-
చిరంజీవి గురించి ఎవరికీ తెలియని నిజాలు..!
-
8 ఏళ్లు సినిమా ఆఫీసుల చూట్టూ తిరిగా: హీరో సుజిత్ రెడ్డి
Cheruvaina Dooramaina: వినాయక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ’చేరువైన... దూరమైన’. ఈ మూవీతో స్టార్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. తరుణి సింగ్ హీరోయిన్. సుకుమార్ పమ్మి సంగీతం అందించాడు. ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో సుజిత్ మాట్లాడుతూ సినిమా విశేషాల గురించి ముచ్చటించాడు. ‘నేను రోహన్ తనేజా అనే ఓ ముంబాయి బేస్డ్ ఇన్ స్టిట్యూట్లో నటనపై శిక్షణ తీసుకున్నానను. మామయ్య శ్రీనివాసరెడ్డి కూడా సినిమాల్లో వుండటంతో బహుశా ఆ బ్లడ్ నాలో కూడా వుండటంతో నటనపై ఆసక్తి ఏర్పడింది అనుకుంట. నాకు యాక్షన్ సీన్స్ చేయడం అంటే చాలా ఇష్టం.ఈ చిత్రంలో క్లైమాక్స్ ప్రధానం. మొదట్లో చాలా మంది క్లైమాక్స్ సీన్స్‌పై సందేహాలు వచ్చాయి. మొదటి సినిమాలోనే అంత బరువైన క్లైమాక్స్ ఎందుకని అందరూ అన్నారు. కానీ దర్శకుడు పట్టుబట్టి చేయించారు. మా సినిమాలో మ్యూజిక్ బాగుంది. అన్ని పాటటు బాగా వచ్చాయి. ఇందులో క్లైమాక్స్ ఏ సినిమాలో వుండదు. చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సీన్‌ను కాకినాడ ఉప్పాడ బీచ్‌లో తీశాం. చాలా బాగా వచ్చింది. ఇందులో తమిళ నటుడు శశి ప్రతినాయకుడుగా చాలా బాగా చేశాడు. మిగతా పాత్రల్లో దర్శకుడు దేవీప్రసాద్, రాజేశ్వరీ నాయర్, హీరోయిన్ అమ్మ పాత్రలో మణిచందన, బ్రదర్ పాత్రలో తమిళ నటుడు శశి నటించారు. సీనియర్ నటుడు బెనర్జీ కూడా చేశారు. ఎనిమిదేళ్లు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగా... హీరోగా నటించాలనే ఫ్యాషన్‌తో ఆఫీసుల చుట్టూ తిరిగేవాడినని చెప్పాడు. ‘చాలా మంది ‘ఎందుకు నీవు ఆఫీసుల చుట్టూ తిరగడం.. మీ మావయ్య అనుకుంటే... పెద్ద డైరెక్టర్లే ముందుకొస్తారు కదా. ఎందుకంత కష్టపడుతున్నావు’ అనే వాళ్లు. కానీ నేనే సొంతంగా రాణించాలి.. నేనే నిర్మాతలని, దర్శకులను మెప్పించి సినిమా చేయాలని అనేవాడిని. ఈ క్రమంలో చంద్రశేఖర్ కానూరి పరిచయం అయ్యారు. హీరో కావాలంటే బాగా స్లిమ్ అవ్వాలి చెప్పారు. అయితే నేను బాగా ఫ్యాట్ ఉండేవాడిని. దాంతో పది కిలోలు తగ్గి స్లిమ్ అయ్యా. ఫస్ట్ నా మీద ఓ ట్రయల్ షూట్ చేశారు. దాన్ని మామయ్యకు చూపించగానే బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆ తరువాత ఈ సినిమా కథ విని సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అన్నారు. దాంతో ఈ ప్రాజెక్టు పట్టాల మీదకు ఎక్కింది. కొత్తవాడినైనా నిర్మాతలు బడ్జెట్టుకు వెనకాడలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక తాను మాస్ మహారాజా రవితేజకు డైహార్ట్ ఫ్యాన్ అని తెలిపాడు. -
హీరోగా శ్రీనివాసరెడ్డి మేనల్లుడు
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. చంద్రశేఖర్ ఏలేటి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన చంద్రశేఖర్ కానూరిని దర్శకునిగా పరిచయం చేస్తూ క్రాంతి నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. కల్కిమిత్ర కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్, సంగీతం: మణికాంత్ ఖాద్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేశ్ శర్మ.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement