-
స్పైడర్ మేన్‌ను దాటిన డెడ్ పూల్!
హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్‌లో ‘డెడ్ పూల్’ ఫ్రాంచైజీ ఒకటి. 2016లో వచ్చిన ‘డెడ్ పూల్’, 2018లో వచ్చిన ‘డెడ్ పూల్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకులను అమితంగా అలరించాయి. తాజాగా ‘డెడ్ పూల్’ సిరీస్‌లోని మూడో భాగం ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మెన్ ప్రధాన పాత్రల్లో, ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ కీలక పాత్రల్లో నటించారు. షాన్ లెవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 26న ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 365 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. 24 గంటల్లో ఇన్ని వ్యూస్ రావడంతో ఇదే ప్రపంచ రికార్డు అని మేకర్స్ పేర్కొన్నారని హాలీవుడ్ అంటోంది. గతంలో ఈ రికార్డు 2021లో విడుదలైన ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ ట్రైలర్ పేరిట ఉండేది. 24 గంటల్లో ‘స్పైడర్ మేన్: నో వే హోమ్’ ట్రైలర్ 355.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ ట్రైలర్ రాకతో ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ సెకండ్ ప్లేస్‌లోకి వెళ్లింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
ఆమెతో నటించాలని ఉంది!
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కెరీర్ టాప్ స్పీడ్ తో దూసుకుపోతోంది. గత ఏడాది వరుస విజయాలు ఆమెను వరించాయి. అమెరికా టీవీ సిరీస్ 'క్వాంటికో' నటించడం ఆమెకు ప్రశంసలు తెచ్చిపెడితే.. దిల్ ధడక్నే దో, బాజీరావు మస్తానీ వంటి సినిమాలు విజయాలను ఇచ్చాయి. దీనికి తోడు ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో విజేతకు పురస్కారం అందజేసే అరుదైన గౌరవం కూడా ప్రియాంకను వరించింది. ఈ ఆనందం ఇలా కొనసాగుతుండగా మరోవైపు హాలీవుడ్ ఆఫర్లు ఈ అమ్మడి గుమ్మం ముందు ఎదురుచూస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ కూడా ఈ దేశీగర్ల్ పై మనసు పారేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రేనాల్డ్స్ మాట్లాడుతూ ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికే ఓ హాలీవుడ్ సినిమాలో కనిపించిన ఆమెతో కలిసి నటించాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. 'నేను ఆమె నటించిన 'క్వాంటికో' చూడలేదు. కానీ ఆమె ఇంటర్వ్యూలు చూశాను. చాలా చార్మింగ్ గా ఉంది. ఆమెకు గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గొప్పగా నటిస్తోంది. ఆమెతో కలిసి పనిచేయడాన్ని నేను ఇష్టపడతాను. ఎందుకు ఆమె అంతా బిగ్ స్టార్ అయిందో నేను స్వయంగా చూస్తాను' అని 'డెడ్ పూల్' స్టార్ రేనాల్డ్స్ పేర్కొన్నారు. బాలీవుడ్ సినిమాల గురించి కూడా ఆయన కొనియాడారు. బాలీవుడ్ సినిమాలు తనకు ఎంతగానో నచ్చుతాయని, అవి ఎంతో సహజంగా, ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement