-
బర్త్‌డే ప్లాన్ రెడీ
బర్త్‌డేకి కేక్ కట్ చేయడంతోపాటు థియేటర్లో బుల్లెట్స్‌ను పేల్చుతానంటున్నారు బాలీవుడ్ హీరో సంజయ్ దత్. తిగ్మాన్షు థూలియా దర్శకత్వంలో సంజయ్‌దత్, జిమ్మి షెర్గిల్, మహి గిల్, చిత్రాంగద సింగ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘సాహెబ్ బిబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ 3’. 2011లో వచ్చిన ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్’, 2013లో ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’లను డైరెక్ట్ చేసిన థూలియా దర్శకత్వంలో రూపొందుతున్న మూడోపార్ట్ ఇది. సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని బాలీవుడ్ సమాచారం. అయినా ఇప్పుడు రిలీజ్ చేయరట. మంచి డేట్ కోసం చూస్తున్నారని సమాచారం. ఆ డేట్ సంజయ్ దత్ బర్త్‌డే డేట్ అని భోగట్టా. జూలై 29న సంజూ బాబా బర్త్‌డే. అదే రోజున ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. -
మరోసారి ప్రూవ్ చేసుకున్నా : అంజలి
‘‘మనం పునర్జన్మ అనే పాయింట్‌ను నమ్ముతాం. ఓ మగవాడు చనిపోయి ఆడపిల్లగా పుడితే ఎలా ఉంటుందో చెప్పే చిత్రమే ‘చిత్రాంగద’. కొత్త పాయింట్‌కు థ్రిల్లర్ ఎలిమెంట్ జోడించి తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనడానికి నిదర్శనం మా చిత్రం’’ అని దర్శకుడు జి. అశోక్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ‘చిత్రాంగద’ గత శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ‘‘అశోక్‌గారు మంచి కథనంతో ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా చేశారు. అంజలి నటన, అశోక్ టేకింగ్ మా చిత్రం సక్సెస్‌కి కారణం’’ అని నిర్మాతలు అన్నారు. ‘‘అశోక్‌గారు చిత్రాంగద వంటి క్యారెక్టర్ ఇచ్చి మరోసారి నన్ను నేను ప్రూవ్ చేసుకునేలా చేశారు. నిర్మాతలు క్వాలిటీతో తీశారు. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు’’ అని అంజలి చెప్పారు. ‘‘చిత్రాంగద’ విడుదలైన రోజు నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ముందుకు సాగుతోంది. ఓవర్సీస్లో కూడా మంచి రిపోర్ట్ వచ్చింది’’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. -
చిత్రాంగద కోసం హార్డ్ వర్క్ చేశా
‘‘గీతాంజలి’’ చిత్రం తర్వాత నేను చేసిన∙లేడీ ఓరియంటెడ్ మూవీ ‘చిత్రాంగద’. వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన సినిమా. ఈ చిత్రం కోసం చాలా హార్డ్‌వర్క్ చేశా’’ అని అంజలి అన్నారు. ఆమె టైటిల్ రోల్లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ నేడు విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథ ఇది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలుంటాయి’’ అన్నారు. ‘‘గీతాంజలి’ కంటే అంజలి ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘చిత్రాంగద’. సినిమాపై నమ్మకంతో డిస్టిబ్య్రూటర్స్, ఎగ్జిబిటర్స్ విడుదల చేసేందుకు ముందుకొచ్చారు’’ అన్నారు మల్కాపురం శివకుమార్. -
అంజలి భయపడలేదు!
‘‘ఇండియాలో కొత్తగా ఓటు హక్కు వచ్చినవాళ్లు 18 కోట్లమంది ఉన్నారని గర్వంగా చెబుతున్నాం. కొత్తగా తీసిన చిత్రాలు చూడడానికి కనీసం ఐదు కోట్లమంది రాకపోతారా? వస్తారనే నమ్మకం నాకుంది’’ అన్నారు దర్శకుడు అశోక్. అంజలి ముఖ్యతారగా అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ‘చిత్రాంగద’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ చెప్పిన సంగతులు.... ► పురాణాల్లోకి వెళితే... అర్జునుడి భార్యల్లో చిత్రాంగద ఒకరు. ఆమె మణిపూర్ మహారాణి. చిన్నప్పటి నుంచి మగరాయుడిలా పెరుగు తుంది. బాగా గట్స్ ఉన్న లేడీ. మా సినిమాలో హీరోయిన్ కూడా మంచి గట్స్ ఉన్న అమ్మాయి. అందుకే, ‘చిత్రాంగద’ అని టైటిల్ పెట్టాను. ► ప్రపంచ సినిమాలో ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని కొత్త పాయింట్ తో ఈ సినిమా తీశాం. ఇది హారర్ సినిమానా? లేక థ్రిల్లరా? అనిపిస్తుం ది. ఓ అమ్మాయికి వ్యక్తిగత సమస్యలు ఎదురైతే ఒక్కో స్టేజిలో తను ఎలా మారుతుందనేది కథ. మొండితనం, పట్టుదల గల ఓ అమ్మాయి లైఫ్ జర్నీ. థియేటర్లో ప్రేక్షకుడు ఓ కథ అనుకుంటే.. పారలల్‌గా మరో కథ నడుస్తుంది. క్లైమాక్స్‌లో అది అర్థమవుతుంది. ► ఇందులో అంజలి అల్ట్రా గ్లామరస్‌గా... క్యారెక్టర్ పరంగా షార్ట్స్ వేసుకుని నటించింది. అమెరికాలో మైనస్ 11 డిగ్రీల టెంపరేచర్లో చిత్రీకరించాం. ఫుల్ డ్రెస్సుల్లో ఉన్న అమెరికన్స్ షార్ట్స్ వేసుకున్న అంజలిని విచిత్రంగా చూసేవారు. చలికి సప్తగిరికి కూడా భయపడ్డారు. కానీ, అంజలి భయపడలేదు. తన మొండితనం, పట్టుదల చూసి రియల్ లైఫ్‌లో ఆమె ‘చిత్రాంగద’ అనిపించింది. ► తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరుగా షూట్ చేశాం. తెలుగులో ఈ నెల 10న, తమిళంలో రెండు వారాల తర్వాత రిలీజ్ చేస్తాం. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మల్కాపురం శివకుమార్ విడుదల విషయంలో సహకరిస్తున్నారు. ► అనుష్కతో తీస్తున్న ‘భాగమతి’ బయోపిక్ కాదు. ఫిక్షనల్ స్టోరీ. మరో ఆరేడు రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ∙డబ్బులు తీసుకొచ్చే ప్రతి సినిమా నిర్మాతకు కమర్షియల్ సినిమానే. కంగనా ‘తను వెడ్స్ మను’ సిరీస్ 300 కోట్లకుపైగా వసూలు చేసింది. మూడేళ్లుగా మహిళలు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రాలు వెయ్యి కోట్లు వసూలు చేశాయి. ఫార్ములా బేస్డ్ కమర్షియల్ చిత్రాలెప్పుడూ ఉంటాయి. కానీ, యువతరం మాత్రం కొత్త సినిమాలకు ఓటేస్తున్నారు. ‘చిత్రాందగ’ వంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్‌ను ఆదరిస్తున్నారు. -
థ్రిల్లింత.. నవ్వింత...
‘‘కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొంది?’’ అన్నదే ‘చిత్రాంగద’ కథాంశం’’ అని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో విడుదలవుతోంది. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో సురక్‡్ష ఎంటర్టైన్ మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజున ఈ చిత్రం విడుదల కానుంది. ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ కామెడీ జానర్లో రూపొందిన చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉంటుంది. స్కీ్రన్ లైట్‌గా ఉన్న ఈ చిత్రంలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను షాక్ గురి చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, కెమెరా: బాల్‌రెడ్డి (హైదరాబాద్), జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
టీ20 వరల్డ్‌కప్‌కు నేపాల్ జట్టు ప్రకటన..
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కేకు స్టార్ ప్లేయర్స్ దూరం
తెలంగాణలో పోలింగ్ సమయం పెంచిన ఈసీ..
సమ్మర్ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు!
తప్పక చదవండి
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- ‘జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు’: బొబ్బిలి రోడ్‌షోలో సీఎం జగన్
Advertisement