-
యూకో కస్టమర్ల ఖాతాల్లోకి రూ. 820 కోట్లు
న్యూఢిల్లీ: సాంకేతిక సమస్య కారణంగా ప్రభుత్వ రంగ యూకో బ్యాంకులోని పలువురు కస్టమర్ల ఖాతాల్లోకి ఏకంగా రూ. 820 కోట్లు పొరపాటున జమయ్యాయి. దీన్ని గుర్తించిన బ్యాంకు రికవరీ ప్రక్రియ ప్రారంభించింది. ఆయా ఖాతాదారుల అకౌంట్లను బ్లాక్ చేసి రూ. 649 కోట్లు (సుమారు 79 శాతం) మొత్తాన్ని రాబట్టినట్లు గురువారం స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు తెలియజేసింది. మిగతా రూ. 171 కోట్లు కూడా రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నామని, తగు చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలకు కూడా తెలియజేసినట్లు వివరించింది. ఈ సాంకేతిక సమస్య మానవ తప్పిదం వల్ల జరిగిందా లేక హ్యాకింగ్ ప్రయత్నమేదైనా జరిగిందా అనే అంశంపై బ్యాంకు స్పష్టతనివ్వలేదు. నవంబర్ 10–13 మధ్య ఇమ్మీడియెట్ పేమెంట్ సరీ్వస్ (ఐఎంపీఎస్)లో సాంకేతిక లోపం కారణంగా ఇతర బ్యాంకులకు చెందిన కస్టమర్లు చేపట్టిన కొన్ని లావాదేవీల్లో తమ బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లోకి నగదు క్రెడిట్ అయినట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఆయా బ్యాంకుల నుంచి తమకు నిధులు అందకుండానే ఈ లావాదేవీలు చోటు చేసుకున్నాయని గుర్తించినట్లు పేర్కొంది. దీంతో తగు చర్యలు ప్రారంభించినట్లు వివరించింది. -
మేం వ్యతిరేకం
గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే(నగదు బదిలీ) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం లేఖాస్త్రం సంధించారు. ఈ విధానం నుంచి తమిళనాడును మినహాయించాలని విన్నవించారు. సాక్షి, చెన్నై: గ్యాస్ సబ్సిడీకి ఆధార్ లింక్ పెట్టడం, వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీని జమ చేసే విధంగా గత యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ ప్రయత్నాలు ఆగాయి. కేంద్రంలో కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన మోడీ ప్రభుత్వం పాత పాటను అందుకుంటోంది. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ గ్యాస్‌కు లింకు పెట్టే పనిలో పడింది. అలాగే గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ రెండో వారం నుంచి కొన్నిచోట్ల ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. మిగిలిన చోట్ల వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లను డీలర్లు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత వ్యతిరేకించారు. తాజాగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం లేఖ రాశారు. ఇదీ సారాంశం: గ్యాస్ సబ్సిడీని వినియోగదారుల బ్యాంక్ ఖాతాలోకి జమ చేసే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో గ్యాస్ విని యోగదారులు అధికంగా ఉన్నారని, కేంద్రం లాగే తామూ సబ్సిడీని అందిస్తున్నామని వివరించారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారి తీస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం ఖాయం అన్నారు. ఈ పరిస్థితుల్లో ఏ ప్రాతిపదికన సబ్సిడీ ఇస్తారో వినియోగదారులకు తెలియని పరిస్థితులు ఏర్పాడతాయని వివరించారు. అలాగే సబ్సిడీ పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యూపీఏ చర్యను గతంలో వ్యతిరేకించిన వారు నేడు అదే బాటలో నడవడాన్ని ఖండిస్తున్నామన్నారు. తమిళనాడులో బ్యాంక్ సేవలు లేని గ్రామాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, ఈ ప్రజలకు సబ్సిడీ ఎలా ఇవ్వగలరని ప్రశ్నిం చారు. బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ పథకం తమిళనాడులో అమలుకు సాధ్యం కాదని, ఈ దష్ట్యా తమకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
భారత టాప్ రెజ్లర్‌పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
తప్పక చదవండి
- కేజ్రీవాల్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement