-
అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు. బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్‌గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్‌ను ఉప మేయర్‌గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్‌గా, ఉప మేయర్‌గానూ సేవలందించారు. మేయర్‌గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మైకి హోతి. మైకి హోతి తల్లిదండ్రులు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. ఆర్మ్‌స్ట్రాంగ్ రోడ్లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk — Mikey Hothi (@mikey_hothi) December 23, 2022 ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! -
చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.100 కోట్లు
శాలిబండ: గ్రేటర్ పరిధిలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగర మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. కట్టడాల మరమ్మతులు, పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. శనివారం ఆయన చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో కలిసి చారిత్రక కట్టడమైన ‘ఖుర్షీద్ జా దేవుడీ’ని సందర్శించారు. ఈ కట్టడం పెచ్చులూడుతుండడాన్ని గమనించిన మాజిద్ హుస్సేన్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులకు సూచించారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేపట్టి వీటికి మరింత వన్నె తెస్తామన్నారు. ఈ పనులను కుడా ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు. దారుషిఫాలోని పాత పాస్‌పోర్టు కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. కార్యక్రమంలో హుస్సేనీ ఆలం కార్పొరేటర్ మీర్ జుల్ఫీకర్ అలీ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు, ఎంఐఎం నాయకులు అసద్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టీ20 వరల్డ్‌కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
స్మృతి ఇరానీని ఓడించడం ఖాయం: కిశోరీ లాల్ శర్మ
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్‌లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement