-
బయట ఉమ్మేస్తే రూ.1000 జరిమానా!
బిల్లు ప్రవేశపెట్టనున్న మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై: క్షయ తదితర అంటువ్యాధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడాన్ని నిషేధించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెల మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తేనుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం, పొగాకు నమలడాన్ని నిషేధించాలని రాష్ట్ర ఆరోగ్యమంత్రి దీపక్ సావంత్ గత ఏడాది ప్రతిపాదించారు. నిషేధాన్ని ఉల్లంఘించేవారికి భారీ జరిమానాతోపాటు బహిరంగ ప్రదేశాలను శుభ్రం చే యడం వంటివి చేయించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. బిల్లు ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో తొలిసారి ఉమ్మితే రూ.1000 జరిమానా చె ల్లించి, ఒక రోజు సామాజికసేవ చేయాల్సి ఉంటుంది. రెండోసారి ఆ నేరానికి పాల్పడితే రూ. 3 వేల జరిమానా చెల్లించి, 3 రోజుల సామాజిక సేవ చేయాలి. పలుమార్లు ఈ నేరానికి పాల్పడితే రూ. 5వేల జరిమానా చెల్లించి, 5 రోజుల సామాజిక సేవ చేయాలి. -
వీళ్లు సీతారాములు...అతను హనుమంతుడు!
అమితాబ్ బచ్చన్ తన దగ్గర పనిచేసేవాళ్లని ఎంతో బాగా చూసుకుంటారట. పండగలకు, ఇతర విశేష సందర్భాలకు భారీగా బహుమతిలివ్వడంతో పాటు వారు కష్టాల్లో ఉంటే ఆదుకుంటారట. తన సిబ్బంది గురించి అంత ఆలోచిస్తారు కాబట్టే, నలభై ఏళ్లుగా తన దగ్గరే మేకప్‌మేన్‌గా చేస్తున్న దీపక్ సావంత్ నిర్మించిన నాలుగు చిత్రాల్లో నటించారు అమితాబ్. తాజాగా దీపక్ సావంత్ తీసిన మరో సినిమాలోనూ నటించారు. అమితాబ్ సతీమణి జయాబచ్చన్ కూడా ఇందులో నటించారు. దీపక్ ఆరేళ్ల క్రితం నిర్మాతగా రంగప్రవేశం చేసి, ఇప్పటివరకు భోజ్‌పురి భాషలో గంగాదేవి, గంగా, గంగోత్రి, మరాఠీలో అక్కా పేరుతో సినిమాలు తీశారు. ఈ నాలుగు చిత్రాల్లోనూ అమితాబ్ నటించారు. ఇటీవల ‘లీడర్’ పేరుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు దీపక్ సావంత్. టైటిల్ రోల్‌ని అమితాబ్, ఆయనకు జోడీగా జయాబచ్చన్ నటిస్తే బాగుంటుందని భావించారు దీపక్. ఈ విషయం చెప్పగానే బచ్చన్ దంపతులు మరో ఆలోచనకు తావివ్వకుండా పచ్చజెండా ఊపేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని అమితాబ్ ముంబయ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు దీపక్ నిర్మించిన చిత్రాల్లానే ఈ ‘లీడర్’ కూడ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని భోజ్‌పురిలో చేశాం. హిందీలో కూడా రూపొందించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అభిషేక్ చద్దా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నీతీ, నిజాయితీకి మారు పేరైన ఓ వ్యక్తి సమాజంలోని చెడుని ఏరిపారేయడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో కామన్ మేన్‌కి అతను ఎలా లీడర్ అయ్యాడు? అనేది ఈ చిత్రం కథాంశమని, లీడర్‌గా అమితాబ్ చేసిన పాత్ర అద్భుతంగా ఉంటుందని దీపక్ సావంత్ పేర్కొన్నారు. అమితాబ్, జయాబచ్చన్‌లు తనకు రాముడు, సీతలాంటివారని, తను హనుమంతుడిలాంటివాణ్ణి అని దీపక్ ఉద్వేగంగా పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement