాళ్లింట్లో ముగ్గురు ఆడవాళ్లు ఈ ముగ్గురు మగవాళ్లు చెప్పినట్టు వినాలి. లేదు, కాదు, కూడదు అనడానికి వీల్లేదు. అన్నిటికీ తలూపాలి తప్ప ఎదురు సమాధానం ఇవ్వకూడదు. అయితే ఇది నిరంజన్ వాళ్లమ్మకూ సమ్మతమే. ఆమెకే ఏంటి వాళ్ల అమ్మకు, అత్తమ్మకూ అంగీకారమే. ఆ కాలం నుంచీ వాళ్లు పాటిస్తున్న నియమమే! అందుకే నిరంజన్‌కు ఆడవాళ్లు నో చెబితే తట్టుకోలేని నైజం అలవడింది. నో అంటే ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రతికూల ఆలోచనా డెవలప్ అయింది. ఇటు అమ్మాయి స్వర్ణ కుటుంబమూ అదే భావజాలంలో ఉంది. వాళ్లది ఉమ్మడి కుటుంబం. ప్రేమానురాగాల మధ్య పెరిగినా.. పెత్తనం పురుషుడిదే. నో అనే హక్కు ఆడవాళ్లకు ఆ ఇంట్లోనూ తక్కువే. ఆర్థిక అవసరాల దృష్ట్యా స్వర్ణ ఉద్యోగంలో చేరింది. బయట వాతావరణం, మనుషుల ప్రవర్తనను చూసి కాస్త లోకజ్ఞానం అలవర్చుకుంది. ధైర్యంగా ఉండడం నేర్చుకుంది. తనకు నచ్చని వాటికి నచ్చలేదు అని చెప్పడం తెలుసుకుంది. అలాగే నిరంజన్కూ చెప్పింది కుదరదు, కూడదు, నచ్చలేదు అని. సంఘటనకు ముందు నేపథ్యం నిజానికి నిరంజన్, స్వర్ణ ఒకటే కంపెనీలో పనిచేస్తారు. స్వర్ణ ఒంద్దికైన పిల్ల. చేస్తున్న పని పట్ల నిబద్ధత, నిజాయితీ ఆమె స్పెషల్ క్వాలిఫికేషన్స్. డిసిప్లిన్ విషయంలోనైతే చెప్పే పనేలేదు. నిరంజన్ ఆమెకు పూర్తి వ్యతిరేకం. ఆకతాయి. పనంటే నిర్లక్ష్యం. ఏదైనా క్షణాల మీద కావాలనే తత్వం. క్రమశిక్షణ, పని విషయంలో పైవాళ్లతో చాలాసార్లు చీవాట్లు తిన్నాడు. స్వర్ణను చూసి కావాలనుకున్నాడు. పెళ్లి చేసుకుంటాను ఒప్పుకో అని ఒత్తిడి చేశాడు. మొత్తానికి ఆఫీస్‌లో అతని క్రమశిక్షణారాహిత్యం వల్ల ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి స్వర్ణనూ ఉద్యోగం మానేయమనే నస మొదలుపెట్టాడు. అసలు అతనిని కనీసం స్నేహితుడిగా కూడా గుర్తించని స్వర్ణ నిరంజన్ చేష్టలను బేఖాతరు చేసింది. అర్థం చేసుకోవాల్సింది పోయి అహంకారంతో ఆమెను అంతమొందించాడు అతను. దానికి చట్టం నిరంజన్‌కు శిక్ష వేస్తుండొచ్చు. కాని మగపిల్లలు అలాంటి ప్రవర్తనతో పెరగకుండా శిక్షణ ఇంట్లో కావాలి. బాల్యంలోనే సరిదిద్దాలి యూత్ ఏ నిర్ణయం తీసుకున్నా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. వాళ్లకి ఏమాత్రం ఓపిక, సహనం ఉండవు. ఆలస్యాన్ని ఏమాత్రం భరించలేరు. అయితే, తల్లిదండ్రులు చిన్నప్పటినుంచే పిల్లలకు ఓపిక, సహనం ప్రాముఖ్యతను తెలియజెయ్యాలి. ఓపిక పట్టలేకపోతే, సహనం లేకపోతే జీవితంలో విజయం సాధించలేవు అని చెప్పాలి. గెలుపు, ఓటమి అనేవి సర్వసాధారణమని, రెండూ బొమ్మా బొరుసు వంటివనీ, గెలిస్తే ఎంత సంబరపడతామో, ఓడిపోతే అంతకన్నా ఎక్కువ సహనం వహించాలని, దానిని అంగీకరించి తీరాలని వారికి తెలియజెప్పాలి. ఎదుటివారి ముఖ్యంగా స్త్రీలకు కూడా అభిప్రాయాలు ఉంటాయనీ, వాటిని కూడా గౌరవించాలని గట్టిగా చెప్పాలి. పిల్లలకు స్త్రీల పట్ల, తోటి బాలికలు, అక్కచెల్లెళ్ల పట్ల చులకన భావం ఉన్నట్లు గమనిస్తే దానిని చిన్న వయస్సులోనే సరిదిద్దాలి. ఇటువంటి సంఘటనలు అంటే ఆడవాళ్ల పట్ల చెడుగా, దుర్మార్గంగా ప్రవర్తించిన సంఘటనలు ఏమైనా జరిగితే, వాటి గురించి వారి అభిప్రాయం ఏమిటో కనుక్కుని, ఒకవేళ తప్పుడు అభిప్రాయం ఉంటే దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. క్యూలో ఆడవాళ్లు ఉంటే వారిని గౌరవించి, ముందే పంపడం, బస్సుల్లో, రైళ్లల్లో మనం కూర్చుని ప్రయాణించేటప్పుడు ఆడవాళ్లెవరైనా వస్తే, లేచి నిలబడి వాళ్లకి మన సీట్ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవించడం వంటి మంచి పద్ధతులను అలవాటు చేస్తే, పెద్దయ్యాక వాళ్లు సంస్కారవంతులవుతారు. సమాజంలో స్త్రీల పట్ల చులకన భావం ఉండకుండా ఉంటుంది. వారి అభిప్రాయాన్ని గౌరవించడం అలవాటవుతుంది. – డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నోస్టిక్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. – శరాది -
బాల్యవివాహాల నిలిపివేత
► తల్లిదండ్రులను కౌన్సెలింగ్ కొల్లాపూర్ రూరల్/బల్మూర్: నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగే బాల్యవిహాలను అధికారులు నిలిపివేయించారు. మండల పరిధిలోని బోయలపల్లిలో బాల్యవివాహం చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సుందర్రాజు, ఎస్ఐ సత్యనారాయణ, సీడీపీఓ వెంకటరమణ, ఆర్ఐ నసీరోద్దీన్ బుధవారం గ్రామానికి చేరుకుని అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాల్యవివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. కాదని పెళ్లి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బల్మూర్‌లో.. మండల కేంద్రంలో అధికారులు బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మైనర్‌ను అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన యువకుడితో ఈనెల 29న వివాహం జరిపించాడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, తహసీల్దార్ అంజిరెడ్డి, ఎస్ఐ వెంకన్న బుధవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. మేజర్అయ్యేంత వరకు పెళ్లి చేయొద్దని సూచించారు. వారించడంతో ఒప్పంద పత్రం రాయించుకుని బాలికను చైల్డ్‌కేర్‌కు తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement