-
కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్ వచ్చేసింది
కూల్‌ప్యాడ్ తన సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఆదివారం లాంచ్ చేసింది. కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి విడుదల చేసింది. దీని ధర 14,999 రూపాయలు. ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో సెప్టెంబర్ 4 నుంచి అందుబాటులో ఉండనుంది. గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఇది విక్రయానికి వస్తోంది. స్పెషిఫికేషన్ల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్4, లెనోవో కే8 నోట్‌కు గట్టి పోటీగా నిలువనుంది. కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఫీచర్లు... 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 6జీబీ ర్యామ్ 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్ 13ఎంపీతో డ్యూయల్ రియర్ కెమెరా 8 ఎంపీతో ఫ్రంట్ కెమెరా డ్యూయల్ సిమ్(నానో+నానో) 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 7.1 ఆధారిత కూల్‌ప్యాడ్ యూఐ -
కూల్ ప్యాడ్ కొత్త ఫోన్, ఫీచర్లెలా ఉన్నాయంటే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లోకి లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ కూల్ ప్లే6 పేరుతో బుధవారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర సీఎన్‌వై 1,499గా కంపెనీ ప్రకటించింది. అంటే భారత్ కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు 8900రూపాయలు ఉండొచ్చు. చైనాలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కంపెనీ, ఈ ఫోన్ ను మే 16నుంచి విక్రయానికి తీసుకొస్తోంది. మెటల్ ఫ్రేమ్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ రియర్ కెమెరా, 4060 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో స్పెషల్ ఫీచర్లు. సాఫ్ట్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ స్పీకర్ గ్రిల్స్ ను స్మార్ట్ ఫోన్ కింద భాగంలో కంపెనీ ఉంచింది. 5.5 అంగుళాల డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుంది. 64బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 653 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీకి అవకాశం, రెండు 13మెగాపిక్సెల్ సోనీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా, సెల్ఫీ కోసం ముందు భాగాన 8 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి..
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
తప్పక చదవండి
- అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా
- కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం
- రోహిణి తీవ్రత లేనట్టే!
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- సాగుకు చక్కనైన సాయం
- రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా
- వన సంపదకు పెద్ద ఆపద!
- 18అడుగుల ఎత్తులో ఆర్ఆర్ఆర్!
- స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు
Advertisement