-
వరంగల్: రెండు వారాలు కావస్తున్నా, ఇంకా అప్డేట్ కాలే!
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా ఏర్పడి రెండు వారాలు కావస్తున్నా.. ఇటు అధికారులు, అటు ప్రజలను మార్గదర్శనం చేసే భౌగోళిక వివరాలతో కూడిన జిల్లా వెబ్సైట్ ఇంకా పూర్తిస్థాయిలో అప్డేట్ కాలేదు. పూర్వ వరంగల్ అర్బన్ జిల్లా నుంచి కలిసిన వరంగల్, ఖిలావరంగల్ కలుపుకొని మిగిలిన 11 మండలాలతో వరంగల్ జిల్లా చిత్రపటం(మ్యాప్) మాత్రమే వెబ్సైట్లో పొందుపరిచారు. అసలు విషయం ఏమిటంటే.. వరంగల్‌రూరల్.తెలంగాణ.జీవోవీ.ఇన్తోనే వెబ్సైట్ ప్రజలకు అందుబాటులో ఉంది. అయితే ఈ సైట్ క్లిక్ చేయగానే తొలుత హోంపేజీలో వరంగల్ జిల్లా అని కనిపిస్తోంది. చదవండి: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పునర్విభజన? మిగతా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల లెక్క చూసుకుంటే వరంగల్ రూరల్ జిల్లా లెక్కల ప్రకారం మూడు రెవెన్యూ డివిజన్లు, మూడు మున్సిపాలిటీలు, 16 మండలాలు, 401 గ్రామాలుగానే ఉంది. హనుమకొండ జిల్లాలో కలిసిన ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట మండలాలు కూడా వరంగల్ రూరల్ కిందనే ఉన్నట్టుగా సైట్లో కనిపిస్తోంది. ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటున్న నేటి సమాజంలో వీటిని అప్డేట్ చేయాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజలతో పాటు ఈ ప్రాంతాలకు వివిధ పనుల కోసం వచ్చేవారికి జిల్లా అధికారుల పాత సమాచారమే ఉండడంతో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే వెబ్సైట్ అప్డేట్ చేయాల్సిన అవసరముందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. చదవండి: చివరి రక్తపు బొట్టు దాకా దళితుల కోసం పోరాడతా: సీఎం కేసీఆర్ గాడిన పడని ప్రభుత్వ విభాగాలు జిల్లా స్వరూపం మారడంతో అందుకు సంబంధించిన వివరాలతో హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు జిల్లా ఎౖMð్స జ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్ మండలాలతో కలుపుకొని 13 మండలాల వైన్‌షాప్‌లు, బార్లు.. తదితరాల పనులు పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం పూర్వ వరంగల్ రూరల్ జిల్లాలోని మండలాల వారిగానే ఎక్సైజ్ కార్యకలాపాలు సాగుతున్నాయని సంబంధిత విభాగాధికారి తెలిపారు. అలాగే ఆరోగ్య విభాగానికొస్తే పూర్వ వరంగల్ రూరల్ నుంచి నాలుగు పీహెచ్‌సీలు, ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హనుమకొండ జిల్లాకు వెళ్తుండగా.. హనుమకొండ జిల్లా నుంచి ఒక పీహెచ్సీ, నాలుగు సబ్‌సెంటర్లు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఎంజీఎం, ఆయుర్వేదిక ఆసుపత్రి.. తదితరాలు వరంగల్ జిల్లాలోకి వచ్చాయి. అయితే జిల్లాస్థాయిలో అధికారులు వీటిని విభజించుకున్నా.. ఎలా రిపోర్టింగ్ చేయాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన లేఖను హైదరాబాద్‌లోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు ఇరు జిల్లాల ఆరోగ్యవైద్యాధికారులు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రా గానే.. రోజువారి వివరాలను కొత్త జిల్లాల వారిగా పంపించనున్నారు. ప్రస్తుతం సమన్వయంతో కలిసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆ విభాగ వర్గాలు తెలిపాయి. అలాగే భూ గర్భజల గనుల శాఖ, మత్స్య విభాగం, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖలు కూడా త్వరలోనే కొత్త జిల్లాల వారీగా కార్యకలాపాలు సాగించేందుకు అధికారికంగా ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. కొత్త జిల్లా ప్రకారమే.. ఇక రెవెన్యూ విషయానికొస్తే వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్తో సహా 13 మండలాలవారీగా భూమి, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు సంబంధిత అధికారులు చూసుకుంటున్నారు. జిల్లా విద్యావిభాగాధికారులు కొత్తగా ఏర్పడిన వరంగల్ జిల్లా ప్రకారమే ప్రభుత్వ పాఠశాలలు పర్యవేక్షిస్తున్నారు. ఇక వర్షపాతం వివరాలు కూడా వరంగల్ జిల్లా ప్రకారమే అధికారులు లెక్కలు చేస్తున్నారు. అయితే కొత్త జిల్లా ప్రకారం అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన అవసరముందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎటో..స్పష్టత ఏదీ? కాకతీయ మెడికల్ కాలేజీ 130.30 ఎకరాల్లో విస్తరించి ఉంటే ఇందులో వరంగల్ జిల్లాలో 55 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 75.30 ఎకరాలు ఉంది. సెంట్రల్ జైలు విషయానికొస్తే 56.39 ఎకరాల్లో ఉన్న జైలు 44.34 ఎకరాలు వరంగల్ జిల్లాలో, 12.15 ఎకరాలు హనుమకొండ జిల్లాలో ఉంది. 15.30 ఎకరాల్లో ఉన్న బాలుర, బాలికల పాలిటెక్నిక్ కాలేజీ వరంగల్ జిల్లాలో రెండు ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 13.30 ఎకరాలు ఉంది. 530 ఎకరాల్లో ఉన్న భద్రకాళి బండ్ ప్రాంతం వరంగల్ జిల్లాలో 113 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 417 ఎకరాలు ఉంది. 5.17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ అండ్ కాలేజ్ వరంగల్ జిల్లాలో 3.17 ఎకరాలు, హనుమకొండలో రెండు ఎకరాల్లో ఉంది. వీటిని ఏ జిల్లాలో ఉంచాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని అధికారులు అంటున్నారు. -
కిషన్ సార్.. గిదేంది?
జిల్లా వెబ్సైట్లో తప్పులు - ఉప ముఖ్యమంత్రికి దక్కని చోటు - పొన్నాల, సారయ్య ఇంకా మంత్రులే.. - కనిపించని కొత్త ఎమ్మెల్యేల ముఖాలు - జిల్లాలో 669 ఎంపీటీసీ స్థానాలేనట.. - కనిపించని తెలంగాణ సర్కారు అంశం జిల్లా ప్రజలకు ఓ మనవి. ‘దీని కోసం ఆఫీసు దాకా రావడమెం దుకు.. ఇంటర్నెట్లో చూసుకోండి’ అని చులకనగా మాట్లాడే కలెక్టర్ కార్యాలయ ఉన్నతాధికారుల మాటలు నమ్మకండి. జిల్లా అధికారిక వెబ్సైట్ చూడకండి. ఎందుకంటారా.. అందులో ఉండే వివరాలకు.. వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న నూతన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం దాటినా... జిల్లా వెబ్సైట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారులోని వారే మంత్రులుగా ఉన్నారు. ప్రభుత్వ అధికారిక సమాచారం వెల్లడించే జిల్లా వెబ్సైట్లో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం విషయం అసలే లేదు. సాక్షి ప్రతినిధి, వరంగల్ :సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కాకముందే కలెక్టర్ కిషన్ కలిసి వచ్చారు. జిల్లా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ సహా కీలక అధికారులందరూ వెళ్లారు. అయితే రాజయ్య డిప్యూటీ సీఎం అనే విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా గుర్తించడం లేదు. జిల్లా అధికారిక వెబ్సైట్లో పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇంకా మంత్రులుగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో గెలిచిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలా చూడబోతే ఎన్నో వింతలు జిల్లా వెబ్సైట్లో ఉన్నాయి. విదుల్లో జిల్లా అధికార యంత్రాంగం అలసత్వాన్ని తెలియజేసేలా వెబ్సైట్లో సమాచారం ఉంది. కలెక్టర్ కిషన్ పర్యవేక్షణలో ఉండే అధికారిక వెబ్సైట్లోనే ఇలా ఉండడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో సర్కారు ఏర్పడింది. జిల్లాకు చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2నే సర్కారు కొలువుదీరింది. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగాయి. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా వరంగల్‌లో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఓరుగల్లు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ని చేసిన జిల్లా అధికార యంత్రాంగమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కొత్త రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిందనే విషయాన్ని గుర్తించడంలేదు. ఇదొక్కటే కాదు ఏవో ఒకటిరెండు అంశాల్లో తప్పితే ఏ సమాచారం కూడా ఈ వెబ్సైట్లో సరిగా లేదు. వెబ్సైట్లో విచిత్రాలు ఇవీ.. - ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇంకా మంత్రులుగానే ఉన్నారు. వీరు జనగామ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా ఉన్నారట. గండ్ర వెంకటరమణారెడ్డి, సత్యవతి రాథోడ్, మొలుగూరి బిక్షపతి, మాలోతు కవిత, దనసరి అనసూయ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండేటి శ్రీధర్ ఎమ్మెల్యేలుగా, కొండా మురళీధర్‌రావు ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు. - కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేసి రెండు వారాలు దగ్గరపడుతోంది. జిల్లా వెబ్సైట్లో మాత్రం వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా ఇంకా సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ ఎంపీగా బలరాంనాయక్, భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి రాజగోపాల్ ఉన్నారు. - జిల్లాలో ఇటీవలే 705 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులే ప్రకటించారు. వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం మాత్రం జిల్లాలోని ఎంపీటీసీ స్థానాలు 669 మాత్రమే. - గత ఏడాది జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వెబ్సైట్లో ఉన్న సమాచారంలో మాత్రం జిల్లాలో 1,014 గ్రామపంచాయతీలు ఉన్నట్లుగా ఉంది. - ఇటీవలే జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలకు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లా అధికారిక వెబ్సైట్లో మాత్రం జిల్లాలో రెండు మాత్రమే పురపాలక సంఘాలు ఉన్నాయి. - 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 35,22,644. ఈ వివరాలు వచ్చి ఏడాది దాటుతున్నా జిల్లా వెబ్సైట్లో 2001 గణాంకాలే ఉన్నాయి. వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం మన జిల్లా జనాభా 32.46 లక్షలు ఉంది. - మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 2010లోనే జరిగినట్లు వెబ్సైట్లో ఉంది. 2012, 2014లో జాతర జరిగిన విషయం అధికారులు గుర్తించినట్లు లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ స్థానానికి ఓటింగ్ తేదీలో మార్పు.. ఆరో దశలో ఎన్నికలు!
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
Advertisement