-
మూడో మ్యాచ్ గెలిచిన నైట్ రైడర్స్
-
క్రికెట్ లవర్స్‌కు పండుగ
క్రికెట్ లవర్స్‌కు పండుగ వచ్చేసింది. చాంపియన్స్ లీగ్ టి20 (సిఎల్టి) చడీ చప్పుడు కాకుండా ఈరోజు ప్రారంభం కాబోతుంది. ఐపిఎల్(ఇండియన్ ప్రిమీయర్ లీగ్) అంత ఫాలోయింగ్ చాంపియన్స్ లీగ్‌కు లేదని ఇప్పటి వరకు భావించారు. క్రికెట్‌ను పిచ్చపిచ్చగా ఆదరించే మన దేశంలో క్రికెట్ ప్లేయర్లను దేవుళ్లుగా కొలుస్తారు. స్టార్ ప్లేయర్లుంటే చాలు ఏ టోర్నీ అయినా గ్రాండ్ సక్సెస్. అందులోనూ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, శిఖర్ ధావన్ బరిలో దిగుతున్నారంటే గోలగోలే! స్టేడియంలు ఫ్యాన్స్ ఈలలు, గోలతో మార్మోగుతాయి. చాంపియన్స్ లీగ్‌కు ఐపిఎల్ మాదిరి హడావిడి కనిపించడం లేదు. న్యూజిలాండ్‌కు చెందిన ఒటాగో వోల్ట్స్ టీమ్ గురించి ఎంత మంది క్రికెట్ ఫ్యాన్స్‌కు తెలుసు. ఆ టీమ్‌లో ఎవరెవరు వున్నారో ఓ అయిదుగురి క్రీడాకారుల పేర్లు ఎవరైనా చెప్పగలరా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ లీగ్ టోర్నీ చూసేందుకు కొన్ని కారణాలు వున్నాయి. ది వాల్ అనే ముద్దు పేరుతో పదిహేడేళ్లుగా ఇండియన్ క్రికెట్‌కు సేవలందించిన రాహుల్ ద్రావిడ్‌కు ఇదే చివరి టోర్నమెంట్. రాజస్థాన్ రాయల్స్‌కు ద్రావిడ్ తన చివరి టోర్నీలో ఆడుతున్నాడు. గొప్ప టెస్ట్ క్రికెటర్ అయిన ద్రావిడ్ టి ట్వంటీ టోర్నీల్లోనూ చెప్పుకోదగ్గ రన్స్ తీయడమే కాకుండా, టీమ్‌ను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్ కూడా. అందుకే ఐపిఎల్‌లో మూడో స్థానం పొందిన రాజస్థాన్ రాయల్స్ చాంపియన్స్ లీగ్‌కు క్వాలిఫై అయింది. ముగ్గురు ప్లేయర్లు స్పాట్ ఫిక్సింగ్ వూబిలో కూరుకుపోయి టీమ్‌కు దూరమైనప్పటికీ, అందుబాటులో వున్న వారితోనే జైత్రయాత్ర సాగించడం ద్రావిడ్ ప్రత్యేకత. ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా 198 మ్యాచ్‌లు ఆడిన స్టార్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఇటీవల ఆడిన ఐపిఎల్ తన చివరి టోర్నీ అన్నాడు. వచ్చే ఏడాది ఊపిఎల్ లాంటి పొట్టి ఫార్మాట్లో సచిన్ ఆటను మన చూసే అవకాశం లేదు. అందుకే చాంపియన్స్ లీగ్ టోర్నీలోనే చివరి సారిగా సచిన్‌ను ఈ పొట్టి ఫార్మాట్లో ఆడటాన్ని తనవి తీరా చూసే చాన్సుంది. గాయాన్ని సైతం లెక్క చేయక ఐపిఎల్ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన సచిన్ లాంటి మెగా ప్లేయర్‌కు ఈ పొట్టి ఫార్మాట్లో గ్రాండ్‌గా వీడ్కోలు ఇవ్వాల్సిందిగా మాజీ లెగ్ స్పిన్నర్, ముంబై ఇండియన్స్ మెంటర్ అనిల్ కుంబ్లే ఫ్యాన్స్‌ను కోరారు. గత ఏడాదిగా న్యూస్ మేకర్ క్రికెటర్ ఎవరంటే శిఖర్ ధావన్ అనే చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదుర్స్ అనిపించిన ఈ ఓపెనర్ ఐపిఎల్ లాంటి పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటి వన్డే టీమ్‌కు సెలెక్టయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆ తర్వాత వెస్టిండీస్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో, ఆ తర్వాత జింబాబ్వేలో జరిగిన సిరీస్‌లోనూ శిఖర్ ధావన్ తనేమిటో రుజువు చేసుకున్నాడు. ఫలితంగా సంగక్కర గైర్హాజరీలో వైస్ కెప్టెన్ కామెరూన్ వైట్ నుండి సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్సీని ధావన్ చేజిక్కించుకున్నాడు కూడా. సిఎల్టికి ఐపిఎల్‌కు వున్న ఆదరణ లేదని బాధపడేవారికి ఇది ఓ శుభవార్తే. ఈ టోర్నీలో నాలుగు ఇండియా టీమ్స్ బరిలో వున్నాయి. ఈ స్టార్ ప్లేయర్ల యాక్షన్‌ను షార్ట్ ఫార్మాట్లో చూసి ఆనందించడం ఇక మీ వంతే. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే చాంపియన్స్ లీగ్-2013 తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ తమ సొంతగడ్డపై ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తలపడనుంది. చాంపియన్స్ లీగ్ టి20 షెడ్యూల్ సెప్టెంబర్ - 21 - ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్-జైపూర్ - రా. గం. 8 నుంచి 22- బ్రిస్బేన్ హీట్ - ట్రినిడాడ్ అండ్ టొబాగో -రాంచీ- సా. గం. 4 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ - టైటాన్స్ -రాంచీ -రా. గం. 8 నుంచి 23 -హైవెల్డ్ లయన్స్ - పెర్త్ స్కార్చర్స్ -అహ్మదాబాద్-సా. గం. 4 నుంచి ముంబై ఇండియన్స్ - ఒటాగో వోల్ట్స్ -అహ్మదాబాద్- రా. గం. 8 నుంచి 24 -బ్రిస్బేన్ హీట్ - టైటాన్స్ మొహాలీ- సా. గం. 4 నుంచి సన్‌రైజర్స్ -ట్రినిడాడ్ అండ్ టొబాగో- మొహాలీ-రా. గం. 8 నుంచి 25 -పెర్త్ స్కార్చర్స్ - ఒటాగో వోల్ట్స్ -జైపూర్ -గం. సా. 4 నుంచి రాజస్థాన్ రాయల్స్ - హైవెల్డ్ లయన్స్- జైపూర్- గం. రా. 8 నుంచి 26 -సన్‌రైజర్స్ - చెన్నై సూపర్ కింగ్స్ -రాంచీ- రా. గం. 8 నుంచి 27 -ముంబై ఇండియన్స్ - హైవెల్డ్ లయన్స్-అహ్మదాబాద్-రా. గం. 8 నుంచి 28 -సన్‌రైజర్స్ - టైటాన్స్ -రాంచీ- సా. గం. 4 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ - బ్రిస్బేన్ హీట్ -రాంచీ-రా. గం. 8 నుంచి 29 -హైవెల్డ్ లయన్స్ - ఒటాగో వోల్ట్స్- జైపూర్- సా. గం. 4 నుంచి రాజస్థాన్ రాయల్స్ - పెర్త్ స్కార్చర్స్- జైపూర్ -రా. గం. 8 నుంచి 30 -టైటాన్స్ - ట్రినిడాన్ అండ్ టొబాగో- అహ్మదాబాద్- సా. గం. 4 నుంచి సన్‌రైజర్స్ -బ్రిస్బేన్ హీట్ -అహ్మదాబాద్- రా. గం. 8 నుంచి అక్టోబర్ 1 -రాజస్థాన్ రాయల్స్ -ఒటాగో వోల్ట్స్ -జైపూర్- రా. గం. 8 నుంచి 2 -ముంబై ఇండియన్స్ -పెర్త్ స్కార్చర్స్-ఢిల్లీ- గం. సా. 4 నుంచి చెన్నై సూపర్ కింగ్స్- ట్రినిడాడ్ అండ్ టొబాగో- ఢిల్లీ-గం. రా. 8 నుంచి 4 -తొలి సెమీ ఫైనల్ (ఎ1-బి2) -జైపూర్ -రా. గం. 8 నుంచి 5 -రెండో సెమీ ఫైనల్ (ఎ2-బి1)- ఢిల్లీ- రా. గం. 8 నుంచి 6 -ఫైనల్ -ఢిల్లీ -రా. గం. 8 నుంచి ఏ గ్రూప్‌లో ఎవరు గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, హైవెల్డ్ లయన్స్, పెర్త్ స్కార్చర్స్, ఒటాగో వోల్ట్స్ గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్, బ్రిస్బేన్ హీట్, టైటాన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో -
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘన విజయం
ఐపీఎల్లో కనబర్చిన స్ఫూర్తిదాయక ఆటతీరును చాంపియన్స్ లీగ్‌లోనూ హైదరాబాద్ జట్టు కొనసాగించింది. విజయలక్ష్యం పెద్దదే అయినా ఏ మాత్రం బెదరకుండా దూకుడు ప్రదర్శించి సీఎల్‌టి20 క్వాలిఫయింగ్‌లో శుభారంభం చేసింది. ఇటీవల తనకు వచ్చిన సూపర్‌స్టార్ ఇమేజ్ను నిలబెట్టుకుంటూ శిఖర్ ధావన్ మళ్లీ చెలరేగి నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. మొహాలీ: చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది. సంగక్కర (46 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు), కెప్టెన్ తిరిమన్నె (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 89 పరుగులు జోడించి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇషాంత్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శిఖర్ ధావన్ (53 బంతుల్లో 71; 11 ఫోర్లు), పార్థివ్ పటేల్ (42 బంతుల్లో 52; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 121 పరుగులు జత చేసి రైజర్స్ లక్ష్యాన్ని సులభతరం చేశారు. చివర్లో పెరీరా (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో మ్యాచ్ ముగిసింది. ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కీలక భాగస్వామ్యం టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో గతి తప్పిన బౌలింగ్‌తో స్టెయిన్ తన రెండు ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మరో వైపు ఇషాంత్ చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తన తొలి ఓవర్లో ఒకే పరుగు ఇచ్చిన ఇషాంత్, రెండో ఓవర్లో తరంగ (18 బంతుల్లో 19; 4 ఫోర్లు)ను పెవిలియన్‌కు పంపించాడు. మరుసటి ఓవర్లోనే స్యామీ బౌలింగ్‌లో జయసూర్య (4) వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసే సరికి కందురతా 2 వికెట్లకు 37 పరుగులు చేసింది. ఈ దశలో సంగక్కర, తిరిమన్నె కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరు సమన్వయంతో చక్కటి షాట్లు ఆడుతూ వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తిరిమన్నె... ఆ వెంటనే ఇషాంత్ వేసిన యార్కర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం జోరు పెంచిన సంగక్కర 36 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివర్లో దిల్హారా (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో మారూన్స్ ఇన్నింగ్స్ 168 పరుగుల వద్ద ముగిసింది. చెలరేగిన ఓపెనర్లు హైదరాబాద్‌కు ధావన్, పార్థివ్ కలిసి మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ప్రతీ ఓవర్లో బౌండరీలు బాదుతూ వీరిద్దరు వేగంగా లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. మెండిస్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి ధావన్ తన దూకుడును ప్రదర్శించాడు. పవర్‌ప్లేలో రైజర్స్ వికెట్ కోల్పోకుండా 58 పరుగులు చేసింది. ఏ బౌలర్‌ను వదలని రైజర్స్ ఓపెనర్లు జోరును కొనసాగించడంతో 10.4 ఓవర్లలో జట్టు స్కోరు వంద పరుగులకు చేరుకుంది. ఆ వెంటనే ధావన్ (35 బంతుల్లో), పార్థివ్ (37 బంతుల్లో) వరుస బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కొంత వ్యవధిలో ఈ ఇద్దరూ అవుటైనా...డుమిని (6 నాటౌట్)తో కలిసి పెరీరా ముగించాడు. స్కోరు వివరాలు కందురతా మారూన్స్ ఇన్నింగ్స్: తరంగ (సి) పార్థివ్ (బి) ఇషాంత్ 19; జయసూర్య (సి) పార్థివ్ (బి) స్యామీ 4; సంగక్కర (నాటౌట్) 61; తిరిమన్నె (బి) ఇషాంత్ 54; దిల్హారా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 168 వికెట్ల పతనం: 1-25; 2-33; 3-122. బౌలింగ్: స్టెయిన్ 4-0-35-0; ఇషాంత్ 4-0-20-2; స్యామీ 4-0-31-1; పెరీరా 4-0-43-0; మిశ్రా 1-0-9-0. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: పార్థివ్ (సి) జయరత్నే (బి) జయసూర్య 52; ధావన్ (సి) కులశేఖర (బి) మెండిస్ 71; డుమిని (నాటౌట్) 6; పెరీరా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 174 వికెట్ల పతనం: 1-121; 2-136. బౌలింగ్: జయసూర్య 4-0-25-1; జయరత్నే 3-0-33-0; నువాన్ కులశేఖర 3.3-0-35-0; దిల్హారా 4-0-38-0; అజంతా మెండిస్ 4-0-39-1.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement