-
Hyderabad: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకలలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లు, డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) విస్తృత తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. క్యాబ్‌లు, ట్యాక్సీ, ఆటో రిక్షాల డ్రైవర్లు సరైన యూనిఫాం, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ సూచించారు. ప్రయాణికులు రైడ్ బుక్ చేస్తే ఆపరేటర్లు నిరాకరించకూడదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాహన చట్టం–1988 సెక్షన్ 178 కింద ఉల్లంఘన కిందకే వస్తుందని, ఆయా డ్రైవర్‌కు ఈ–చలానా రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు చార్జీలు వసూలు చేసినా ప్రయాణికులు వాహనం, సమయం, స్థలం తదితర వివరాలతో 94906 17346 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయాలని సూచించారు. (క్లిక్ చేయండి: న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షల్లేవ్ ) -
‘నకిలీ నోట్ల’ ఎల్లంగౌడ్ లొంగుబాటు
కర్ణాటక, మహారాష్ట్ర ముఠాలతో సంబంధాలపై ఆరా ఫలించిన కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరికలు హైదరాబాద్: సైబరాబాద్ పోలీసుల హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయి. నకిలీ నోట్ల ముఠా నాయకుడు ఎల్లంగౌడ్ ఎట్టకేలకు లొంగిపోయాడు. మజీద్‌పురా డెకాయి ఆపరేషన్‌లో కానిస్టేబుల్ ఈశ్వర్రావును చంపి పరారైన ఎల్లంగౌడ్ కోసం 18 రోజులుగా సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 14న శంషాబాద్ ఎన్కౌంటర్లో చైన్‌స్నాచర్ శివ మృతి చెందిన సందర్భంగా కమిషనర్ ఎల్లం గౌడ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకకు పారిపోయిన అతడు మెదక్ జిల్లాకు చెందిన ఓ న్యాయవాది, బీజేపీ నేతతో కలసి సైబరాబాద్ పోలీసుల ఎదుట మంగళవారం రాత్రి వచ్చి తుపాకీ సహా లొంగిపోయాడు. నకిలీ నోట్ల తయారీ ముఠాలోని మెదక్ జిల్లా సిద్దిపేటకు చెంది ముస్తఫా, శ్రీకాంత్, ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు అదే ముఠాకు చెందిన రఘు, నరేష్లతో బాలానగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై వెంకట్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఈ నెల 1న మజీద్‌పూర్ చౌరస్తా వద్ద డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లం గౌడ్ చేతిలో కానిస్టేబుల్ ఈశ్వర్రావు కత్తిపోట్లకు గురై మృతి చెందగా.. వెంకట్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన మస్తాన్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముఠా నాయకుడు ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు కమిషనర్ సీవీ ఆనంద్ నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో అతను కర్ణాటకకు పారిపోయాడు. తాజాగా కమిషనర్ హెచ్చరికలతో న్యాయవాదితో వచ్చి లొంగిపోయాడు. ఆరా తీస్తున్న పోలీసులు...: మెదక్ జిల్లా సిద్దిపేట కేంద్రంగా నకిలీ నోట్ల దందా కొసాగిస్తున్న ఎల్లం గౌడ్‌కు కర్ణాటక, మహారాష్ట్రలలోని మరిన్ని ముఠాలతో సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఎల్లం గౌడ్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడి నుంచి నకిలీ నోట్లు ఏఏ రాష్ట్రాలకు వెళ్లాయి...ఈ ముఠా వెనుక ఇంకెందరున్నారు, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయాలపై విచారిస్తున్నారు. ఎల్లం గౌడ్‌పై కర్ణాటక, మహారాష్ట్రలలో పెండింగ్ ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లపైనా ఆరా తీస్తున్నారు. ఎల్లం గౌడ్ ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బుధవారం వీరి అరెస్టును చూపించే అవకాశాలు ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement