-
చిత్తంతో చిత్రప్రయాణం
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగికి ఆఫీస్‌కు అవతలి ప్రపంచంపై దృష్టి మళ్లదు. పనే ప్రపంచం అవుతుంది. దీప్తి ఆస్థాన మాత్రం ఆఫీస్ క్యూబికల్‌కు ఆవలి ప్రపంచాన్ని చూడాలనుకుంది. కెమెరా తన నేస్తం అయింది. దేశమంతా తిరుగుతూ స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలను కెమెరా కంటితో ఆవిష్కరిస్తోంది... సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం నుంచి సెల్ఫ్ లెర్నింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రయాణం దీప్తి అస్థాన జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు క్యూబికల్ అవతల తనకు తెలియని ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంది. ఎక్కడికి ప్రయాణం చేసినా కెమెరా తనతోపాటు వచ్చేది. సంభాషించేది. కెమెరా ద్వారా ప్రయాణాలలో లోతైన అర్థాన్ని, సామాజిక ప్రయోజ నాన్ని కనుగొంది దీప్తి. మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి, తాను కలుసుకున్న వ్యక్తుల జీవిత కథలను ప్రపంచంతో పంచుకోవడానికి ఫొటోగ్రఫీ దీప్తికి బలమైన మాధ్యమంలా ఉపయోగపడింది. సాధారణంగా దూర ప్రయాణాలు అనగానే ప్రముఖ, ప్రసిద్ధ స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ దీప్తి మాత్రం అనామక, అంతగా ఎవరూ పట్టించుకోనిప్రాంతాలకు వెళ్లేది. ఆప్రాంతాల గురించి ఎవరూ పనిగట్టుకొని ఫొటోలు తీసి ఉండరు. నాలుగు ముక్కలు రాసి ఉండరు. ఆ పని దీప్తి చేసింది. ఆ తరువాత...‘ఉమెన్ ఇండియా’ప్రాజెక్ట్‌తో తన ప్రయాణాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఇది ఒకటి రెండు నెలల పరిమిత కాల ప్రయాణం కాదు. సంవత్సరాలుగా సాగిన ప్రయాణం. పట్టణాల్లోని మార్పుల సంగతి ఎలా ఉన్నా, పల్లెప్రజలు మాత్రం గతంలోనే ఉన్నారని గ్రహించింది దీప్తి. బాల్య వివాహాల నుంచి ఆడపిల్లలు చదువుకు దూరం కావడం వరకు కెమెరా కంటితో ఎన్నో సమస్యలను లోకం దృష్టికి తీసుకువచ్చి మహిళలు తమ గళం విప్పడానికి ఒక వేదికను నిర్మించింది. సోషల్ మీడియా దృష్టిలో పడని మహిళల సమస్యలను అదే మీడియా ద్వారా నలుగురి దృష్టికి తీసుకు వచ్చింది. సమస్యల గురించి మాత్రమే కాకుండా వివిధప్రాంతాలలోని సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టింది. ‘నా ప్రాజెక్ట్‌లో అన్ని కథలు మనుగడ కోసం చేసే పోరాటానికి సంబంధించినవి మాత్రమే కాదు. జీవితాన్ని, సంస్కృతిని సెలబ్రెట్ చేసుకునేవి కూడా’ అంటుంది దీప్తి. స్ఫూర్తిదాయకమైన కథలు మార్పు తీసుకురాగలవా?’ అని అడిగితే ‘అందుకు నేనే ఉదాహరణ. ఆ మార్పు ముందు నాలోనే వచ్చింది’ అంటుంది దీప్తి. తాను షూట్ చేయడానికి ఎంచుకునే ప్రదేశాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. గుజరాత్‌లోని మిధాపూర్లో పన్నెండేళ్ల భారతితో మాట్లాడింది దీప్తి. ఆ అమ్మాయి ఎప్పుడూ బడి ముఖం చూడలేదు. కొంతకాలం ఇంటిపట్టునే ఉన్న భారతి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు కూలిపనికి వెళుతుంది. ఈ చిన్నారి పెద్ద పెద్ద తట్టలను మోస్తున్న దృశ్యం చూసి దీప్తికి కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘భారతి అందమైన, చురుకైన అమ్మాయి. ఆమె భవిష్యత్ కూలిపనులకు పరిమితం కావాల్పిందేనా? అనే బాధ కలిగింది. కెమెరా గురించి భారతి ఆసక్తిగా తెలుసుకుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఇలాంటి పిల్లలకు కొత్త దారి చూపితే పురోగమించగలరు’ అంటుంది దీప్తి. భారతి లాంటి ఎంతోమంది పిల్లల కథలను లోకం దృష్టికి తీసుకువచ్చింది. పట్టణ ప్రాం తాలలో పెరిగిన దీప్తి దేశ విదేశాల్లో ఎన్నో మెట్రోపాలిటన్ నగరాలలో పనిచేసింది. ‘సమాజ నిర్మాణంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమాన అవకాశాలు లేవు’ అనే ఎరుక ఆమెను ఎప్పటికప్పుడు కొత్తప్రాంతాలకు తీసుకు వెళుతుంది. కొత్త జీవితాలను ఆవిష్కరించేలా చేస్తున్న దీప్తి ప్రస్తుతం గోవాలో ఉంటోంది. లక్ష్యంతో కూడిన ప్రయాణం భావాలను వ్యక్తీకరించడానికి పుస్తకం రాయడం, ఉపన్యాసం చేయడం లాగే ఫొటోగ్రఫీ కూడా ఒక సాధనం. నేను తీసిన చిత్రాలు నా భావాలకు అద్దం పట్టేలా ఉంటాయి. ఒక మహిళగా ఇతర మహిళలు, పిల్లలతో మాట్లాడడం నాకు సులువు అయింది. సోలోగా ట్రావెల్ చేయడంలో లైఫ్‌స్కిల్స్ క్రమక్రమంగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రయాణానికి ఒక లక్ష్యం తోడైతే అది అద్భుతంగా ఉంటుంది. – దీప్తి అస్థాన వారి జీవితంలో భాగం అవుతాను కెమెరా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి జీవితపు లోతు అప్పటికప్పుడు ఆవిష్కారం కాదు. వారితో సరిగ్గా కనెక్ట్ కాగలగాలి. మనం వారిని అర్థం చేసుకున్నట్లే వారూ మనల్ని అర్థం చేసుకోవాలి. తమ గురించి తెలుసుకోవడంలో, కెమెరా ఉపయోగించడంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనం లేదనే భావన వారికి కలగాలి. ఇదేమంత సులభం కాదు. అలా అని జటిలం కాదు. మన ఓపిక, ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఫోటోలు తీసుకున్నప్పుడు వారి జీవితంలో భాగం అవుతాను. వారు నాలో భాగం అవుతారు. కలిసి భోజనం చేస్తాం. సరదా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటాం. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా తమలో భాగంగా చూసుకున్నారు. ఆత్మీయత పంచారు. ఇది నా అదృష్టం. – దీప్తి అస్థాన -
దీప్తి ‘పసిడి’ పరుగు
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో రెండో రోజూ భారత క్రీడాకారులు తమ పతకాల వేట కొనసాగించారు. తొలి రోజు సోమవారం 17 పతకాలు నెగ్గిన భారత ప్లేయర్లు... రెండో రోజు మంగళవారం ఏకంగా 18 పతకాలతో అదరగొట్టారు. ఇందులో నాలుగు స్వర్ణ పతకాలు ఉన్నాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి జీవంజి దీప్తి మహిళల 400 మీటర్ల టి20 కేటగిరీలో పసిడి పతకాన్ని సాధించింది. వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అందరికంటే వేగంగా 400 మీటర్ల దూరాన్ని 56.69 సెకన్లలో పూర్తి చేసి ఆసియా పారా గేమ్స్‌తోపాటు ఆసియా రికార్డును సృష్టించింది. మహిళల కనోయింగ్ ఎల్2 ఈవెంట్లో ప్రాచీ యాదవ్ 500 మీటర్ల దూరాన్ని 54.962 సెకన్లలో అధిగమించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్54/55/56) కేటగిరీలో నీరజ్ యాదవ్ డిస్క్‌ను 38.56 మీటర్ల దూరాన్ని విసిరి విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల 5000 మీటర్ల (టి13 కేటగిరీ) విభాగంలో శరత్ శంకరప్ప 20ని:18.90 సెకన్లలో రేసును ముగించి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. రెండో రోజుల పోటీలు ముగిశాక భారత్ 10 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తం 35 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. -
ద్రోహి
సందీప్ కుమార్, దీప్తీ వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘ద్రోహి’. ‘ద క్రిమినల్’ అన్నది ఉపశీర్షిక. గుడ్ ఫెలో మీడియా, సఫైరస్ మీడియా, వెడ్నెస్ డే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, డి. శ్రీకాంత రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని మల్టీప్లెక్స్‌లో రూ. 112లకే సినిమా టిక్కెట్ ఇస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమా టీజర్‌ని నటుడు త్రిగుణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘సందీప్, విజయ్‌లకు కళ అంటే ప్రాణం. దర్శకుడి పని తీరు టీజర్లో కనిపించింది. ఈ చిత్రం విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘అద్భుతమైన డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. క్రైమ్, థ్రిల్లర్‌తో పాటు అన్ని అంశాలున్నాయి’’ అన్నారు సందీప్ కుమార్. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉన్నాయి.. ఎవర్నీ నిరాశపరచదు’’ అన్నారు విజయ్ పెందుర్తి. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు నటి డెబా డాలీ. ఈ చిత్రానికి కెమెరా: అశోక దార్బీరు, సంగీతం: అనంత నారాయణ్. -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్‌రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్‌కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్‌తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్‌లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్‌పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్‌పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్‌షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్‌ను నాగ్‌పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
ప్రియుడి కోసం.. అక్కకు వోడ్కా తాగించి.. చేతులు కట్టేసి..
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో సంచలనంగా మారిన జగిత్యాల దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. దీప్తి హత్య కేసును పోలీసులు చేధించారు. ప్రియుడి సహకారంతో చెల్లినే అక్కను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే క్రమంలో సొంత అని కూడా చూడకుండా చందన.. దారుణానికి ఒడిగట్టింది. హత్య ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ ఆమె తగించినట్టు పోలీసులు తెలిపారు. దీప్తి హత్య కేసు వివరాలను జగిత్యాల ఎస్పీ భాస్కర్ శనివారం మీడియాకు వెల్లడించారు. "కోరుట్లకు చెందిన బంక చందన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఉమర్ షేక్ సుల్తాన్(25) అనే యువకుడు చందనకు వన్ ఇయర్ సీనియర్. బీటెక్‌లో చందన ఒక ఏడాది డిటెయిన్డ్ అయింది. ఇక ఉమర్ రెండేళ్లు డిటెయిన్డ్ అయ్యాడు. దీంతో ఇద్దరు క్లాస్మేట్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ఏర్పడింది. ప్రేమలో పడ్డారు". పెళ్లి ప్రపోజల్.. ప్రేమ అనంతరం.. తనను పెళ్లి చేసుకోవాలని ఉమర్‌ను చందన కోరింది. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఉమర్‌ను చందన కోరుట్లకు పిలిపించింది. పెళ్లి చేసుకోవాలని అతన్ని కోరింది. అయితే, ఇద్దరు ఇంకా సెటిల్ కాకపోవడంతో తర్వాత పెళ్లికి ప్లాన్ చేద్దామని ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఉమర్ తల్లి సయ్యద్ అలియా, చెల్లి ఫాతిమా, స్నేహితుడు హాఫీజ్తో చందన మాట్లాడినట్టు తెలిపారు. అక్కకు వోడ్కా తాగించి.. ఆగస్టు 28న కాల్ చేసి "ఓ ఫంక్షన్ నిమిత్తం మా అమ్మ, నాన్న హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంట్లో నేను, మా అక్కనే ఉంటామని చందన.. ఉమర్‌కు చెప్పింది. ఇంట్లో మనీ, బంగారం ఉంది. అది తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటే.. సెటిలవుతామని" చెప్పింది. ఆగస్టు 28న ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి 11 గంటలకు కోరుట్లకు ఉమర్ చేరుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ తెప్పించింది చందన. రాత్రి సమయంలో దీప్తి, చందన కలిసి వోడ్కా, బ్రీజర్ తాగారు. రాత్రి 2 గంటల సమయంలో ఉమర్‌కు మేసేజ్ చేయడంతో ఇంటి వెనుకాల కారు ఆపి ఇంట్లోకి వచ్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీస్తున్న సమయంలో దీప్తికి మెలకువ వచ్చి లేచింది. గట్టిగా అరిచింది. చందన తన వద్ద స్కార్ఫ్‌తో దీప్తి మూతికి, ముక్కుకు చుట్టింది. ఆమె సోఫా మీద పడిపోయింది. ఉమర్, చందన కలిసి ఆమె చేతులు కట్టేశారు. గట్టిగా అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు. పది నిమిషాల తర్వాత దీప్తిలో చలనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. డబ్బు, బంగారంతో పరారీ.. అక్క అచేతన స్థితిలో ఉండిపోవడంతో.. ఇంట్లో ఉన్న ఒక లక్షా 20 వేల నగదు, 70 తులాల బంగారం బ్యాగులో వేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దీప్తికి ప్లాస్టర్ తీసేసి వెళ్లారు. వోడ్కా తాగి చనిపోయినట్లు అందరు నమ్మేలా సీన్ క్రియేట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉమర్ తల్లి, చెల్లి, బంధువుకు జరిగిన విషయం చెప్పి.. నగదు, బంగారంతో.. ముంబై, నాగ్‌పూర్ వెళ్లాలని చందన, ఉమర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకుని, సెటిల్ అవ్వాలని అనుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్, ఏ3 సయ్యద్ అలియా, ఏ4 ఫాతిమా, ఏ5 హాఫీజ్‌గా చేర్చామని తెలిపారు. ఈ ఐదుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. ఇది కూడా చదవండి: సహజీవనం పేరుతో ఒక్కో సీజన్లో ఒక్కో భాగస్వామి.. ఆరోగ్యకరం కాదు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్‌లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్‌ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement