-
Detective Karthik: ‘డిటెక్టివ్ కార్తీక్’ మూవీ రివ్యూ
టైటిల్: డిటెక్టివ్ కార్తీక్ నటీనటులు: రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శృతి మోల్, అనూష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారీ, యెషో భరత్ రెడ్డి తదితరులు నిర్మాత: అశోక్ రెడ్డి దర్శకత్వం: వెంకట్ నరేంద్ర సంగీతం: మార్కస్ ఎం విడుదల తేది: జులై 21, 2023 మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహించారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి మరియు యేషో భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘డిటెక్టివ్ కార్తీక్’ కథేంటంటే.. పదో తరగతి చదువుతున్న రిషిత అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఈ కేసును ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సంధ్య(శ్రుతీ చంద్రన్) టేకాప్ చేస్తుంది.స్నేహితురాలు పల్లవి(గోల్డి నిస్సి)తో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. ఓ రోజు సంధ్య కిడ్నాప్‌కు గురవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న మరో ప్రైవేట్ డిటెక్టివ్ కార్తీక్(రజత్ రాఘవ్)సంధ్య మిస్సింగ్ కేసుతో పాటు రిషిత మర్డర్ కేసును కూడా ఛేదించాలని చూస్తాడు. అసలు సంధ్యను కిడ్నాప్ చేసిందెవరు? రిషితను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? ఈ కేసులను విచారించే క్రమంలో కార్తీక్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? వీటన్నింటిని అధిగమించి సంధ్య మిస్సింగ్ కేసుతో పాటు రిషిత హత్య కేసును ఎలా ఛేదించాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగానే ఉంటాయి.గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను వెండితెరపై ఆవిష్కరిస్తే చాలు ప్రేక్షకులకు కుర్చీలో నుంచి కదల కుండా కట్టి పడేయొచ్చు. ఓటీటీలో కూడా ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. నేరం జరిగిన తీరు.. ధాన్ని చేధించే విధానం.. ఈ క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు..మలుపులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. ఇక డిటెక్టివ్ కార్తీక్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. నేటి టెక్నాలజీ యుగంలో యువత బాగా ఫేస్ చేస్తున్న ఓ సైబర్ క్రైం ను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు వెంకట్ నరేంద్ర.ఓ మంచి సందేశాన్ని కూడా ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాలను... దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే దాన్ని చూపించారు. అయితే ఇన్వెస్గిగేషన్ తీరు మాత్రం చప్పగా, సినిమాటిక్‌గా అనిపిస్తుంది. రిషిత హత్యతొ కథ ప్రారంభం అవుతుంది. ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్ సంధ్య టేకాప్ చేసుకోవడం.. ఆమె మిస్ అవ్వడం చకచక జరిగిపోతుంది. ఈ కేసును కార్తీక్ టేకాప్ చేసినప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఇక ఫస్టాఫ్ మొత్తం రిషిత హత్య కేసు విచారణకే పరిమితం అవుతుంది. ఆమెను హత్య చేయడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. ఇక సెకండాఫ్ మొత్తం సంధ్య మిస్సింగ్ కేసు చుట్టు తిరుగుతుంది. డబ్బు మీద వ్యామోహంతో కొంతమంది ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారనేది చూపించారు. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నా.. ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో ఒకరిద్దరు మినహా అందరూ కొత్తవాళ్లే. అయినా కూడా ఆ విషయం ఎక్కడా కనిపించకుండా చక్కగా నటించారు. టైటిల్ రోల్ పోషించిన రజత్ రాఘవ్... డిటెక్టివ్ పాత్రకు న్యాయం చేశాడు. సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక పల్లవిగా గోల్డీ నిస్సీ, సంధ్యగా శృతిమోల్ తమ పాత్రల పరిధిమేర చక్కగా చటించారు. కార్తీక్ ఫ్రెండ్‌గా హరి, కంప్యూటర్ టీచర్ రాహుల్ పాత్రలో అభిలాష్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఆకట్టుకుంటున్న డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్
మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి మరియు యేషో భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...పదో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంధ్య అనే యువతి కూడా మిస్సింగ్ అవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న అబ్బాయి కార్తీక్ ఆమె మిస్సింగ్ కేసుతో పాటు పాటు స్కూల్ స్టూడెంట్ మర్డర్ కేసును కూడా ఛేదించాలని చూస్తాడు. కానీ అతని ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో డౌట్స్, హర్డిల్స్ ఎదురవుతాయి. ఎన్ని కోణాల్లో చూసినా క్లూస్ దొరకవు. ఇంత క్లిష్టమైన కేసును హీరో ఎలా సాల్వ్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. తక్కువ బడ్జెట్ లో కూడా టెక్నిక్ ఉంటే మేకింగ్ లో మంచి క్వాలిటీ తీసుకురావచ్చని ఈ చిత్ర ట్రైలర్ చూపించింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
స్వాతిమలివాల్‌పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్‌పై రైనా
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డి
విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
నటుడు వరుణ్ సూద్‌కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?
Virat Kohli: కీలక మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్?!
T20 Worldcup 2024: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
చరణ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్
తప్పక చదవండి
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- RR vs RCB: వార్ వన్‌సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement