-
గుండెపోటు ముప్పు.. ట్విట్టర్ చెప్పు!
సామాజిక వెబ్సైట్లలో ఎంతోప్రాచుర్యం పొందిన సైట్.. ట్విట్టర్ తన ఖాతాదారుకు గుండెపోటు వచ్చే ముప్పు ఎంతుందో కచ్చితంగా చెప్పగలదని పరిశోధకులు తేల్చారు. ట్విట్టర్లో ఖాతాదారులు ఉపయోగించే భాష, వారు వ్యక్తం చేసే భావాలు, ఆ సందర్భంగా వారిలో కలిగే మానసిన ఉద్వేగం, ఆందోళన తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఏ మేరకుందో కచ్చితంగా అంచనా వేయవచ్చని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్పారు. గుండెపోటుకు కారణమవుతున్న ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల వల్లనే కాకుండా ఇతర అంశాల వల్ల కూడా అత్యంత ప్రమాదకరమైన ‘కరోనరి హార్ట్ డిసీస్’ వస్తుందని తమ పరిశోధనల్లో తేటతెల్లమైందని వారన్నారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలకు అడ్డంకులు ఏర్పడడాన్ని వైద్య పరిభాషలో కరోనరి హార్ట్ డీసీస్ అంటారు.భారత్‌లో గుండె జబ్బుగల వారిలో 95 శాతం మంది ఈ జబ్బు కారణంగానే చనిపోతున్నట్లు వైద్య గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రతికూల ప్రభావం చూపే కోపం, ఉద్రేకం, ఒత్తిడి కారణంగానే అమెరికాలో ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారని వారి ట్వీట్లను అధ్యయనం చేయడం ద్వారా తేలిందని వారంటున్నారు. భావోద్వేగం వల్ల ఒత్తిడికి గురయ్యే వారిలో ఈ ముప్పు తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఇంకా తమ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం తెల్సిందని, ట్వీట్లలో ఆగ్రహం వ్యక్తం చేసే వారికన్నా పొరుగువారి ఆగ్రహాన్ని చవిచూసిన వారే ఎక్కువగా గుండె పోట్లకు గురవుతున్నారని వారు తెలిపారు. -
కోపం గుండెకు చేటు!
వాషింగ్టన్: ఆందోళన, కోపం, నిరాశలతో... ప్రతికూల ఆలోచనలతో.. భావోద్వేగాలు తీవ్రస్థాయికి చేరితే మీ గుండె పనితీరులో మార్పు రావడమే కాదు... ఏకంగా గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీటర్ గేయినరోస్ బృందం ప్రతికూల భావోద్వేగాలు-మెదడు, గుండె సంబంధిత వ్యాధులపై పరిశోధనలు నిర్వహించింది. రక్తనాళాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే మొదడు, గుండెలకు రక్తసరఫరాలో అడ్డంకులు ఏర్పడుతాయి, చివరకు అది గుండె పోటుకు దారితీస్తుంది. ఈ పరిణామాన్ని ‘ఎథెరోస్ల్కేరోసిన్’గా పిలుస్తారు. శరీరంలో రసాయన ప్రక్రి య వేగంగా జరిగినప్పుడు మానసికభావోద్వేగాలు పెరగడంతో ఎథెరోస్ల్కేరోసిన్ వృద్ధి చెందుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువై హృదయానికి అందే రక్తసరఫరాలో అడ్డంకులు ఏర్పడి గుండెసంబంధిత వ్యాధులు వస్తాయి. 157 మందికి విచారకరమైన చిత్రాలను చూపించి.. వారి భావోద్వేగాలను పరిశీలించిన అనంతరం పీటర్ బృందం ప్రతికూల ఆలోచనలు, భావోద్వేగాలు అధికంగా ఉన్నవారిలో గుండెసంబంధిత వ్యాధు లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తమ అధ్యాయనంలో తేలినట్లు వెల్లడించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్‌రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement